Share News

పేపర్ లీక్స్‌కు పరిష్కారం అదే.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనీ

ABN , Publish Date - Oct 13 , 2026 | 03:43 PM

ప్రశ్న పత్రాల లీకేజీ ఉదంతాలపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని తాజాగా స్పందించారు. చివరి నిమిషంలో పేపర్ సెట్టింగ్, కంప్యూటర్ ఆధారిత టెస్టింగ్ సెంటర్స్‌తో పరీక్షను నిర్వహించవచ్చని అన్నారు.

పేపర్ లీక్స్‌కు పరిష్కారం అదే.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనీ
Nandan Nilekani on Paper Leak Issue

ఇంటర్నెట్ డెస్క్: ప్రశ్న పత్రాల లీకేజీ ఉదంతాలపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని తాజాగా స్పందించారు. చివరి నిమిషంలో పేపర్ సెట్టింగ్, కంప్యూటర్ ఆధారిత టెస్టింగ్ సెంటర్స్‌తో పరీక్షను నిర్వహించవచ్చని అన్నారు. ప్రశ్న పత్రంపై ఆధారపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పరీక్ష విధానంలో మార్పులతో ఈ సమస్యకు పరిష్కారించవచ్చని సూచించారు.

పరీక్షల నిర్వహణకు ఏదోక ప్రశ్నపత్రంపై ఆధాపడే బదులు భారీ సంఖ్యలో వివిధ రకాల ప్రశ్నలు ఉండే ఓ క్వశ్చన్ బ్యాంక్‌ను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. వాటి నుంచి చివరి నిమిషంలో ప్రశ్నపత్రం సిద్ధం చేసి విద్యార్థులకు అందించాలని అన్నారు. దీంతో, ప్రశ్నపత్రాన్ని ముందుగానే సిద్ధం చేయాల్సిన అవసరం తప్పిపోతుందని చెప్పారు. ‘ప్రశ్న పత్రం ఉందంటే దాన్ని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించే వారు ఉంటారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.


ఈ సమస్య పరిష్కారానికి కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానం వైపు మళ్లాలని సూచించారు. ఇందుకోసం పరీక్షా కేంద్రాల నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించాలని ఆయన సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1.5 లక్షల కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాసే సదుపాయం ఉందని అన్నారు. దీన్ని మరింతగా విస్తరించాలని సూచించారు. వీటి అమలుపై ప్రధాని కూడా సుముఖంగానే ఉన్నారని తెలిపారు. ఇటీవల దేశంలో కలకలం రేపిన నీట్ పేపర్ లీక్ ఉదంతం చివరకు కేంద్ర మంత్రి రాజీనామాకు దారి తీసిన విషయం తెలిసింది. లీకులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది.


ఈ వార్తలనూ చదవండి:

అత్తమామల వేధింపులతో ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య.. సుసైడ్ నోట్ కలకలం!

గుజరాత్‌ మాజీ మంత్రి హత్య కేసు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Updated Date - Oct 13 , 2026 | 04:31 PM