నాసా–స్పేస్‌ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ISSకు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక
ABN , Publish Date - Oct 13 , 2026 | 06:26 PM
నాసా కోసం స్పేస్‌ఎక్స్ అంతరిక్షంలోకి సరుకు రవాణా నౌకని పంపించింది. ఈ స్పేస్ షిప్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న వ్యోమగాముల కోసం 2,800 కేజీలకు పైగా ఆహారం, రోజువారీ సామగ్రి, సోలార్ పరికరాలు, కీలక శాస్త్రీయ ప్రయోగ సామగ్రిని పంపించారు.
NASA SpaceX Dragon Mission: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) నివసించే వ్యోమగాముల కోసం నాసా (NASA) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్గో మిషన్ విజయవంతమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఇవాళ (అక్టోబర్ 13, 2026) సాయంత్రం 4:03 గంటలకు స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 (SpaceX Falcon 9) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ఈ రాకెట్ ద్వారా మానవ రహిత 'డ్రాగన్' (Dragon) కార్గో అంతరిక్ష నౌకను పంపారు. ఇందులో వ్యోమగాముల కోసం 2,800 కేజీలకు పైగా ఆహారం, రోజువారీ సామాగ్రి, నూతన పరికరాలు, అత్యంత కీలకమైన శాస్త్రీయ ప్రయోగ సామగ్రిని పంపినట్లు నాసా వెల్లడించింది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్)తో డాకింగ్
సుమారు 52 గంటల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన తర్వాత, ఈ డ్రాగన్ అంతరిక్ష నౌక గురువారం (అక్టోబర్ 15) రాత్రి 8:30 గంటల ప్రాంతంలో కక్ష్యలోని ప్రయోగశాలతో (ISS) దానికదే అనుసంధానం (Docking) కానుంది. నాసా కోసం స్పేస్‌ఎక్స్ చేపట్టిన 35వ వాణిజ్య కార్గో డెలివరీ మిషన్ ఇది. వ్యోమగాములకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నాసా క్రమం తప్పకుండా ఈ సరుకులను పంపిస్తోంది.
డ్రాగన్ నౌకలో ఏయే సరుకులు ఉన్నాయి?
అంతరిక్ష కేంద్రానికి విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన నూతన సోలార్ అర్రే ప్యానెల్స్, మానవ ఆరోగ్యానికి సంబంధించిన విప్లవాత్మక ప్రయోగ సామాగ్రి కూడా ఉన్నాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల పరిశోధన కోసం ప్రయోగశాలలో పెంచిన చిన్నపాటి మానవ మెదడు కణజాల నమూనాలు (Human brain tissue models) కూడా ఈ నౌక ద్వారా పంపించారు.
అంతరిక్షంలోని గురుత్వాకర్షణ లేని వాతావరణంలో కృత్రిమ రెటీనా (Artificial retinas), హార్ట్ టిష్యూ (Heart tissue) 3D నమూనాల తయారీకి సంబంధించిన ప్రయోగాలు,
నవంబర్ రెండో వారం వరకు ఐఎస్‌ఎస్‌లోనే ఉండనున్న ఈ డ్రాగన్ నౌక.. అక్కడ పూర్తయిన ప్రయోగాలు, శాస్త్రీయ నమూనాలను తీసుకుని తిరిగి భూమికి రానుంది.
ఈ వార్తలనూ చదవండి:
భారత్ భవిష్యత్తుకు సెమీకండక్టర్ల రంగమే కీలకం: టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్
ఐటీ షేర్లలో కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్‌లో మళ్లీ జోష్..