Share News

భారత్ భవిష్యత్తుకు సెమీకండక్టర్ల రంగమే కీలకం: టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్

ABN , Publish Date - Oct 13 , 2026 | 01:05 PM

సెమీకండక్టర్ల రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు భారత్ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు.

భారత్ భవిష్యత్తుకు సెమీకండక్టర్ల రంగమే కీలకం: టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్
N Chandrasekaran

ఇంటర్నెట్ డెస్క్: సెమీకండక్టర్ల రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు భారత్ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. లాభాలు రావడానికి సమయం పట్టినప్పటికీ.. ఈ రంగంలో వ్యూహాత్మక పెట్టుబడులు పెడితే దీర్ఘకాల ప్రయోజనాలుంటాయని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్లూమ్‌బర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరమ్‌-2026లో పాల్గొన్న చంద్రశేఖర్ దేశ ఆర్థిక వ్యవస్థను విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెమీకండక్టర్ల విషయంలో రెండు మూడు సంవత్సరాల్లో నిర్ణీత లక్ష్యాలను చేరుకోవడం కంటే దీర్ఘకాలిక అభివృద్ధి సాధించడం ముఖ్యమని అన్నారు.


‘ఏదైనా రంగం భవిష్యత్తులో దేశానికి అవసరమని భావిస్తే ఆ రంగంలో ఇప్పటి నుంచి పెట్టుబడులు పెట్టాలి. గతం అదే పని చేశారు టాటా గ్రూప్ స్థాపకుడు జె.ఎన్ టాటా. అప్పట్లో స్టీల్, విద్యుత్ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. అది గమనించిన ఆయన భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ ఆలోచన ఎంతటి అభివృద్ధిని సాధించిందో తెలిసిందే’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టడం అవసరమని ఆయన వివరించారు.


సెమీకండక్టర్ల పరిశ్రమను నిర్మించడం అంత సులభం కాదని, అందుకు భారీ పెట్టుబడులతోపాటు ఆర్థిక క్రమశిక్షణ అవసరమని టాటా సన్స్ ఛైర్మన్ తెలిపారు. కాగా ఈ చర్చలో చంద్రశేఖర్‌తో పాటు మాజీ యూకే ప్రధాని మంత్రి రిషి సునాక్, బ్లాక్‌స్టోన్ సంస్థ అధ్యక్షుడు జోనాథన్ గ్రే పాల్గొ్న్నారు.


ఈ వార్తలూ చదవండి

ఐటీ షేర్లలో కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్‌లో మళ్లీ జోష్‌..

డిజిటల్‌, ఏఐ నిపుణులకు టీసీఎస్‌ పెద్దపీట

Updated Date - Oct 13 , 2026 | 01:29 PM