డిజిటల్, ఏఐ నిపుణులకు టీసీఎస్ పెద్దపీట
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:10 AM
దేశంలోనే అతిపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కొత్తగా నియమించుకునే ఉద్యోగుల విషయంలో తన పంథాను మార్చుకుంటోంది
కొత్త నియామకాల్లో వీరికే 80శాతం అవకాశం
ముంబై: దేశంలోనే అతిపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కొత్తగా నియమించుకునే ఉద్యోగుల విషయంలో తన పంథాను మార్చుకుంటోంది. డిజిటల్, కృత్రిమ మేధ(ఏఐ) నైపుణ్యాలున్న వారికే నియామకాల్లో పెద్దపీట వేస్తోంది. భవిష్యత్తులో కంపెనీ నియమించుకునే కొత్త ఉద్యోగుల్లో 80 శాతం డిజిటల్, ఏఐ నైపుణ్యాలున్న వారే ఉంటారని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆరతి సుబ్రమణియన్ తెలిపారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆదాయంలో ఏఐ ఆధారిత సేవల వాటా 10 శాతానికి పెరిగిందని, ఏఐ రాబడుల వృద్ధి లాభాల మార్జిన్లను పెంచుకోవడానికి దోహదపడుతుందన్నారు.