Share News

వాదిస్తే నిజాలు అబద్ధాలు కావు.. లద్దాఖ్‌పై చైనాకు భారత్ కౌంటర్

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:04 PM

భారత్‌లో లద్దాఖ్ అంతర్భాగమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. లద్దాఖ్ భారత్‌లో అంతర్భాగం కాదంటూ చైనా వ్యక్తం చేసిన అభ్యంతరంపై గట్టి కౌంటర్ ఇచ్చింది. చైనా అడ్డగోలుగా వాదించినంతమాత్రాన నిజాలు అబద్ధాలు కాలేవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు.

వాదిస్తే నిజాలు అబద్ధాలు కావు.. లద్దాఖ్‌పై చైనాకు భారత్ కౌంటర్

ఇంటర్‌నెట్ డెస్క్: భారత్‌లో లద్దాఖ్ అంతర్భాగమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. లద్దాఖ్ భారత్‌లో అంతర్భాగం కాదంటూ చైనా వ్యక్తం చేసిన అభ్యంతరంపై గట్టి కౌంటర్ ఇచ్చింది. చైనా అడ్డగోలుగా వాదించినంతమాత్రాన నిజాలు అబద్ధాలు కాలేవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. దానిని ఎవరూ భారత్ నుంచి విడదీయలేరు. గతంలో అది మన దేశంలో అంతర్భాగంగా ఉంది. ఇప్పుడూ ఉంది. భవిష్యత్తులోనూ ఉంటుంది. ఎవరూ ఈ వాస్తవాన్ని కాదనలేరు. భారత్‌లో లద్దాఖ్ అంతర్భాగం కాదంటూ చైనా అడ్డగోలుగా వాదించినంతమాత్రాన నిజాలు అబద్ధాలైపోవు’’ అని జైస్వాల్ తెలిపారు.


కాగా.. లద్దాఖ్ ప్రాంతంలో 28 భౌగోళిక ప్రదేశాలను గుర్తిస్తూ కేంద్ర హోం శాఖ ఈనెల 2న కొత్తగా భారత మ్యాప్‌ను విడుదల చేసింది. ఆ మ్యాప్‌పై చైనా అభ్యంతరం తెలిపింది. లద్దాఖ్‌ను భారత్‌లో అంతర్భాగంగా తాము ఎప్పుడూ గుర్తించలేదని, ఆ ప్రాంతంలో భౌగోళిక ప్రదేశాలను గుర్తించడం చట్టవిరుద్ధం అని చైనా పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రాంతంలో తమకూ భాగం ఉందని చైనా వాదించింది. కాగా.. లద్దాఖ్‌లో కేంద్ర హోం శాఖ గుర్తించిన ప్రదేశాల్లో 10 పర్వత శిఖరాలు, రెండు పాస్‌లు, మూడు పర్వతాలు, ఏడు ల్యాండ్ ఏరియాలు, రెండు గ్లేసియర్లు, రెండు వాటర్ బాడీలు, ఒక లోయ, ఒక నది ఉన్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

అత్తమామల వేధింపులతో ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య.. సుసైడ్ నోట్ కలకలం!

గుజరాత్‌ మాజీ మంత్రి హత్య కేసు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Updated Date - Oct 13 , 2026 | 06:40 PM