Share News

ప్రజాప్రతినిధుల పేర్ల ముందు గౌరవ పదాలు తప్పనిసరి: అలహాబాద్ హైకోర్టు

ABN , Publish Date - May 06 , 2026 | 12:25 PM

ఎంపీలు, మాజీ కేంద్రమంత్రుల పేర్ల ముందు గౌరవప్రదమైన పదాలను తప్పనిసరిగా చేర్చాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేవలం సంబోధనల్లోనే కాకుండా, ఎఫ్‌ఐఆర్‌లలో 'గౌరవనీయులైన' అనే పదాన్ని వాడాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రజాప్రతినిధుల పేర్ల ముందు గౌరవ పదాలు తప్పనిసరి: అలహాబాద్ హైకోర్టు
Allahabad High Court

ఢిల్లీ, మే 6 (ఆంధ్రజ్యోతి): ఎంపీలు, మాజీ కేంద్రమంత్రుల పేర్ల ముందు గౌరవప్రదమైన పదాలను తప్పనిసరిగా చేర్చాలని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) ఆదేశాలు జారీ చేసింది. కేవలం సంబోధనల్లోనే కాకుండా, ఎఫ్‌ఐఆర్‌లలో 'గౌరవనీయులైన' (Honourable) అనే పదాన్ని వాడాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధుల పేర్ల ముందు తగిన గౌరవ సూచక పదాలు లేకుండా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.


ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులపై కనీస గౌరవం, మర్యాద పాటించడం అవసరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టసభల సభ్యులు, మాజీ మంత్రుల విషయంలో ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని అధికారులకు న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలకు సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్ కేసుపై సజ్జనార్ స్పెషల్ ఫోకస్

పంజాబ్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. రాఘవ్ చద్దా ధ్వజం

అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. పదిమంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 06 , 2026 | 12:35 PM