-
-
Home » Mukhyaamshalu » latest andhra pradesh telangana national international live news updates of 18th Jan 2026 in telugu siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్.. (17/01/2026)
ABN , First Publish Date - Jan 17 , 2026 | 12:32 PM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
Jan 17, 2026 13:38 IST
తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రారంభించిన ప్రధాని
పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.
హౌరా-గౌహతి మధ్య తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభం.
బెంగాల్‌ను ఇతర రాష్ట్రాలతో అనుసంధానించేలా 7 వందేభారత్ రైళ్లు ప్రారంభం.
-
Jan 17, 2026 13:37 IST
హైదరాబాద్: కృష్ణానగర్‌లో వాషింగ్ మెషిన్ పేలుడు
రన్నింగ్‌లో ఉండగా భారీ శబ్ధంతో పేలిన వాషింగ్ మెషిన్
పేలుడు సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
-
Jan 17, 2026 13:36 IST
కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు
లాటరీ ద్వారా మహిళలకు 50శాతం రిజర్వేషన్లు
10 కార్పొరేషన్లలో రిజర్వేషన్లు: ఎస్సీ-1, ఎస్టీ-1, బీసీ-3, జనరల్-5
121 మున్సిపాలిటీలు: ఎస్సీ-17, ఎస్సీ-5, బీసీ 38, బీసీ మహిళా-19
-
Jan 17, 2026 13:32 IST
అప్పుడే పోరాటం ముగిసినట్టు కాదు..

బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) ఎన్నికల్లో 25 ఏళ్ల తర్వాత శివసేన ఆధిపత్యానికి బీజేపీ-షిండే శివసేన కూటమి గండికొట్టింది.
ఈ ఓటమిపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.
మహారాష్ట్రలో రాజకీయ యుద్ధం ఇంతటితో ముగిసినట్టు కాదని.. మరాఠా ప్రజలకు సముచిత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందన్నారు.
పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
-
Jan 17, 2026 13:27 IST
ములుగు: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.
చైర్మన్‌గా ఇర్ప సుకన్య సునీల్ నియామకం
డైరెక్టర్లుగా 15 మంది.
బోర్డు సభ్యులతో ప్రమాణం చేయించిన ఎండోమెంట్ అధికారి వీరస్వామి.
-
Jan 17, 2026 13:18 IST
త్వరలో బీఆర్ఎస్ ముక్కలవుతుంది: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
బీఆర్ఎస్ ఇప్పటికే ప్రజల విశ్వాసం కోల్పోయింది.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిరావడం తప్ప.. చేసిందేమీ లేదు.
గ్రామాల్లో అభివృద్ధి చేయాలంటే ఢిల్లీకి వెళ్లాల్సిన పనిలేదు.
కేంద్రం ఇచ్చిన నిధులతో అభివృద్ధి చేసుకోవచ్చు.

-
Jan 17, 2026 12:40 IST
ఖమ్మం: మిట్టపల్లిలో విషాదం
పిల్లల మృతి తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య
కొన్ని రోజుల క్రితం గ్యాస్ పేలి ఇద్దరు పిల్లలు మృతి

-
Jan 17, 2026 12:39 IST
హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్..
చైతన్యపురి, నాగోల్, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో వరుసగా చైన్ స్నాచింగ్స్.
భయాందోళనలో స్థానికులు.
దొంగల కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు.
-
Jan 17, 2026 12:35 IST
పొలిటికల్ పండగెప్పుడు..
నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ ద్వితీయ శ్రేణి నేతల ఎదురుచూపు.
మౌనముద్రలో కూటమి నేతలు.. జనసేనలోనూ అసంతృప్తులు.
నిరాశలో మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళి, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.
పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
-
Jan 17, 2026 12:32 IST
మార్కాపురం : పామూరు మండలం బొట్లగూడూరులో దారుణం చోటు చేసుకుంది.
ఆటో తగిలిందని డ్రైవర్ మహర్షిని స్తంభానికి కట్టేసి కొట్టిన కొంత మంది యువకులు.
ఆటో డ్రైవర్‌కి తీవ్ర గాయాలు.. చికిత్స కోసం కనిగిరి ఏరియా వైద్య శాలకు తరలింపు.
దాడికి పాల్పడిన ఆరుగురిని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగతా వారికోసం గాలింపు.