Share News

PM Inaugurates Sleeper Vande Bharat: తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు జెండా ఊపిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Jan 17 , 2026 | 02:35 PM

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా.. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి హౌరా-గువాహటి(కామాఖ్య) మధ్య రాకపోకలు సాగించే స్లీపర్ ట్రైన్‌కు పచ్చ జెండా ఊపారు.

PM Inaugurates Sleeper Vande Bharat: తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు జెండా ఊపిన ప్రధాని మోదీ
PM Modi

మాల్దా: దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు(Vande Bharat Sleeper Train)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) శనివారం నాడు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి హౌరా-గువాహటి(కామాఖ్య) మధ్య రాకపోకలు సాగించే స్లీపర్ రైలుకు పచ్చజెండా ఊపారు. గువాహటి(కామాఖ్య)-హౌరా మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలునూ వర్చువల్‌గా జెండా ఊపి ఆయన ప్రారంభించారు.


పశ్చిమ బెంగాల్, అస్సాంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు రైళ్లు, రోడ్డు ప్రాజెక్టులను.. ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మాల్దాలో జరుగనున్న బహిరంగ సభలో రూ.3,250 కోట్ల విలువ చేసే రైల్, రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు.


కాగా.. మోడ్రన్ ఇండియాలో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో వందే భారత్ స్లీపర్ రైలును డిజైన్ చేశారు. మేక్‌ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా భారత్‌లోనే వీటి డిజైన్, తయారీ చేపడుతున్నారు. 16 బోగీలు, 823 మంది ప్రయాణికులతో సుమారు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వేగం, సురక్షితం, మరిన్ని సదుపాయాలతో సుదూర ప్రయాణాలను సాగించనుంది. ఈ రైలుతో హౌరా-గువాహటి(కామాఖ్య) మార్గంలో సుమారు 2.5 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది. కాగా.. జనవరి 18న హుగ్లీ జిల్లాలోని సింగూరు వద్ద రూ.830 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభింస్తారు. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేస్తారు.


ఇవి కూడా చదవండి..

నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు

10 మంది సభ్యులతో విజయ్ ప్రచార కమిటీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 17 , 2026 | 03:52 PM