-
-
Home » Mukhyaamshalu » Ap Telangana National International Latest Breaking viral and trending ABN Andhrajyothy news Live Updates of 16th March 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 16 , 2026 | 07:07 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 16, 2026 08:19 IST
ఉప్పల్ పీఎస్ AR కానిస్టేబుల్ సుధీర్ హత్యకేసులో పురోగతి
హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు సంతోష్‌తో పాటు..
సహకరించిన తరుణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హత్యకు సుధీర్, సంతోష్ మధ్య విభేదాలే కారణమని గుర్తింపు
-
Mar 16, 2026 08:18 IST
జమ్మూకశ్మీర్‌లో భారీ హిమపాతం
అనంతనాగ్ జిల్లా సింథాన్ పాస్ దగ్గర..
చిక్కుకున్న 214 మంది పర్యాటకులు, స్థానికులు
సైనికులు, పోలీసుల రెస్క్యూ ఆపరేషన్..
214 మందిని సురక్షితంగా తరలించిన రెస్క్యూ టీమ్..
-
Mar 16, 2026 08:16 IST
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నారా లోకేశ్ శుభాకాంక్షలు..
అమరావతి: ఒత్తిడికి గురికావొద్దు.. ప్రశాంతంగా ఉండండి: మంత్రి నారా లోకేశ్
100 శాతం మీ ప్రతిభను ప్రదర్శించే సమయమిది..
ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయండి. విజయం మీదే.. ఆల్ ది బెస్ట్: మంత్రి నారా లోకేశ్
-
Mar 16, 2026 07:58 IST
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేటి ధరలు ఇవీ
హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,650
22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,340
కిలో వెండి రూ. 2,79,900
-
Mar 16, 2026 07:57 IST
మేము సంధిని కోరలేదు.. చర్చల ప్రసక్తే లేదు.. తేల్చిచెప్పిన ఇరాన్
ఇరాన్ దేశం అమెరికాతో ఎలాంటి సంధినీ కోరలేదు..
చర్చల ప్రసక్తే లేదన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ..
ట్రంప్ వ్యాఖ్యలు కేవలం తప్పుడు ప్రచారమని వ్యాఖ్య..
తమ ఆత్మరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతామని ప్రకటన..
-
Mar 16, 2026 07:56 IST
భవిష్యత్తులో టీమిండియా మరిన్ని కప్పులు గెలుస్తుంది: సంజు శాంసన్
నమన్ అవార్డ్స్ 2026కి హాజరైన స్టార్ బ్యాటర్ సంజు శాంసన్
నా జర్నీ అంతా ఓ సినిమాలా అనిపించింది: సంజు
జింబాబ్వేతో మ్యాచ్ నుంచి జట్టుకు నేను అవసరం అనిపించింది: శాంసన్
-
Mar 16, 2026 07:54 IST
ఆ సమయంలో సోషల్ మీడియా ప్రభావం నాపై పడకుండా చేశారు: అభిషేక్ శర్మ
టీ20 ప్రపంచ కప్ 2026 ఆరంభంలో పరుగులు చేయలేకపోయిన అభిషేక్ శర్మ..
ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు..
తనపై వచ్చిన విమర్శలపై స్పందించిన అభిషేక్ శర్మ..
-
Mar 16, 2026 07:36 IST
ఒడిశాలోని కటక్‌లో భారీ అగ్నిప్రమాదం
SCB మెడికల్ కాలేజీలో చెలరేగిన మంటలు..
10 మంది మృతి, పలువురికి గాయాలు..
మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
ఘటనాస్థలిని పరిశీలించిన ఒడిశా సీఎం మోహన్ చరణ్..
-
Mar 16, 2026 07:29 IST
నేడు అమరావతిలో అమరజీవి భారీ విగ్రహం ఆవిష్కరణ
58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు..
పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ..
అమరావతిలో శాఖమూరు పార్క్ దగ్గర విగ్రహం ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు..
విజయవాడలో ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందులో పాల్గొననున్న సీఎం..
అమరావతి, విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన..
-
Mar 16, 2026 07:28 IST
నేడు ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు
RTGS, వంట గ్యాస్ సరఫరాపై వరుస సమావేశాలు
-
Mar 16, 2026 07:25 IST
మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి
తెలంగాణలో 6 రోజులు వానలు.. ఎల్లో అలర్ట్ జారీ..
పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు..
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్..
హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం..
-
Mar 16, 2026 07:24 IST
ఏపీలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం..
అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ..
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం..
-
Mar 16, 2026 07:23 IST
నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం
ఉదయం 11:27 గంటలకు పునర్నిర్మించిన కౌన్సిల్ భవనం ఎదుట..
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న గవర్నర్..
-
Mar 16, 2026 07:22 IST
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఉదయం 11:45 గంటలకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..
ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ శివప్రతాప్..
ఈనెల 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి..
సభలో పలు కీలక అంశాలపై చర్చించాలని భావిస్తున్న ప్రభుత్వం..
-
Mar 16, 2026 07:07 IST
హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లో BMW కారు బీభత్సం
అతివేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టిన కారు..
కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం..
ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో తప్పిన ప్రమాదం..
యువకుడికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు, కేసు నమోదు..