Share News

భవిష్యత్తులో టీమిండియా మరిన్ని కప్పులు గెలుస్తుంది: సంజు శాంసన్

ABN , Publish Date - Mar 16 , 2026 | 06:35 AM

టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026 గెలవడంలో స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీసీసీఐ ప్రపంచ కప్ ఛాంపియన్స్‌కు నమన్ అవార్డ్స్ ప్రదానం చేసింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సంజు.. జట్టు గెలుపుపై మాట్లాడాడు.

భవిష్యత్తులో టీమిండియా మరిన్ని కప్పులు గెలుస్తుంది: సంజు శాంసన్
Sanju Samson

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026 గెలవడంలో స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా జట్టులోకి వచ్చి వరుసగా మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన సంజు.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును అందుకున్నాడు. అయితే తాజాగా బీసీసీఐ ప్రపంచ కప్ ఛాంపియన్స్‌కు నమన్ అవార్డ్స్ ప్రదానం చేసింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సంజు.. జట్టు గెలుపుపై మాట్లాడాడు. భారత క్రికెట్ జట్టు భవిష్యత్తులో మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలుచుకుంటుందని అన్నాడు.


‘టీ20 ప్రపంచ కప్ 2026 గెలవడం నిజంగా జరిగిందా అనిపిస్తోంది. మన దేశంలో ఉన్న ఆటగాళ్ల ప్రతిభ, సామర్థ్యాన్ని చూస్తే రాబోయే ఏళ్లల్లో టీమిండియా ఎన్నో విజయాలు అందుకుంటుంది. యువ ప్లేయర్ల వల్ల ప్రపంచ క్రికెట్‌లో భారత్.. అద్భుతాలు చేస్తుంది. ఇలాంటి ఐసీసీ ట్రోఫీలు మరెన్నో అందుకుంటుందని విశ్వసిస్తున్నా. మనకు కావాల్సిన లక్ష్యాలను కలగనొచ్చు. కానీ ఆ దారి ఎలా సాగుతుందో ముందే చెప్పలేం. నా కెరీర్ కూడా అలాంటిదే. రెండేళ్ల క్రితమే దేశానికి ప్రపంచ కప్ గెలిపించాలని అనుకున్నాను. కానీ పరిస్థితులు వేరేగా మారాయి. చివరికి నా జర్నీ అంతా ఓ సినిమాలా అనిపిస్తుంది. జింబాబ్వే మ్యాచ్ నుంచి జట్టుకు నేను అవసరం అనే భావన వచ్చింది. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది’ అని సంజు తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 16 , 2026 | 06:35 AM