Share News

కిమి రికార్డు విక్టరీ

ABN , Publish Date - Mar 16 , 2026 | 02:31 AM

యువ రేసర్‌ కిమి ఆంటోనెల్లి చైనీస్‌ గ్రాండ్‌ ప్రీ ఫార్ములావన్‌ రేస్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ రేసును మెర్సిడెస్‌ డ్రైవర్‌ కిమి అగ్రస్థానంతో...

కిమి రికార్డు విక్టరీ

చైనీస్‌ గ్రాండ్‌ ప్రీ కైవసం

షాంఘై: యువ రేసర్‌ కిమి ఆంటోనెల్లి చైనీస్‌ గ్రాండ్‌ ప్రీ ఫార్ములావన్‌ రేస్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ రేసును మెర్సిడెస్‌ డ్రైవర్‌ కిమి అగ్రస్థానంతో ముగించాడు. మెర్సిడె్‌సకే చెందిన జార్జ్‌ రస్సెల్‌ రెండు, ఫెరారీ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మూడు స్థానాలతో పోడియం ఫినిష్‌ చేశాడు. ఇటలీకి చెందిన 19 ఏళ్ల కిమి ఆంటోనెల్లికి కెరీర్‌లో ఇదే తొలి ఎఫ్‌1 విజయం కావడం విశేషం. అంతేకాదు.. వెర్‌స్టాపెన్‌ తర్వాత పిన్న వయసులో ఎఫ్‌1 రేస్‌ నెగ్గిన రెండో ఆటగాడిగా కిమి రికార్డుకెక్కాడు. 2016లో వెర్‌స్టాపెన్‌ 18 ఏళ్ల వయసున్నప్పుడు స్పానిష్‌ గ్రాండ్‌ ప్రీ గెలిచాడు.

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 16 , 2026 | 02:31 AM