రోహిత్ కాదు..గేల్!
ABN , Publish Date - Mar 16 , 2026 | 02:32 AM
రోహిత్ శర్మ..ఒంటిచేత్తో మ్యాచ్ గతిని మార్చివేయగల ఆటగాడు. ఈ విషయాన్ని పరిమిత ఓవర్లలో ముఖ్యంగా టీ20ల్లో హిట్‌మ్యాన్ ఎన్నోసార్లు నిరూపించాడు. అయితే అలాంటి రోహిత్‌కు...
టీ20 బెస్ట్ ఓపెనర్‌గా తేల్చిన విరాట్
బెంగళూరు: రోహిత్ శర్మ..ఒంటిచేత్తో మ్యాచ్ గతిని మార్చివేయగల ఆటగాడు. ఈ విషయాన్ని పరిమిత ఓవర్లలో ముఖ్యంగా టీ20ల్లో హిట్‌మ్యాన్ ఎన్నోసార్లు నిరూపించాడు. అయితే అలాంటి రోహిత్‌కు కాకుండా క్రిస్ గేల్‌కు పొట్టి క్రికెట్‌లో అత్యుత్తమ ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ ఓటేశాడు. ఈమేరకు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆదివారం ఓ వీడియో విడుదలజేసింది. ‘దిస్ ఆర్ దట్’ పేరిట తమ మాజీ కెప్టెన్ విరాట్‌కు రాయల్ చాలెంజర్స్ సవాలు విసిరింది. తొలుత గిల్‌క్రిస్ట్, సునీల్ నరైన్‌లతో చాలెంజ్ ప్రారంభించింది. ఇందులో గిల్‌క్రి్‌స్టను విరాట్ ఉత్తమ ఓపెనర్‌గా పేర్కొన్నాడు. తర్వాత..గిల్‌క్రిస్ట్, ట్రావిస్ హెడ్‌లోనూ గిల్‌క్రిస్ట్‌కే జైకొట్టాడు. ఆపై హెడ్-సెహ్వాగ్‌లలో.. సెహ్వాగ్‌ను బెస్ట్‌గా కోహ్లీ తేల్చాడు. ఇక సెహ్వాగ్-సచిన్‌లలో సెహ్వాగ్‌ను ఎంపిక చేశాడు. చివరగా..రోహిత్ శర్మ, క్రిస్ గేల్‌లో ఎవరు గొప్ప అని అడిగితే కొద్దిసేపు ఆలోచించిన కోహ్లీ తన ఆర్సీబీ మాజీ సహచరుడు గేల్‌కు ఓటేయడం విశేషం.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ
ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు