Share News

న్యూయార్క్‌ మారథాన్‌లో గుల్వీర్‌కు కాంస్యం

ABN , Publish Date - Mar 16 , 2026 | 02:34 AM

భారత లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ గుల్వీర్‌ సింగ్‌ న్యూయార్క్‌ సిటీ హాఫ్‌ మారథాన్‌లో మూడో స్థానంతో కెరీర్‌లో సరికొత్త మైలురాయిని అందుకొన్నాడు. ప్రపంచ మేటి...

న్యూయార్క్‌ మారథాన్‌లో గుల్వీర్‌కు కాంస్యం

న్యూఢిల్లీ: భారత లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ గుల్వీర్‌ సింగ్‌ న్యూయార్క్‌ సిటీ హాఫ్‌ మారథాన్‌లో మూడో స్థానంతో కెరీర్‌లో సరికొత్త మైలురాయిని అందుకొన్నాడు. ప్రపంచ మేటి అథ్లెట్లు పాల్గొన్న 21.1 కి.మీ మారథాన్‌లో గుల్వీర్‌ 59 నిమిషాల 42 సెకన్ల టైమింగ్‌తో రేసును పూర్తి చేసి కాంస్యం దక్కించుకున్నాడు. అడ్రియాన్‌ (దక్షిణాఫ్రికా, 59:30 సె)కు స్వర్ణం, జొహైర్‌ (అమెరికా, 59:41 సె)కు రజతం దక్కాయి. 2020 ఢిల్లీ మారథాన్‌లో అవినాష్‌ సబ్లే (గంటా 30 సెకన్లతో) నమోదుచేసిన జాతీయ రికార్డు కంటే గుల్వీర్‌ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కానీ, న్యూయార్క్‌ మారథాన్‌ను రికార్డుకు అర్హమైనదిగా పరిగణించకపోవడంతో గుల్వీర్‌ ప్రదర్శన రికార్డుకెక్కలేదు.

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 16 , 2026 | 02:34 AM