ఆ సమయంలో సోషల్ మీడియా ప్రభావం నాపై పడకుండా చేశారు: అభిషేక్ శర్మ
ABN , Publish Date - Mar 16 , 2026 | 07:12 AM
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ భారీ అంచనాలతో బరిలోకి దిగి ఆరంభంలో పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. అయితే అభిషేక్ శర్మ ఫామ్‌లో లేనప్పుడు తనపై వచ్చిన విమర్శల గురించి గుర్తు చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ భారీ అంచనాలతో బరిలోకి దిగి ఆరంభంలో పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. వరుసగా మూడు డకౌట్లు అయి అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేశాడు. ఆ తర్వాత తిరిగి పుంజుకుని ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని.. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయితే అభిషేక్ శర్మ ఫామ్‌లో లేనప్పుడు తనపై వచ్చిన విమర్శల గురించి గుర్తు చేసుకున్నాడు.
‘పొట్టి ప్రపంచ కప్‌లో వరుసగా డకౌట్లు అయినప్పుడు చాలా కుంగిపోయా. ఆ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్ మద్దతు ఇచ్చారు. విమర్శలు ఎదుర్కొన్న కొత్తలో చాలా బాధగా ఉంటుంది. కానీ నెమ్మదిగా వాటికి అలవాటు పడతాం. భారత్‌లో ఇలాంటివి మామూలే. ఎందుకంటే అభిమానులు మనపై భారీగా అంచనాలు పెట్టుకుంటారు. టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా డకౌట్లు అయిన తర్వాత కెప్టెన్ సూర్య, కోచ్ గంభీర్, హార్దిక్ పాండ్య నా దగ్గరకు వచ్చారు. ‘నీ ఫోన్ తీసి.. సోషల్ మీడియా యాప్‌లు తక్షణమే డిలీట్ చేయ్’ అని చెప్పారు.
సోషల్ మీడియాలో విమర్శల ప్రభావం నాపై పడకుండా ఉండేందుకు వాళ్లు ఈ పని చేయించారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా సలహాలు ఇచ్చేవాళ్లు. అలా ఆడు ఇలా ఆడు అని చెప్పేవాళ్లు. మనం ఒక్కోసారి సత్తా చాటగలుగుతాం. ఒక్కోసారి రాణించలేకపోతాం. ఒక క్రికెటర్‌కు ఇదంతా సాధారణ విషయం’ అని అభిషేక్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ
ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు