Share News

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:39 PM

బాలభవన్‌ వేసవి శిక్షణ శిబిరం ముగింపు వేడుకను కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
శాస్త్రీయ నృత్యం చేస్తున్న బాలభవన్‌ విద్యార్థులు

- వేసవి శిక్షణ శిబిరం ముగింపు వేడుకలో అలరించిన విద్యార్థుల ప్రదర్శనలు

కరీంనగర్‌ కల్చరల్‌, జూన్‌ 6: బాలభవన్‌ వేసవి శిక్షణ శిబిరం ముగింపు వేడుకను కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. వేడుకలను బాలభవన్‌ సూపరెండెంట్‌ కట్ట మంజులాదేవి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ యేడు 750 మంది విద్యార్థులు 12 అంశాల్లో శిక్షణ పొందారన్నారు. బాలభవన్‌కు చెందిన ఆరుగురితో పాటు సమ్మర్‌ క్యాంప్‌ కోసం మరో నలుగురిని రప్పించి ఆయా అంశాల్లో శిక్షణ ఇప్పించామని తెలిపారు. కలెక్టర్‌తోపాటు జిల్లా విద్యాశాఖ తమను ప్రోత్సహించిందన్నారు. రాబోయే కాలంలో మరింత క్రియాశీలకంగా పని చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, పాటలతోపాటు వారు నేర్చుకున్న అంశాలను ప్రదర్శించారు. చెస్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, పాల్గొన్న వారందరికీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కవి అన్నవరం దేవేందర్‌, జన జానపద వృత్తి కళాకారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గుండ్ర కృపాదానం, బాలభవన్‌ సిబ్బంది కె శ్రీధర్‌, సంగెం రాధాకృష్ణ, కృష్ణకుమార్‌, సూర్యశ్రీ, నీల, కె అనూప్‌, మల్లిక, రాధిక, సుహాసిని పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:39 PM