Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 03 , 2026 | 06:29 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Jun 03, 2026 21:25 IST

    హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్‌ నోటీసులు

    • రేపు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విచారణకు హాజరుకావాలన్న సిట్‌

    • 2014-18 మధ్య మహేశ్వరం ఎమ్మెల్యేగా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి

  • Jun 03, 2026 20:59 IST

    అమ‌రావ‌తి: రాజ‌ధాని రైతుల‌కు వార్షిక కౌలు జ‌మ చేస్తోన్న సీఆర్డీఏ

    • 29 గ్రామాల రైతుల‌తో పాటు కొత్తగా ల్యాండ్ పూలింగ్‌కు భూములిస్తున్న రైతుల‌కు కౌలు నిధుల జ‌మ‌

    • నెలాఖ‌రులోగా అర్హులైన వారంద‌రికీ కౌలు నిధులు జ‌మ చేయాల‌ని నిర్ణయం

  • Jun 03, 2026 20:59 IST

    అమెరికాలో మధుయాష్కీ సతీమణి కారుకు ప్రమాదం

    • బోస్టన్‌ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా కారు బోల్తా

    • మధుయాష్కీ సతీమణి సుచియాష్కీకి తీవ్రగాయాలు

    • ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుచియాష్కీ

    • సుచియాష్కీ రిబ్స్ విరిగినట్టు వైద్యుల వెల్లడి

    • మధుయాష్కీని ఫోన్‌లో పరామర్శించిన పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌గౌడ్‌

  • Jun 03, 2026 20:57 IST

    ఏపీ లిక్కర్‌ కేసులో నిందితుడు ప్రణయ్ ప్రకాష్ రిమాండ్ పొడిగింపు

    • ప్రకాశ్ రిమాండ్‌ ఈనెల 17 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు

    • ఏపీ లిక్కర్‌ కేసులో ఏ-52గా ఉన్న ప్రణయ్ ప్రకాశ్

  • Jun 03, 2026 20:17 IST

    రేపు సాయంత్రం 4.30కి సీఎం చంద్రబాబు నివాసంలో NDA నేతల భేటీ

    • హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ తదితరులు

    • SIRపై మూడు పార్టీల నేతలు కలిసి క్షేత్రస్థాయిలో సమన్వయం

    • త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సమావేశంలో చర్చ

  • Jun 03, 2026 20:15 IST

    శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: సంగం మడలం గాంధజన సంఘం దగ్గర ప్రమాదం

    • అదుపుతప్పి ఆటో బోల్తా.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 03, 2026 19:35 IST

    తెలంగాణ యువతకు జర్మనీ ఉద్యోగ అవకాశాల దిశగా కీలక అడుగు

    • జర్మనీ అవసరాలకు అనుగుణంగా యువతకు ప్రత్యేక శిక్షణ

    • యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి తురింగియా సహకారం

    • పాలిటెక్నిక్‌లు, ఏటీసీలలో బోధన విధానాల మార్పునకు జర్మనీ మద్దతు

    • హైదరాబాద్‌లో జర్మన్ భాషా శిక్షణ విస్తరణకు ప్రతిపాదన

    • తెలంగాణ యువత ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ చాటుతోంది: సీఎం రేవంత్ రెడ్డి

  • Jun 03, 2026 19:34 IST

    తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చిబాబు

    • రేపు పెద్ది చిత్రం విడుదల ఉండడంతో స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చా: దర్శకుడు బుచ్చిబాబు

    • నేటి రాత్రి 8 గంటలకు చిత్ర ప్రీమియర్ షోష్ పడుతుంది: దర్శకుడు బుచ్చిబాబు

    • చిత్రంలో రాంచరణ్‌తో పాటు టీం మొత్తం కష్ట పడ్డాం: దర్శకుడు బుచ్చిబాబు

    • శ్రీవారి దయతో చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నా: బుచ్చిబాబు సన

  • Jun 03, 2026 19:25 IST

    అమరావతి: సీఎం చంద్రబాబుతో ONGC చైర్మన్‌ మర్యాదపూర్వక భేటీ

    • ఏపీలో ONGC కార్యకలాపాలపై వివరించిన చైర్మన్‌ అరుణ్‌కుమార్‌

  • Jun 03, 2026 19:24 IST

    హైదరాబాద్‌: మాజీ ఏఎస్పీ భుజంగరావు ఇళ్లల్లో ముగిసిన ఏసీబీ సోదాలు

    • మార్కెట్‌ రేట్‌ ప్రకారం రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు

    • భుజంగరావుకు చెందిన 16 చోట్ల తనిఖీలు చేసిన ఏసీబీ

    • ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో భుజంగరావు అరెస్ట్

  • Jun 03, 2026 18:06 IST

    భూముల మార్కెట్ విలువల సవరణకు TG ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

    • తెలంగాణలో ఈ నెల 5 నుంచి అమల్లోకి కొత్త మార్కెట్ విలువలు

    • క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా భూముల విలువ నిర్ణయం

    • 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల పరిధిలో పెరిగిన భూముల విలువ

    • మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్లు, డిమాండ్ ఆధారంగా కొత్త రేట్లు

  • Jun 03, 2026 18:06 IST

    ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నేత లంకల దీపక్ రెడ్డికి సిట్ నోటీసులు

    • రేపు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు రావాలని నోటీసులు

    • పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసులో విచారణకు రావాలన్న సిట్

  • Jun 03, 2026 18:05 IST

    తెలంగాణలో పోటీ చేస్తాం.. ఇందుకు ప్రత్యేక ప్రణాళికలేమీ లేవు: పవన్

    • కొందరి వ్యాఖ్యల వల్లే పోటీపై ప్రకటన చేయాల్సి వచ్చింది: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • తెలంగాణ జనసేన నాయకులు ఎప్పటినుంచో కోరుతున్నారు: పవన్

    • దేశ సమగ్రత దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించొద్దు: పవన్

    • నేను తెలంగాణ ప్రజలనుద్దేశించి తప్పుగా మాట్లాడలేదు: పవన్

    • నన్ను అడుగుపెట్టనివ్వమన్న నేతల గురించే మాట్లాడా: పవన్

    • సభ పెట్టుకోకుండా ఎన్ని రోజులు ఆపగలరు? : పవన్

    • తెలంగాణ ముమ్మాటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదే: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • Jun 03, 2026 17:47 IST

    తెలంగాణలో ఇన్-సర్వీస్ టీచర్లకు శుభవార్త

    • ప్రత్యేక టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

    • ప్రతి ఏడాదీ నిర్వహించే 2 టెట్‌లకు అదనంగా మరో 2 స్పెషల్ టెట్‌లు

    • సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసమే ప్రత్యేక టెట్ పరీక్షలు

    • ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులకు ప్రభుత్వం సానుకూల స్పందన

    • అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు

  • Jun 03, 2026 17:32 IST

    హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

    • ఏఎస్పీ భుజంగరావు నివాసంలో ముగిసిన ACB సోదాలు

    • భుజంగరావు బంధువు రవీందర్‌రావు నివాసంలో తనిఖీలు

  • Jun 03, 2026 17:31 IST

    టీటీడీ రసాయనాల నెయ్యి కేసులో ED సోదాలు

    • దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో తనిఖీలు

    • అహిల్యానగర్‌, బికనీర్‌, డెహ్రాడూన్‌, ఢిల్లీ, దుండిగల్‌‌లో తనిఖీలు

    • గుంటూరు, ముంబై, రూర్కీ ప్రాంతాల్లో ED సోదాలు

    • తనిఖీల్లో రూ.60 లక్షలను స్వాధీనం చేసుకున్న ED

    • స్థిర, చరాస్తుల్లో రూ.45 కోట్లకు పైగా పెట్టినట్లు గుర్తింపు

  • Jun 03, 2026 17:30 IST

    అమరావతి: పొట్టి శ్రీరాములు స్మృతి వనానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

    • పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన పవన్‌

    • పొట్టి శ్రీరాములు విగ్రహానికి పవన్‌ కల్యాణ్‌ నివాళులు

    • కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్‌ మీడియా సమావేశం

  • Jun 03, 2026 17:17 IST

    విమాన ఇంధన ధరల స్థిరీకరణకు రూ.10,000 కోట్లు

    • రామేశ్వరం-కోణార్క్‌-పారాదీప్‌ కోస్టల్‌ హైవే ప్రాజెక్టుకు రూ.8,301 కోట్లు

    • బిహార్‌లోని ఖగారియా-పూర్నియా మధ్య 4 లేన్ల విస్తరణకు రూ.3,936 కోట్లు

    • మధ్యప్రదేశ్‌లో NH-347కి రూ.4,415 కోట్లు మంజూరు

  • Jun 03, 2026 17:16 IST

    కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

    • తెలంగాణలో రెండు హైవేలను 4 లేన్లుగా విస్తరించాలని నిర్ణయం

    • రూ.7,597 కోట్లతో 2 హైవేలను 190 కి.మీ విస్తరణకు ఆమోదం

    • జగిత్యాల-కరీంనగర్‌ హైవే(NH-563) విస్తరణకు ఆమోదం

    • ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల హైవే(NH-63) విస్తరణకు ఆమోదం

  • Jun 03, 2026 17:15 IST

    కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ కోసం పనిచేస్తాం: ఎంపీ రఘునందన్‌

    • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయం: రఘునందన్‌

    • వచ్చే ఎన్నికల్లో BRSకి 9 సీట్లు కూడా రావు: రఘునందన్‌

    • BJP ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరు: ఎంపీ రఘునందన్‌

    • వచ్చే ఎన్నికల్లో BJPదే విజయం: ఎంపీ రఘునందన్‌

    • కాంగ్రెస్‌ చేసిన తప్పులకు శిక్ష తప్పదు: ఎంపీ రఘునందన్‌

  • Jun 03, 2026 16:42 IST

    నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 303 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

    • 78 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ

  • Jun 03, 2026 16:36 IST

    ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు తన పూర్వీకులకు పుష్పాంజలి ఘటించిన డీకే శివకుమార్

  • Jun 03, 2026 16:35 IST

    డీకే శివకుమార్‌ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేజే జార్జ్

  • Jun 03, 2026 16:30 IST

    డీకే శివకుమార్‌ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కర్ణాటక కాంగ్రెస్‌ నేత కేహెచ్‌ మునియప్ప

  • Jun 03, 2026 16:24 IST

    కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ జి.పరమేశ్వర

  • Jun 03, 2026 16:23 IST

    కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న డీకే శివకుమార్

  • Jun 03, 2026 16:19 IST

    భారత రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని.. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డీకే శివకుమార్

  • Jun 03, 2026 16:18 IST

    బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేసిన డీకే శివకుమార్

  • Jun 03, 2026 16:12 IST

    బెంగళూరు: లోక్‌భవన్‌లో డీకే శివకుమార్‌కు సన్మానం

    • ప్రమాణస్వీకారానికి ముందు డీకే శివకుమార్‌‌కు సన్మానం

  • Jun 03, 2026 16:10 IST

    ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన శివకుమార్ భార్య, కుమార్తె

    • లోక్‌భవన్‌లో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం

    • హాజరైన డీకే శివకుమార్ భార్య ఉషా శివకుమార్, కుమార్తె

  • Jun 03, 2026 15:39 IST

    కాసేపట్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారం

    • మంత్రులుగా ప్రమాణం చేయనున్న 14 మంది

    • కేబినెట్‌లో మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు చోటు

    • హాజరుకానున్న ఖర్గే, రాహుల్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

    • కార్యక్రమంలో పాల్గొననున్న తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు

    • ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్లి ఆహ్వానించిన డీకే శివకుమార్

  • Jun 03, 2026 15:32 IST

    విశాఖపట్నం: రాబోయే 24 గంటల్లో కేరళంలో ప్రవేశించనున్న రుతుపవనాలు

    • క్రమంగా మిగతా ప్రాంతాల్లోకి విస్తరించనున్న నైరుతి రుతుపవనాలు

    • ఏపీలో రాగల ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

  • Jun 03, 2026 15:29 IST

    బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భద్రత కుదింపు

    • జెడ్ నుంచి వై కేటగిరీకి కుదించిన బెంగాల్ ప్రభుత్వం

    • 2023లో గంగూలీకి జెడ్ కేటగిరీ భద్రతను ఇచ్చిన బెంగాల్ సర్కార్

  • Jun 03, 2026 15:24 IST

    DSCపై వైసీపీ విమర్శలకు సీఎం చంద్రబాబు కౌంటర్‌

    • మేం అధికారంలోకి రాగానే మెగా DSCపైనే తొలి సంతకం చేశా: సీఎం చంద్రబాబు

    • ఎలాంటి పొరపాట్లు లేకుండా DSC నిర్వహించాం: చంద్రబాబు

    • కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చాం

    • వైసీపీ హయాంలో ఒక్క DSC కూడా నిర్వహించలేదు: సీఎం చంద్రబాబు

  • Jun 03, 2026 15:23 IST

    పవన్‌ కల్యాణ్‌ను సమర్థించిన సీఎం చంద్రబాబు

    • తెలంగాణలో పవన్‌ సభను అడ్డుకోవడం సరికాదు: సీఎం చంద్రబాబు

    • నేను తమిళనాడు వెళ్లి ప్రచారం చేశా: చంద్రబాబు

    • అక్కడికి డీకే శివకుమార్‌ కూడా వచ్చారు: చంద్రబాబు

    • గతంలో ఏపీలోనూ BRS కార్యాలయం పెట్టారు: చంద్రబాబు

    • BRS కూడా జాతీయ పార్టీ అని చెప్పింది కదా: చంద్రబాబు

    • ఇప్పుడెందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు: సీఎం చంద్రబాబు

  • Jun 03, 2026 13:58 IST

    హైదరాబాద్: నౌహీరా షేక్ పీఏ అరెస్ట్

    • నజ్నీన్ అన్సారీని అరెస్ట్ చేసిన ఈడీ

    • ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను రెంట్‌కు ఇచ్చిన నౌహీరా షేక్

    • ఆ రెంట్లను కలెక్ట్ చేసిన నౌహీరా షేక్ పీఏ

    • పెట్టుబడులు పెట్టించడంలోనూ నజ్నీన్ అన్సారీ పాత్ర ఉన్నట్టు ఈడీ గుర్తింపు

    • అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఈడీ

  • Jun 03, 2026 13:55 IST

    హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో 145 కిలోల గంజాయి స్వాధీనం

    • గంజాయి తరలిస్తున్న కేరళ CISF కానిస్టేబుల్‌ శివకృష్ణ అరెస్టు

    • ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా పట్టివేత

  • Jun 03, 2026 13:54 IST

    ఏపీ ఎక్సైజ్‌ శాఖ కీలక నిర్ణయం

    • ఇకపై సరికొత్త పరిమాణాల్లో మద్యం సీసాలు

    • 150ml, 200ml మద్యం సీసాలు తెచ్చేలా చర్యలు

    • ప్రస్తుతమున్న 90ml, 180ml, 375ml, 750mlతోపాటు అందుబాటులోకి రానున్న 150ml, 200ml మద్యం సీసాలు

  • Jun 03, 2026 13:51 IST

    హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్రం ఒక్కపైసా ఇవ్వడం లేదు: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి

    • కేంద్రం నిధులతోనే ఇళ్లు కడుతున్నారు: మహేశ్వర్‌రెడ్డి

    • రేవంత్‌కు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు: మహేశ్వర్‌రెడ్డి

    • సీఎం రేవంత్ వెంటనే రాజీనామా చేయాలి: మహేశ్వర్‌రెడ్డి

  • Jun 03, 2026 13:50 IST

    హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై చర్చకు సిద్ధం: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి

    • ప్రభుత్వ పెద్దల మాటలకు, చేతలకు పొంతన లేదు: మహేశ్వర్‌రెడ్డి

    • రేవంత్ అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు: మహేశ్వర్‌రెడ్డి

    • చివరి గింజ వరకు కొనకుంటే రైతులతో మీ ఇంటి ముందు కూర్చుంటాం: మహేశ్వర్ రెడ్డి

    • గింజలు మీ ఇంటి ముందు పోయాలా? గాంధీభవన్ ముందా?: మహేశ్వర్ రెడ్డి

    • సీఎం రేవంత్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి వార్నింగ్

  • Jun 03, 2026 13:49 IST

    బెంగళూరు: డీకే శివకుమార్‌కు సోనియాగాంధీ ఫోన్

    • సీఎంగా ప్రమాణం చేయనున్న డీకేకు సోనియా అభినందనలు

    • కొత్త బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించండి: సోనియా

    • కర్ణాటక రాజకీయాలను సమర్థవంతంగా నడిపిస్తారని నమ్మకం ఉంది: సోనియా

    • భవిష్యత్‌లో విజయం సాధించాలని కోరుకుంటున్నా: సోనియా

  • Jun 03, 2026 13:35 IST

    ఢిల్లీ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    • మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటన

    • క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించిన మోదీ

    • బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ

  • Jun 03, 2026 13:33 IST

    ఢిల్లీ అగ్నిప్రమాదం.. అప్‌డేట్స్..

    • అగ్ని ప్రమాద ఘటనలో 21 చేరిన మృతుల సంఖ్య

  • Jun 03, 2026 12:52 IST

    హైదరాబాద్: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ప్రకటించిన కేటీఆర్

    • తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా: కేటీఆర్

    • అప్పటివరకు ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేస్తాను: కేటీఆర్

    • ఎక్కడ నుంచి పాదయాత్ర చేయాలనే దానిపై పార్టీ నిర్ణయిస్తుంది: కేటీఆర్

    • నాకు అహంకారం ఎక్కువ అనేది ప్రచారం మాత్రమే: కేటీఆర్

    • నా బాడీ లాంగ్వేజ్‌ను చూసి అహంకారం అనుకుంటున్నారేమో: కేటీఆర్

    • నాకు నిక్కచ్చిగా, ముక్కు సూటిగా మాట్లాడటమే తెలుసు: కేటీఆర్

    • కడుపులో ఒకటి పెట్టుకుని మరొకటి మాట్లాడం తెలియదు: కేటీఆర్

  • Jun 03, 2026 12:47 IST

    హైదరాబాద్: ఎవరితోనూ పొత్తులు ఉండవు: కేటీఆర్‌

    • 2014, 2018, 2023లో ఒంటరిగానే పోటీ చేశాం

    • 2028లోనూ ఒంటరిగానే పోటీ చేస్తాం: కేటీఆర్‌

  • Jun 03, 2026 12:45 IST

    ఢిల్లీ: మాల్వీయనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

    • లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో చెలరేగిన మంటలు

    • ప్రమాదంలో 20 మంది సజీవదహనం

    • మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు

  • Jun 03, 2026 12:21 IST

    పవన్‌ను అడ్డుకున్నది ఎవరు? ప్రజలు అడ్డుకున్న దానికి మేమేమి చేస్తాం: కేటీఆర్

    • మన దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు: కేటీఆర్

    • ఎక్కడైతే పోటీ చేయాలనుకుంటున్నారో.. ఆ ప్రాంత ప్రజల మనోభావాలు తెలుసుకోవాలి: కేటీఆర్

  • Jun 03, 2026 12:20 IST

    నిజాం సర్కారుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కదం తొక్కిన నేల ఇది: కేటీఆర్

    • రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు విభజన తీరు సరిగా లేదంటారు: కేటీఆర్

    • తెలంగాణపై ఉల్టా పల్టా మాటలెందుకు?: కేటీఆర్

    • అన్నం తినకుండా ఉన్నా అన్నోడు.. ఇక్కడ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి?: కేటీఆర్

    • పవన్ మీటింగ్‌ను అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం: కేటీఆర్

    • వందల మంది బలిదానాల రక్తంతో తడిసిన నేల తెలంగాణ: కేటీఆర్

    • ఒకటికి రెండుసార్లు ఆలోచించి పవన్ మాట్లాడాలి: కేటీఆర్

  • Jun 03, 2026 12:20 IST

    తెలంగాణలో జనసేన కొత్తగా చేసేదేముంది: కేటీఆర్

    • దేశభక్తి గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు: కేటీఆర్

    • 2023ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసింది: కేటీఆర్

    • 2018లో చంద్రబాబు కూడా పోటీ చేశారు: కేటీఆర్

    • పవన్.. పోటీ చేయండి.. ఎవరు వద్దంటున్నారు: కేటీఆర్

    • ఇక్కడకు వచ్చి అనాయాసంగా మాట్లాడటం సరికాదు: కేటీఆర్

  • Jun 03, 2026 12:17 IST

    పవన్ కళ్యాణ్.. మీరు ఇక్కడకి రండి, మీ కుటుంబాలు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి: కేటీఆర్

    • ప్రాంతాలుగా విడిపోయినా.. ప్రజలుగా కలసి ఉండాలని కోరుకున్నాం: కేటీఆర్

    • ప్రాంతీయవాదం ఉగ్రవాదంతో సమానమని పవ‌న్ అన్నాడు: కేటీఆర్

    • మద్రాసు నుంచి ఆంధ్ర వేరు పడాలని పొట్టి శ్రీరాములు పోరాడారు: కేటీఆర్

    • అది కూడా ప్రాంతీయ వాదమే అంటారా?: కేటీఆర్

    • మోదీ తన ప్రాంతీయ వాదంతో.. తెలంగాణకు వచ్చిన పరిశ్రమలను తరలించుకుపోతున్నారు: కేటీఆర్

    • జాతీయవాదం ముసుగులో ఆర్థిక పాంత్రీయవాదం చేయటం సరైందేనా?: కేటీఆర్

    • దీనికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్తారా?: కేటీఆర్

  • Jun 03, 2026 12:16 IST

    హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు కేటీఆర్ కౌంటర్..

    • తెలంగాణ కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగీరే: కేటీఆర్

    • ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌ను గౌరవిస్తాం: కేటీఆర్

    • సోదరుడిగా ఇంటికి వస్తే.. హైదరాబాద్ బిర్యానీ పెడతాం: కేటీఆర్

    • అంతే కానీ.. మా సచివాలయంలో కూర్చుంటాం అంటే కుదరదు: కేటీఆర్

    • తెలంగాణ OG కేసీఆర్.. తెలంగాణను చూసుకోవటానికి కేసీఆర్ చాలు: కేటీఆర్

  • Jun 03, 2026 11:59 IST

    హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు

    • సిట్ ఎదుట హాజరైన బడంగ్‌పేట్ మాజీ మేయర్ పారిజాత, ఆమె భర్త

    • కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇద్దరి స్టేట్‌మెంట్లు రికార్డు చేసిన సిట్

    • పారిజాత, ఆమె భర్త ఫోన్లు ట్యాప్ అయినట్టు గుర్తించిన సిట్

    • 2022లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పారిజాత, నర్సింహారెడ్డి

  • Jun 03, 2026 11:58 IST

    గుంటూరు: తక్కెళ్లపాడులో సీఎం చంద్రబాబు పర్యటన

    • లలిత PVS ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • Jun 03, 2026 11:48 IST

    నెల్లూరు: Seil థర్మల్ కేంద్రంలో కార్మికుల ఆందోళన

    • వేతనాలు పెంచాలని కోరుతూ 10 రోజులుగా నిరసన

    • విధులు బహిష్కరించి గేటు ఎదుట కార్మికుల ఆందోళన

  • Jun 03, 2026 11:44 IST

    ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

    • నైపుణ్యంతో కూడిన ఆటలైనా సరే డబ్బులుపెట్టి బెట్టింగ్ వేస్తే రాజ్యాంగ రక్షణ ఉండదు: సుప్రీంకోర్టు

    • ఆన్‌లైన్ బెట్టింగ్స్‌ను నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు చేసిన చట్టాలు పూర్తిగా చెల్లుతాయని స్పష్టం చేసిన ధర్మాసనం

    • సుప్రీం తీర్పుతో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల నిషేధానికి మార్గం సుగమం

  • Jun 03, 2026 11:35 IST

    కరీంనగర్‌: PMJ జ్యువెలరీ చోరీ కేసు దర్యాప్తు

    • నిందితుడు సుబోధ్‌సింగ్‌ను కస్టడీకి తీసుకున్న పోలీసులు

  • Jun 03, 2026 10:54 IST

    తెలంగాణ ఏర్పాటుపై మరోసారి ఎక్స్‌లో పవన్ పోస్ట్

  • Jun 03, 2026 10:22 IST

    హైదరాబాద్: చైన్ స్నాచర్ మహ్మద్ ఫైజల్ షా అలీ జబ్రీ అరెస్ట్

    • 180కి పైగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డ నిందితుడు

    • 2023 నుంచి హైదరాబాద్‌లో పలు చైన్ స్నాచింగ్‌లు

    • ఏపీలోనూ మూడు చైన్ స్నాచింగ్ కేసులు

    • పోలీసుల నుంచి తప్పించుకుని బెంగళూరు, రాయచోటిలో మకాం

  • Jun 03, 2026 10:21 IST

    హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జ్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్య

    • నాగోల్‌కు చెందిన రోజా రమణి(26)గా గుర్తింపు

    • రోజా కనిపించడం లేదని నాగోల్ పోలీసులకు తల్లి ఫిర్యాదు

    • నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి ఆత్మహత్య

  • Jun 03, 2026 10:16 IST

    పల్నాడు: ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడి భూ కబ్జాలు

    • వినుకొండలో మరో ముస్లిం కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేసిన బొల్లా

    • గత వైసీపీ ప్రభుత్వంలో 40 సెంట్ల భూమి కబ్జా చేసిన బొల్లా

    • ఎమ్మెల్యేగా అధికార దర్పంతో బెదిరింపులకు దిగిన బొల్లా

    • అప్పట్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

    • తనకు న్యాయం చేయాలని బయటకు వచ్చిన బాధిత కుటుంబం

    • ఇప్పటికే పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు

  • Jun 03, 2026 10:13 IST

    కృష్ణాజిల్లా: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తురాలి మృతి

    • రాత్రి స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో నిద్రించిన మహిళ

    • తెల్లవారుజామున చూడగా విగతజీవిగా కనిపించిన మహిళ

    • మృతురాలు ఏలూరు జిల్లా కైకలూరు మండలానికి చెందిన మానుపాటి శ్రీదేవిగా గుర్తింపు

  • Jun 03, 2026 10:10 IST

    కార్ల్‌సన్‌కు మరో షాక్.. చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద

    • నార్వే చెస్ 2026 టోర్నీలో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఘన విజయం

    • ప్రపంచ చెస్ నం.1 మాగ్నెస్ కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద

    • ఈ టోర్నీలో క్లాసికల్ చెస్ విభాగంలో కార్ల్‌సన్‌కు ఇది రెండో ఓటమి

  • Jun 03, 2026 10:08 IST

    హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు

    • బడంగ్‌పేట్ మాజీ మేయర్ పారిజాతకు సిట్ అధికారుల ఫోన్

    • పారిజాత, ఆమె భర్త ఫోన్లు ట్యాప్ అయినట్టు తెలిపిన సిట్

    • కాసేపట్లో సిట్ ఎదుట హాజరుకానున్న పారిజాత, నర్సింహారెడ్డి

  • Jun 03, 2026 10:07 IST

    నల్లగొండ: నార్కట్‌పల్లి శివారులో ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన మినీ ట్రావెల్స్ బస్సు

    • ఒకరి మృతి, 13 మందికి గాయాలు

    • అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై ప్రమాదం

    • అరుణాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న మినీ బస్సు

  • Jun 03, 2026 09:56 IST

    హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

    • అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసంలో ACB సోదాలు

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న భుజంగరావు

    • ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు

    • మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ACB అధికారులు

    • సూర్యాపేట, భుజంగరావు బంధువుల ఇళ్లలోనూ ACB తనిఖీలు

    • ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు

  • Jun 03, 2026 08:54 IST

    పోలవరం: దేవీపట్నం మండలం గంగంపాలెంలో పెద్దపులి కలకలం

    • గంగంపాలెంలో రాత్రి పశువులపై దాడి చేసిన పెద్దపులి

    • పెద్దపులి సంచారంతో భయాందోళనలో గంగంపాలెం వాసులు

  • Jun 03, 2026 08:33 IST

    మహాకవి శేషేంద్ర కవితను ఎక్స్‌లో పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్

  • Jun 03, 2026 08:26 IST

    నేడు గుంటూరు జిల్లా తక్కెళ్లపాడుకు సీఎం చంద్రబాబు

    • లలిత PVS ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

    • కార్యక్రమం తర్వాత సచివాలయానికి చంద్రబాబు

    • మ.3:30కు ఓఎన్‌జీసీ చైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

  • Jun 03, 2026 08:22 IST

    కృష్ణా: మచిలీపట్నం సౌత్ మండలం కోన గ్రామంలో నాటు తుపాకీ కలకలం

    • కుటుంబ కలహాలతో దంపతుల మధ్య వివాదం

    • నాటు తుపాకీతో భార్యను బెదిరించిన రామాంజనేయులు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బందరు తాలూకా పోలీసులు

  • Jun 03, 2026 07:32 IST

    విశాఖ: డ్యాన్స్ మాస్టర్ పండుకు రోడ్డు ప్రమాదం

    • ఆగిఉన్న పండు కారును వెనుక నుంచి ఢీకొన్న కోళ్ల వ్యాన్

    • పండు మాస్టర్‌ కాళ్లకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • తగరపువలస జాతర నుంచి తిరిగి వస్తుండగా ఘటన

    పూర్తి కథనం

  • Jun 03, 2026 07:23 IST

    అమెరికా, ఇరాన్ చర్చలు నిలిచిపోయాయన్న వార్తలను ఖండించిన ట్రంప్

    • అన్నీ అబద్ధాలేనని ట్రూత్‌లో పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్

    • ఇరుదేశాల మధ్య చర్చలు నిరంతరాయంగా సాగుతున్నాయి: ట్రంప్

    • చర్చలు ఏ తీరానికి చేరుకుంటాయో ఎవరూ ఊహించలేరు: ట్రంప్

  • Jun 03, 2026 07:10 IST

    స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

    • 10 గ్రాముల 24, 22 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గుదల

    • 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ.1,56,210గా ట్రేడింగ్

    • రూ.1,43,190 వద్ద ట్రేడ్ అవుతోన్న 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి

    • రూ.100 తగ్గి రూ.2,79,900కు చేరిన కిలో వెండి రేటు

  • Jun 03, 2026 06:46 IST

    నేడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు

    • 4 రోజుల్లో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అకాశం

    • ఛత్తీస్‌గఢ్‌ ఏరియాలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

    • విదర్భ-తెలంగాణ-రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి

  • Jun 03, 2026 06:46 IST

    రెండు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు

    • రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల వాతావరణం

    • రెండో వారంలో రాయలసీమ, తెలంగాణలో ప్రవేశించే అవకాశం

  • Jun 03, 2026 06:45 IST

    ఇంగ్లండ్‌తో ఆఖరి T20లో భారత మహిళల జట్టు ఓటమి

    • భారత్‌పై 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపు

    • స్కోర్లు: ఇంగ్లండ్‌ 184/4, భారత్‌ 180/5

    • 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్‌

  • Jun 03, 2026 06:44 IST

    నేడు అమరావతిలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

    • పొట్టి శ్రీరాములు స్మృతివనం సందర్శించనున్న పవన్‌

    • సాయంత్రం 4:45కు పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు

  • Jun 03, 2026 06:43 IST

    నేటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

    • అమర్‌నాథ్‌ యాత్రకు భారీగా భద్రతా ఏర్పాట్లు

    • పహల్గాం ఉగ్రదాడితో అనంతనాగ్‌ జిల్లాలో హైఅలర్ట్‌

    • శాంతియుతంగా యాత్ర సాగేలా పక్కా ప్లాన్‌

  • Jun 03, 2026 06:43 IST

    CWC సభ్యుడిగా సిద్ధరామయ్య నియామకం

    • కర్ణాటక సీఎంగా రాజీనామా చేసిన సిద్ధరామయ్యను కీలక పదవికి ఎంపిక చేసిన కాంగ్రెస్‌ అధిష్ఠానం

  • Jun 03, 2026 06:39 IST

    నేటి నుంచి భారత్‌లో వెనెజువెలా అధ్యక్షురాలి పర్యటన

    • వెనెజువెలా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భారత్‌లో ఐదురోజుల పర్యటన

    • చమురు, వాణిజ్యం, సాంకేతిక రంగాలపై సమీక్ష

  • Jun 03, 2026 06:38 IST

    ఒంగోలు కిమ్స్‌ ఆసుపత్రి సమీపంలో ప్రమాదం.. యువకుడి మృతి

    • తమిళనాడుకు గంజాయి తరలిస్తుండగా మార్గమధ్యలో ఘటన

    • దాణా బస్తాల లోడ్‌ కింద భారీఎత్తున గంజాయి తరలింపు

  • Jun 03, 2026 06:37 IST

    తెలంగాణలో పెద్ది సినిమా టికెట్‌ ధరల పెంపు

    • నేడు తెలంగాణలో పెద్ది ప్రీమియర్‌ షోకు అనుమతి

    • ప్రీమియర్‌ షో టికెట్‌ ధర రూ.600

    • సింగిల్‌ స్క్రీన్‌పై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 పెంపు

  • Jun 03, 2026 06:34 IST

    వడ్డీ రేట్లపై నేటి నుంచి RBI సమీక్ష

    • కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉండే అవకాశం

  • Jun 03, 2026 06:29 IST

    కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ బాధ్యతలు

    • నేడు సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం

    • నేడు కర్ణాటక మంత్రులుగా ప్రమాణం చేయనున్న 12 మంది