-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National International Live Updates of 12th April 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 12 , 2026 | 05:57 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 12, 2026 21:05 IST
ఏపీలో బెట్టింగ్ నెట్‌వర్క్‌లపై ముమ్మర దాడులు: డీజీపీ హరీశ్ గుప్తా
బెట్టింగ్, జూద కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు: డీజీపీ
జూద కార్యకలాపాలు నిర్వహించేవారిపై కఠినంగా వ్యవహరించాలి: డీజీపీ
బెట్టింగ్ లావాదేవీల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నాం: డీజీపీ
సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై నిరంతర నిఘా: డీజీపీ
-
Apr 12, 2026 20:26 IST
సంగారెడ్డి: పుల్కల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్
గ్యాస్ సిలిండర్ పేలడంతో వ్యాపించిన మంటలు
రెండు పూరిళ్లు దగ్ధం
-
Apr 12, 2026 20:22 IST
కృష్ణా: MLA యార్లగడ్డ విదేశీ పర్యటనకు మచిలీపట్నం కోర్టు అనుమతి
అమెరికా పర్యటన పూర్తి వివరాలు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు
వైసీపీ హయాంలో కేసులతో యార్లగడ్డ విదేశీ పర్యటనకు అడ్డంకులు
-
Apr 12, 2026 20:07 IST
వైసీపీ హయాంలో రైస్ మిల్లుల దగ్గర రైతుల పడిగాపులు: మంత్రి నిమ్మల
గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు రూ.1,640 కోట్లు చెల్లించాం: నిమ్మల
గతంలో రైతులు స్వేచ్ఛగా ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేదు: నిమ్మల
మా ప్రభుత్వంలో 24 గంటల్లోనే ధాన్యం రైతుల ఖాతాల్లో నగదు జమ: నిమ్మల
-
Apr 12, 2026 20:06 IST
మరోసారి ఇరాన్‌పై మండిపడ్డ ట్రంప్
హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలి: ట్రంప్
ఇచ్చిన మాటను ఇరాన్ నిలబెట్టుకోలేదు: ట్రంప్
ఇరాన్ చేతిలో అణుశక్తి ఉండటం ప్రమాదకరం: ట్రంప్
హోర్ముజ్‌లో ఇరాన్ గనులను ధ్వంసం చేస్తాం: ట్రంప్
ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ నిర్వీర్యం అయ్యాయి: ట్రంప్
-
Apr 12, 2026 19:43 IST
పల్నాడు: సత్తెనపల్లిలో 47 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
28 బైకులు, 3 కార్లు, రూ.1.20 లక్షల నగదు, 47 మొబైల్స్ స్వాధీనం
-
Apr 12, 2026 19:39 IST
హైదరాబాద్: బేగంపేటలోని ఓ బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్ చేతివాటం
ఓ బ్యాంక్‌లో NRI ఖాతా నుంచి..
రూ.7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్ వెంకటరమణ
NRI సంతకం ఫోర్జరీతో 41 విడతల్లో డబ్బు కాజేసిన వైనం
బాధితుడి ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు
-
Apr 12, 2026 19:37 IST
ఇరాన్ చేతిలో అణుశక్తి ఉండటం ప్రమాదకరం: ట్రంప్
హోర్ముజ్‌లో ఇరాన్ గనులను ధ్వంసం చేస్తాం: ట్రంప్
ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ నిర్వీర్యం అయ్యాయి: ట్రంప్
-
Apr 12, 2026 19:26 IST
సంగారెడ్డి: కల్వకుంట్లలో పేలిన గ్యాస్ సిలిండర్
ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్
నలుగురికి తీవ్రగాయాలు
-
Apr 12, 2026 19:18 IST
కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైంది: హరీశ్ రావు
గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీస్తున్నారు: హరీశ్ రావు
కొత్త పథకాలు లేవు.. ఉన్నవి కూడా బంద్ చేశారు: హరీశ్ రావు
సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే: హరీశ్ రావు
పేదల ఇళ్లు కూలగొడుతున్నారు: హరీశ్ రావు
-
Apr 12, 2026 19:12 IST
కోనసీమ: కొబ్బరిపీచు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
ఆత్రేయపురం మండలం అంకంపాలెం దగ్గర కొబ్బరిపీచు ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు
మంటల్ని అదుపుచేసిన ఫైర్ సిబ్బంది
-
Apr 12, 2026 19:06 IST
లఖ్‌నవూపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
ఐపీఎల్ 2026లో రెండో విజయం నమోదు చేసిన గుజరాత్
లఖ్‌నవూపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం
హాఫ్ సెంచరీలతో అలరించిన శుభ్‌మన్ గిల్, బట్లర్
165 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించిన గుజరాత్
-
Apr 12, 2026 19:02 IST
TVK చీఫ్ విజయ్ 'జననాయగన్' సినిమా లీక్ కేసులో కీలక పరిణామం
ఆరుగురి అరెస్ట్.. కొనసాగుతున్న దర్యాప్తు
సినిమా విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో కీలక సన్నివేశాలు లీక్
-
Apr 12, 2026 18:59 IST
యాదాద్రి: చౌటుప్పల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
3 కి.మీ. మేర స్తంభించిన ట్రాఫిక్
ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో వాహనాల దారి మళ్లింపు
సర్వీస్ రోడ్ నుంచి మళ్లింపుతో నిలిచిన వాహనాలు
-
Apr 12, 2026 18:55 IST
పల్నాడు: సత్తెనపల్లి రంగా కాలనీలో దారుణం
అన్నను చంపిన చెల్లెలు, ఆమె ప్రియుడు
చెల్లి పద్మ ప్రవర్తన నచ్చకపోవడంతో..
గతంలో మందలించిన అన్న బ్రహ్మయ్య
ఇద్దరు నిందితుల అరెస్ట్
-
Apr 12, 2026 18:53 IST
విశాఖ: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో డయాగ్నోసిస్ సేవలు
డయాగ్నోసిస్ సేవలు ప్రారంభించిన మంత్రి సత్యకుమార్
గెయిల్ ఆర్థిక సహాయంతో రెడ్‌క్రెస్ సొసైటీ సేవలు
-
Apr 12, 2026 18:48 IST
అనకాపల్లి: అచ్యుతాపురం కస్తూర్బా గాంధీ హాస్టల్లో బాలిక మృతిపై RDO చర్యలు
పాము కాటుతో బాలిక మృతిచెందిన ఘటనపై RDO అయేషా నివేదిక
కస్తూర్బా ప్రిన్సిపాల్ ఉమాదేవి, ఇద్దరు టీచర్లు, వాచ్ ఉమెన్, ANM ఈశ్వరిపై సస్పెన్షన్ వేటు
-
Apr 12, 2026 17:54 IST
కాళేశ్వరం బ్యారేజీలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణపై చర్చ
పనుల వేగంపై అధికారులకు మంత్రి దిశా నిర్దేశం
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై స్పీడ్ పెంచిన ప్రభుత్వం
-
Apr 12, 2026 17:31 IST
కవిత విషయంలో చెప్పేదేమీ లేదు: కేటీఆర్
పిల్లలు తండ్రిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు కానీ ఏడిపించొద్దు: కేటీఆర్
ఈ రాజకీయం ఉంటుంది.. పోతుంది.. కానీ..
ఇతరులను బాధపెట్టే తీరు మంచిదికాదు: కేటీఆర్
రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు: కేటీఆర్
ప్రజల ఆదరణ ముఖ్యం: కేటీఆర్
-
Apr 12, 2026 17:23 IST
పోలవరం: కొత్తూరు, వాడపల్లి పరిసరాల్లో పులి సంచారం
అల్లూరి జిల్లా మాంటూరు నుంచి ఏలూరు పరిధిలోకి పులి
పులి కదలికల కోసం అటవీశాఖ వీడియో ట్రాకర్ ఏర్పాటు
-
Apr 12, 2026 17:21 IST
బీజేపీతో కాంగ్రెస్‌కే అనుబంధం ఎక్కువ: కేటీఆర్
తెలంగాణలో సమస్యలపై మేధావులు మాట్లాడాలి: కేటీఆర్
కేసీఆర్ నాయకత్వంపై ప్రజల్లో అసంతృప్తి లేదు: కేటీఆర్
క్షేత్రస్థాయి లోపాలవల్లే గత ఎన్నికల్లో ఓటమి: కేటీఆర్
డీలిమిటేషన్‌తో కొత్త నాయకత్వానికి అవకాశాలు: కేటీఆర్
డీలిమిటేషన్‌పై అభ్యంతరాల్లో అర్థం లేదు: కేటీఆర్
-
Apr 12, 2026 17:20 IST
ఐపీఎల్ 2026: చెలరేగిన ప్రసిద్ధ్.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 165
లఖ్‌నవూ వేదికగా ఎల్ఎస్‌జీ-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్
8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసిన లఖ్‌నవూ జట్టు
4 వికెట్లతో చెలరేగిన జీటీ ప్లేయర్ ప్రసిద్ధ్ కృష్ణ
గుజరాత్ టైటాన్స్ విజయ లక్ష్యం 165 పరుగులు
-
Apr 12, 2026 16:55 IST
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. భారత్‌కు రజతం
అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి
టైటిల్ పోరులో తడబడిన ఆయుష్
చైనాకు చెందిన షియుకిపై ఓడి రజతంతో సరిపెట్టుకున్న ఆయుష్
-
Apr 12, 2026 16:29 IST
అల్లూరి జిల్లాలో ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా
పెదబయలు మండలం పర్రెడ మత్స్యవాగులో..
ఈతకు వెళ్లి ముగ్గురు బాలుర మృతి
మృతులు హర్షిత్(10), శ్రీను(10), ప్రదీప్(9)గా గుర్తింపు
-
Apr 12, 2026 16:02 IST
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు సింగర్ మంగ్లీ
న్యాయవాది సుబ్బారావుపై సింగర్ మంగ్లీ ఫిర్యాదు
తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ ఫిర్యాదు
-
Apr 12, 2026 15:46 IST
సంగారెడ్డి: ఐలాపూర్ అపార్ట్‌మెంట్ కూల్చివేతలో తప్పిన ప్రమాదం
6 అంతస్తుల అపార్ట్‌మెంట్ కూల్చివేస్తుండగా..
మరో అపార్ట్‌మెంట్‌పై పడిన భవన శిథిలాలు, తప్పిన ప్రమాదం
ఎలాంటి ప్రమాదం జరగకుండా కూల్చివేస్తామని హైడ్రా హామీ
స్థానికులు భయాందోళనకు గురికావొద్దు: హైడ్రా
-
Apr 12, 2026 15:39 IST
తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు లేరు: డీజీపీ శివధర్‌రెడ్డి
రోడ్డు ప్రమాదాల నియంత్రణకే అరైవ్-అలైవ్ కార్యక్రమం
రోడ్డు ప్రమాదాల మరణాలు తగ్గించేందుకు కృషి: డీజీపీ
-
Apr 12, 2026 15:33 IST
ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతిపట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ఆశా భోస్లే కుటుంబసభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి
-
Apr 12, 2026 15:27 IST
హైదరాబాద్: IPL మ్యాచ్‌ల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఉప్పల్ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ డైవర్షన్లు
సోమవారం ఉప్పల్‌లో ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ జట్ల మధ్య మ్యాచ్
రేపు మధ్యాహ్నం 12:00 గంటల నుంచి రాత్రి 12:00 గంటల వరకు..
ఉప్పల్ వైపు భారీ వాహనాలకు అనుమతి నిరాకరణ
-
Apr 12, 2026 15:17 IST
దేశంలో జనగణన ప్రక్రియ ప్రారంభం
ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య గృహ, జనగణన
జనగణనకు ప్రజలు సహకరించాలి: ఏపీ ప్రభుత్వం
ఇళ్లకు మార్కింగ్, నెంబర్లు వేసేందుకు అనుమతించాలి: ప్రభుత్వం
జనగణన సిబ్బంది ప్రశ్నలకు ప్రజలు సహకరించాలి: ప్రభుత్వం
గోప్యంగా జనగణన వివరాలు: ఏపీ ప్రభుత్వం
జనగణనకు సహకరించకపోతే రూ.1,000 జరిమానా: ఏపీ ప్రభుత్వం
-
Apr 12, 2026 15:09 IST
విశాఖ: సోమవారం నుంచి ఢిల్లీలో ఇండియన్ నేవీ కమాండర్ల సమావేశం
ఏప్రిల్ 16 వరకు జరగనున్న నౌకాదళ ఉన్నత స్థాయి సదస్సు
దేశ సముద్ర భద్రత, ప్రస్తుత భౌగోళిక రాజకీయ సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించనున్న అధికారులు
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, 'ఆపరేషన్ సిందూర్' తర్వాతి వ్యూహాలపై ప్రత్యేక దృష్టి
-
Apr 12, 2026 14:58 IST
ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చిన తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్
పాకిస్థాన్ శాంతి నెలకొల్పకపోతే.. ఇజ్రాయెల్‌పై దాడి చేయటం మా కర్తవ్యం: ఎర్డోగన్
ఇజ్రాయెల్ చర్యలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి: ఎర్డోగన్
లెబెనాన్‌లోని పౌరులను పొట్టనపెట్టుకోవటం దారుణం: ఎర్డోగన్
-
Apr 12, 2026 14:52 IST
ABN ఆంధ్రజ్యోతిని జగన్ బెదిరించడం దుర్మార్గం: మంత్రి నిమ్మల
అధికారంలోకి వస్తే అంతుచూస్తామని బెదిరిస్తారా?: మంత్రి నిమ్మల
ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో జగన్ ఉన్నారు: మంత్రి నిమ్మల
రక్త చరిత్రనే రాజనీతిగా మార్చుకుని వైసీపీ రాజకీయం: మంత్రి నిమ్మల
వైసీపీ సిద్ధాంతం విధ్వంసం, వినాశనాలే: మంత్రి నిమ్మల
-
Apr 12, 2026 14:44 IST
ఐపీఎల్2026: నితీశ్ రానా, రుతురాజ్ గైక్వాడ్‌లకు బిగ్ షాక్
సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు రూ.12 లక్షల జరిమానా
స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించిన బీసీసీఐ
అంపైర్లతో నితీశ్ రాణా వాగ్వాదం
మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించిన బీసీసీఐ
-
Apr 12, 2026 14:32 IST
మంచిర్యాల: బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన కేటీఆర్
క్యాతనపల్లిలో కాంగ్రెస్ నేతలు నీచ రాజకీయం చేశారు: కేటీఆర్
సంపూర్ణ మెజారిటీ ఉన్నా మంత్రి వివేక్ అడ్డంకులు సృష్టించారు: కేటీఆర్
ఒక్క మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ అహం దెబ్బతింది: కేటీఆర్
దాడులు, అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూశారు: కేటీఆర్
బాల్క సుమన్‌ను ఆదిలాబాద్ జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారు: కేటీఆర్
-
Apr 12, 2026 14:22 IST
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలని ఎంపీలకు మోదీ విజ్ఞప్తి
చట్ట సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఎంపీలకు ప్రధాని అభ్యర్థన
ఇది కోట్లాది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబం: మోదీ
మహిళల అభ్యున్నతికి అవకాశమిస్తేనే సమాజం పురోగతి: మోదీ
16, 17, 18 తేదీల్లో చట్ట సవరణ బిల్లును ఏకగ్రీవం చేయాలని వినతి
-
Apr 12, 2026 13:30 IST
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు..
సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ..
మే 22 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్: ఇంటర్ బోర్డు
-
Apr 12, 2026 12:58 IST
ముంబై: ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) కన్నుమూత
బ్రీచ్‌క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి
1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆశా భోంస్లే జననం
-
Apr 12, 2026 12:54 IST
ABN ఆంధ్రజ్యోతి ఆఫీసుపై వైసీపీ దాడులు దారుణం: ఎంపీ కలిశెట్టి
విజయనగరం: ABN ఆంధ్రజ్యోతిపై వైసీపీ మూకల దాడులు దారుణం
భయపెట్టి అణచివేయాలనుకోవడం వైసీపీ నేతల భ్రమ..
అభివృద్ధి చంద్రబాబుది.. అరాచకం జగన్‌రెడ్డిది: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
-
Apr 12, 2026 12:39 IST
మేకప్ కిట్ తెచ్చివ్వలేదని పెళ్లికి నో
యూపీలో వధువు షాకింగ్ నిర్ణయం
వరుడు వేడుకున్నా.. లక్ష్యపెట్టని వైనం
బిజ్‌నోర్ జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన ఘటన
-
Apr 12, 2026 12:06 IST
ఇరాన్.. అప్పుడు బెదిరించి, ఇప్పుడు భయపడుతోంది: నెతన్యాహు
మా పొరుగు దేశాలతో మమ్మల్ని బెదిరించేందుకు ఇరాన్ యత్నం..
ఇరాన్‌పై యుద్ధంలో తాము ఇప్పటికే చారిత్రక విజయాలు సాధించాం
భవిష్యత్‌లో ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తాం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
-
Apr 12, 2026 11:34 IST
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు చారిత్రకం: ఎంపీ అరవింద్
దేశంలో ఇంత గొప్ప పండగ మరొకటి లేదు..
ఈ బిల్లు ద్వారా చట్ట సభల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది..
మహిళా బిల్లుతో ఎస్సీ, ఎస్టీలకూ మంచి జరుగుతుంది: ఎంపీ అరవింద్
-
Apr 12, 2026 11:06 IST
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు
tgbie.cgg.gov.in, results.cgg.gov.inలో ఇంటర్ ఫలితాలు
-
Apr 12, 2026 10:53 IST
ఢిల్లీ: రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ
మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు మద్దతివ్వాలని వినతి
ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ అధిష్టానం
లోక్‌సభ, రాజ్యసభకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం
-
Apr 12, 2026 09:35 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మందుబాబు కొత్త పంథా
కారు నెంబర్ ప్లేట్ ఆటోమేటిక్‌గా మారేలా ఏర్పాట్లు
ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు యత్నం
మద్యం మత్తులో పోలీసులకు పట్టుబడ్డ డ్రైవర్
నెంబర్ ప్లేట్ మార్చే విధానం చూసి అవాక్కైన పోలీసులు
-
Apr 12, 2026 09:34 IST
రంగారెడ్డి: శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
సర్వారెడ్డి కాలనీలోని గోదాంలో చెలరేగిన మంటలు
గోదాం పక్కన ఉన్న నివాసాలకూ వ్యాపించిన మంటలు
గోదాంలోని డెకరేషన్ సామగ్రి దగ్ధం
మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది
-
Apr 12, 2026 09:33 IST
లోడుతో వెళ్తున్న లారీలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం..
ఏలూరు: చోదిమెళ్ల దగ్గర తౌడు లోడుతో వెళ్తున్న లారీలో మంటలు
మినీ గ్యాస్ సిలిండర్ పేలి చెలరేగిన మంటలు
ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన లారీ
డ్రైవర్‌కు స్వల్పగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
-
Apr 12, 2026 09:29 IST
ఢిల్లీలో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం
కార్యక్రమాన్ని ప్రారంభించిన రాహుల్‌గాంధీ
మండి హౌస్ నుంచి అంబేద్కర్ మెమోరియల్ వరకూ రన్
-
Apr 12, 2026 08:50 IST
హైదరాబాద్: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న ఇంటర్ బోర్డు
-
Apr 12, 2026 08:48 IST
పశ్చిమబెంగాల్‌లో నేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
Apr 12, 2026 08:46 IST
నేడు బెంగాల్‌లో యూపీ సీఎం ప్రచారం
మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
-
Apr 12, 2026 08:40 IST
ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు
నంద్యాల: ఆళ్లగడ్డ మండలం ఆర్.కృష్ణాపురంలో దారుణం
ఆస్తి కోసం అన్న దైవ భక్తుడు (40)ను హత్య చేసిన తమ్ముడు విజయరాజు
అడ్డుకోబోయిన మరో ఇద్దరిని గాయపరిచిన విజయరాజు
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Apr 12, 2026 08:02 IST
ఇది ఒక దురదృష్టకర వార్త: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
ఇరాన్‌తో చర్చల్లో ఎలాంటి పురోగతీ లేదు..
మా డిమాండ్లను ఇరాన్ అంగీకరించడం లేదు..
21 గంటల పాటు కీలక చర్చలు జరిపాం: జేడీ వాన్స్
-
Apr 12, 2026 08:01 IST
గల్ఫ్ నుంచి భారత్‌కు LPG నౌక జగ్ విక్రమ్
హోర్ముజ్ జలసంధి దాటి ఒమన్‌కు భారత నౌక
20వేల టన్నుల LPGని భారత్‌కు తీసుకురానున్న నౌక
-
Apr 12, 2026 07:59 IST
ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు
లక్నోలో మధ్యాహ్నం 3:30కు లక్నో వర్సెస్ గుజరాత్
ముంబైలో రా.7:30కు ముంబై Vs బెంగళూరు
-
Apr 12, 2026 07:59 IST
నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీ పర్యటన
రన్ ఫర్ అంబేద్కర్.. రన్ ఫర్ కాన్‌స్టిట్యూషన్ మారథన్
మారథన్‌ను ప్రారంభించనున్న రాహుల్‌గాంధీ
-
Apr 12, 2026 07:58 IST
రాజన్నసిరిసిల్ల: ఇంకా దొరకని ATM ఆచూకీ
నిన్న ఎల్లారెడ్డిపేటలోని SBI ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లిన దొంగలు
శనివారం, ఆదివారం సెలవు కావడంతో దొంగల స్కెచ్
ATMలో నగదు ఎంత ఉందన్న దానిపై బ్యాంకు అధికారుల ఆరా
-
Apr 12, 2026 06:59 IST
బొలెరో బోల్తా.. 15 మందికి గాయాలు
పల్నాడు: సత్తెనపల్లి మండలం నందిగాంలో బొలెరో ట్రక్కు బోల్తా
15 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు
-
Apr 12, 2026 06:46 IST
ఎలా చూసినా గెలుపు అమెరికాదే: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఇరాన్‌పై ఇప్పటికే సైనిక విజయం సాధించాం..
చర్చల్లో ఏం జరుగుతుందనేది నాకు అనవసరం..
హోర్ముజ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు..
ఒప్పందం ఏదైనా జలసంధిలోని మైన్లను తొలగిస్తాం: డొనాల్డ్ ట్రంప్
-
Apr 12, 2026 06:41 IST
బిహార్: కటిహార్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం
ఒకదానితో మరొకటి ఢీకొన్న.. ట్రక్కు, బస్సు, వ్యాను
13 మంది మృతి, మరో 30 మందికి గాయాలు
-
Apr 12, 2026 05:57 IST
అమెరికా-ఇరాన్ మధ్య ముగిసిన తొలిదశ చర్చలు
జేడీ వాన్స్, ఇరాన్ స్పీకర్ మధ్య ముఖాముఖి చర్చలు
రెండు విడతలుగా 14 గంటల పాటు కొనసాగిన చర్చలు
ప్రతిపాదనలను పరస్పరం మార్చుకున్న అమెరికా-ఇరాన్