Share News

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:19 AM

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేకే ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను..

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in, results.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ వ్యాప్తంగా 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం 66.20 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. ఇంటర్‌ రెండో సంవత్సరం 70.58 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొత్తం 75.61 ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే 4 శాతం ఉత్తీర్ణత పెరిగింది. కాగా, ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 74.40 శాతం బాలికలు , 57.69 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు.


ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. 82.34 శాతం ఉత్తీర్ణతతో జైశంకర్ భూపాలపల్లి జిల్లా రెండోవ స్థానంలో నిలిచింది. 82.16 శాతం ఉత్తీర్ణతతో కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా మూడవ స్థానం దక్కించుకుంది.


Also Read:

ఎమ్మెల్యే హామీ.. కీర్తన అంత్యక్రియలకు సిద్ధమైన కుటుంబం

అర్ధరాత్రి మహిళ ఒంటరి ప్రయాణం.. ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే..

అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

Updated Date - Apr 12 , 2026 | 11:31 AM