ఎమ్మెల్యే హామీ.. కీర్తన అంత్యక్రియలకు సిద్ధమైన కుటుంబం
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:26 AM
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఇచ్చిన హామీలతో కీర్తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే సుధాకర్ భరోసా ఇచ్చారు.
కడప జిల్లా: ఖాజీపేటలో కీర్తన అనే అమ్మాయిని వెంకటేశ్ అనే దుర్మార్గుడు అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ప్రేమించలేదనే కారణంతో శనివారం రోజున కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. యువతి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ కీర్తనకు అంత్యక్రియలు నిర్వహించకుండా బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, ప్రభుత్వ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఇచ్చిన భరోసాతో కీర్తన కుటుంబ సభ్యులు, బంధువులు శాంతించి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే, నిందితుడు వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రెండు రోడ్డు ప్రమాదాలు.. ఒకరి మృతి, 15 మందికి గాయాలు..
తిరుచానూరు పద్మావతి ఆలయ వాహన బేరర్లపై వైసీపీ బ్యాచ్ దాడి..