Share News

మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం: ఎంపీ అరవింద్..

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:38 AM

దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడమనేది చారిత్రక ఘట్టమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం: ఎంపీ అరవింద్..
MP Dharmapuri Arvind

నిజామాబాద్: దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడమనేది చారిత్రక ఘట్టమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇంత గొప్ప పండగ మరొకటి లేదని అరవింద్ పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా చట్ట సభల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు.


మహిళా బిల్లుతో ఎస్సీ, ఎస్టీలకూ మంచి జరుగుతుందన్నారు. మహిళా రిజర్వేషన్లతో పారదర్శకత పెరిగి అవినీతి తగ్గుతుందని ఎంపీ అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా బిల్లునూ రాజకీయం చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఎంపీ అరవింద్ ఆగ్రహించారు. బీసీలను అనగదొక్కిందే కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. ఆనాడు మండల్ కమిషన్‌ను వ్యతిరేకించిందీ వాళ్లేనని ఆరోపించారు. ఎంపీ లక్ష్మణ్‌తో తనకెలాంటి గ్యాప్ లేదన్నారు అరవింద్.


తాను చిట్ చాట్ చేయనని.. అంతా ఓపెన్‌గా మాట్లాడతానని ధర్మపురి అరవింద్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ఐకాన్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు. రాకేశ్ రెడ్డితోనూ తనకెలాంటి గ్యాప్ లేదని.. ఆయన సోదరుడితో సమానమని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీకి మెజారిటీ సీట్లు సాధించే రేసులో ముందుటానని, అదే తన లక్ష్యమంటూ చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎమ్మెల్యే హామీ.. కీర్తన అంత్యక్రియలకు సిద్ధమైన కుటుంబం

భద్రాచలంలో పెరిగిన భక్తుల రద్దీ..

Updated Date - Apr 12 , 2026 | 11:46 AM