Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 08 , 2026 | 06:40 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Apr 08, 2026 21:16 IST

    కాంగ్రెస్‌ మాజీమంత్రి జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌

    • రేపు మధ్యాహ్నం జగిత్యాలకు కేటీఆర్‌

    • జీవన్‌రెడ్డిని BRSలోకి ఆహ్వానించనున్న కేటీఆర్‌

  • Apr 08, 2026 21:16 IST

    హైదరాబాద్‌: మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో HFAST పోలీసుల సోదాలు

    • ఫుడ్ తయారీ యూనిట్లలో ఆకస్మిక తనిఖీలు

    • భారీగా కల్తీ సహా నాణ్యతలేని ఆహార పదార్థాలు పట్టివేత

  • Apr 08, 2026 21:02 IST

    అమరావతిలో ప్రారంభం కానున్న అకౌంటెంట్ జనరల్ ఆఫీస్‌

    • కాగ్ ఆధ్వర్యంలో పనిచేయనున్న అకౌంటెంట్ జనరల్ ఆఫీస్‌

    • ఏజీ ఆఫీస్‌కు గతంలో 787 సెంట్ల భూమి రాయపూడిలో కేటాయింపు

  • Apr 08, 2026 21:00 IST

    రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

    • 2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: చంద్రబాబు

    • 1.37 లక్షల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22A నుంచి తొలగింపు

    • ఇతర సర్వీస్ ఇనాంలోని మరో లక్ష ఎకరాల భూములకూ విముక్తి: చంద్రబాబు

    • ఇనాం భూముల అంశంపై కొత్తగా చట్టం తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశం

    • 2016కు ముందు ప్రభుత్వ హౌసింగ్ స్కీంలో పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్

    • 75 లక్షల పేద కుటుంబాలకు వరాలు ప్రకటించిన ప్రజా ప్రభుత్వం

  • Apr 08, 2026 19:40 IST

    అమరావతి: ముఖ్యమంత్రితో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ

    • అమరావతిలో భారీగా పెట్టుబడులకు అవకాశముందన్న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు

    • రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని అభిప్రాయపడ్డ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు

    • అమరావతి సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం వెల్లడి

  • Apr 08, 2026 19:36 IST

    మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసు నిందితులకు మరోసారి పోలీస్‌ కస్టడీ

    • పైలట్‌ రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌ శర్మకు రెండు రోజులపాటు పోలీస్‌ కస్టడీ

    • మూడోసారి పోలీస్‌ కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతి

    • ఆర్థిక లావాదేవీలు, డ్రగ్స్‌ పార్టీలపై నిందితులను ప్రశ్నించనున్న సిట్‌

  • Apr 08, 2026 19:35 IST

    చంద్రబాబు అధికారంలో ఉండేది సగం టెర్మ్: జగన్‌

    • వచ్చే ఏడాది తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తా: జగన్‌

    • ఏడాదిన్నరపాటు ప్రతి నియోజకవర్గంలో తిరుగుతా: జగన్‌

    • పాదయాత్ర మొదలైన తర్వాత చంద్రబాబుకు రోజూ సినిమా చూపిస్తా: జగన్‌

  • Apr 08, 2026 19:34 IST

    రేపు జగిత్యాలకు కేటీఆర్

    • జీవన్‌రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించనున్న కేటీఆర్‌

    • జీవన్‌రెడ్డి అంశంపై కేసీఆర్‌తో చర్చించిన కేటీఆర్

  • Apr 08, 2026 19:17 IST

    విశాఖ: ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు

    • శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్‌

    • శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 'మెగా కల్చరల్‌ ఫెస్ట్'

  • Apr 08, 2026 18:08 IST

    కాల్పుల విరమణకు ఇరాన్ ప్రాధేయపడింది: అమెరికా

    • ఇరాన్‌పై చేపట్టిన 'ఆపరేషన్‌ ఎపిక్ ఫ్యూరీ' చరిత్రాత్మకం: అమెరికా మంత్రి హెగ్సెత్‌

    • ఇరాన్‌తో ఇక ముప్పు లేదు: హెగ్సెత్‌

  • Apr 08, 2026 17:46 IST

    రేపు కేరళం, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

    • కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

    • అసోం 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

    • ఈనెల 23న తమిళనాడు, 23 & 29న బెంగాల్‌ ఎన్నికలు

    • మే 4న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

  • Apr 08, 2026 17:14 IST

    అమెజాన్‌లో మరోసారి భారీగా లేఆఫ్‌లు

    • ఉద్యోగులపై పెద్దఎత్తున వేటు వేసేందుకు సిద్ధమైన అమెజాన్

    • మే నెలలో 14 వేల మందిని తొలగించనున్నట్లు ఆసియా బిజినెస్‌ అవుట్‌లుక్‌ వెల్లడి

  • Apr 08, 2026 17:12 IST

    కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

    • ఖరీఫ్‌లో రూ.41,534 కోట్ల ఎరువుల రాయితీకి ఆమోదం

    • రూ.13 వేల కోట్లతో జైపూర్‌ మెట్రో రెండోదశకు ఆమోదం

    • రాజస్థాన్‌లో HPCL రిఫైనరీకి రూ.79,459 కోట్లకు ఆమోదం

    • ఈశాన్యంలో హైడ్రో పవర్‌ ప్లాంట్స్‌ కోసం రూ.26,070 కోట్లు

    • కళాయి-2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసం 14,106 కోట్లు

  • Apr 08, 2026 17:11 IST

    మై టీడీపీ యాప్ టాప్-10 ఫెర్ఫార్మర్లతో మంత్రి లోకేశ్ ఆత్మీయ భేటీ

    • కష్టపడిన వారిని గుర్తించాలనేది టీడీపీ సిద్ధాంతం: మంత్రి లోకేశ్

    • మీ పని తీరే ఇక్కడి వరకు రావడానికి కారణం: మంత్రి లోకేశ్

    • పార్టీ పిలుపునిచ్చిన పని సక్రమంగా చేస్తే పార్టీ వందేళ్లు ఉంటుంది: మంత్రి లోకేశ్

  • Apr 08, 2026 16:57 IST

    నాదర్‌గుల్ భూములకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం ఏంటి?: మంత్రి పొంగులేటి

    • 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు: పొంగులేటి

    • 2016లో ఈ భూముల మ్యుటేషన్‌ చేశారు: మంత్రి

    • మ్యుటేషన్‌పై ఆధారాలు ఉన్నాయి: మంత్రి

    • హరీష్‌రావు అబద్ధాలు మాట్లాడుతున్నారు: మంత్రి

    • నీ బండారం బయటపడుతుందని మాపై నిందలు వేస్తున్నారు: మంత్రి

  • Apr 08, 2026 16:31 IST

    కాకినాడ: తునిలో భారీ వర్షం

    • రహదారులు జలమయం

    • తీవ్ర ఉష్ణోగ్రతలతో సతమతం అవుతున్న జనానికి వర్షంతో ఊరట

  • Apr 08, 2026 16:04 IST

    హన్మకొండ: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

    • 100 ఎకరాల భూ దందా కథనంపై రాజకీయ పార్టీల స్పందన

    • కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ నేతల ధర్నా

    • భూ దందాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

    • పేదలకు కేటాయించిన అసైన్డ్‌ భూముల కబ్జాపై ఆగ్రహం

  • Apr 08, 2026 16:03 IST

    విశాఖ: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

    • సాంకేతిక లోపంతో రన్‌వే పై నిలిచిన ఇండిగో విమానం

    • విశాఖ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానం

  • Apr 08, 2026 16:03 IST

    నెల్లూరు: కృష్ణపట్నం పోర్టు దగ్గర మరో తమిళనాడు బోటు పట్టివేత

    • ఇటీవల వరుసగా 3 బోట్లు పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ బృందాలు

    • నాలుగు బోట్లను జువ్వెలదిన్నె హార్బర్‌కి తరలింపు

  • Apr 08, 2026 15:59 IST

    టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం

    • క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ వరుసగా నాలుగు వారాలు నిర్వహించని నాయకులపై లోకేష్ ఆగ్రహం

    • పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాలని లోకేష్ ఆదేశం

    • ఇకముందు ఇలానే వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన లోకేష్

  • Apr 08, 2026 15:38 IST

    లాభాలతో ముగిసిన అన్నిరంగాల షేర్లు

    • ఇరాన్‌-అమెరికా కాల్పుల విరమణ ఒప్పందంతోపాటు..

    • అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో భారీ లాభాల్లో సూచీలు

    • రూ.15 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

  • Apr 08, 2026 15:37 IST

    లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 2,946 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 874 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • Apr 08, 2026 15:36 IST

    ఆసిఫాబాద్‌: కాగజ్‌నగర్‌ పెద్దవాగు రైల్వే బ్రిడ్జి పనుల్లో ప్రమాదం

    • బాక్స్‌ బ్రిడ్జి పైనుంచి జారిపడిన ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలు

    • బ్రిడ్జి మధ్యలోనే ఇరుక్కున్న మరో కార్మికుడు, కొనసాగుతున్న రెస్క్యూ

    • ప్రమాద స్థలిలోనే కార్మికులకు కొనసాగుతున్న చికిత్స

  • Apr 08, 2026 15:36 IST

    వైసీపీ నేతల బూతు వ్యాఖ్యలపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

    • విమర్శలపై ప్రజాస్వామ్య రీతిలో స్పందించాలి

    • న్యాయస్థానాల్లోనూ పోరాడవచ్చు.. దాడులే సమాధానం కాదు

    • వైసీపీ నేతలవి దిగజారుడు వ్యాఖ్యలు

    • విమర్శలు స్వీకరించలేక.. దాడులకు తెగబడటం సరికాదు

  • Apr 08, 2026 15:35 IST

    దేశంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం భారీ ఊరట

    • ఫార్మా, ఫుడ్‌, పాలిమర్‌, స్టీల్‌, గ్లాస్‌ వంటి పరిశ్రమలకు బల్క్‌ నాన్‌డొమెస్టిక్‌ LPG కేటాయింపులు

    • PNG సంస్కరణలు అమలుచేసే రాష్ట్రాలకు అదనంగా 10 శాతం వరకు LPG కేటాయింపులు

    • కేటాయింపుల కోసం OMCల దగ్గర రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

  • Apr 08, 2026 13:19 IST

    అమరావతి: రహదారులు, భవనాలు, రవాణాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • రహదారుల నిర్వహణ, పాట్‌హోల్‌ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగంపై చర్చ

    • రహదారులు నిర్వహణ పటిష్ఠంగా ఉండాలి: చంద్రబాబు

    • భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి..

    • దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలి: చంద్రబాబు

    పూర్తి కథనం

  • Apr 08, 2026 12:41 IST

    కృష్ణా: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీలు

    • పలు విభాగాలను తనిఖీ చేసిన మంత్రి

    • సిబ్బంది అటెండెన్స్‌ను పరిశీలించి సమయపాలన పాటించని సిబ్బందిపై ఆగ్రహం

  • Apr 08, 2026 12:29 IST

    బాపట్ల: వేమూరు నియోజకవర్గంలో గురువారం సీఎం చంద్రబాబు పర్యటన

    • భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో ప్రజావేదికలో పాల్గొననున్న చంద్రబాబు

    • రెవెన్యూ సమస్యలపై రైతులు, అధికారులతో చంద్రబాబు సమావేశం

  • Apr 08, 2026 12:21 IST

    హైదరాబాద్‌: BRS ఆఫీస్‌ను ముట్టడించిన తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ

    • తెలంగాణ భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఉద్యమకారుల యత్నం

    • ఉద్యమకారులను BRS పట్టించుకోవడం లేదంటూ నినాదాలు

    • ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు.. తోపులాట

  • Apr 08, 2026 12:13 IST

    ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు సమావేశం

    • పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ నిర్వహణపై చర్చ

    • 27న ప్లీనరీ లేదా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించే యోచనలో BRS

    • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్లీనరీ లేదా సమావేశం నిర్వహించే అవకాశం

    • మాజీ MLC జీవన్‌రెడ్డి పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం

    • కేసీఆర్‌తో భేటీ తర్వాత జీవన్ రెడ్డిని కలవనున్న కేటీఆర్

  • Apr 08, 2026 12:07 IST

    అమరావతి: ప్రజాస్వామ్య రీతిలోనే స్పందించాలి: పవన్‌ కల్యాణ్‌

    • విమర్శలు, వ్యాఖ్యలపై స్పందించడంలో..

    • ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలి: పవన్‌ కల్యాణ్‌

    • న్యాయస్థానాల్లోనూ పోరాడవచ్చు.. దాడులే సమాధానం కాదు: పవన్ కల్యాణ్

  • Apr 08, 2026 11:34 IST

    ఇరాన్‌లోని భారత పౌరులకు ఎంబసీ కీలక ఆదేశాలు

    • ఇరాన్‌ నుంచి భారతీయులు వెళ్లిపోవాలని ఎంబసీ ఆదేశం

    • అవసరమైతే భారత రాయబార కార్యాలయం సహాయం తీసుకోవాలని సూచన

    • తాము సూచించిన మార్గాల్లో దేశాన్ని వీడాలని ఎంబసీ ఆదేశం

  • Apr 08, 2026 10:59 IST

    జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్‌పై తీర్పు వాయిదా

    • ఈనెల 22కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

    • కాళేశ్వరం కమిషన్‌ను సవాల్‌ చేసిన KCR, హరీష్‌రావు

    పూర్తి కథనం

  • Apr 08, 2026 10:57 IST

    శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ

    • నేడు, రేపు కొనసాగనున్న వాదనలు

  • Apr 08, 2026 10:51 IST

    హైదరాబాద్‌: మంత్రి ఉత్తమ్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ

    • కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం

    • ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను తరచూ ఆన్ - ఆఫ్ చేస్తే దెబ్బతింటాయి: హరీశ్ రావు

    • పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే కుట్ర చేస్తున్నారా?: హరీశ్ రావు

    • BRSపై నెపం నెట్టేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారా?: హరీశ్ రావు

    పూర్తి కథనం

  • Apr 08, 2026 09:48 IST

    నిజామాబాద్: మద్నూర్ మండలం మేనూరు వద్ద రోడ్డు ప్రమాదం

    • లారీ ఢీకొని ముగ్గురి దుర్మరణం

    • మృతులు మద్నూర్ మండలం పెద్ద ఎక్లారాకు చెందిన..

    • నాగు, సచిన్, నాగల్ గాప్ కు చెందిన అశోక్‌గా గుర్తింపు

  • Apr 08, 2026 09:19 IST

    హైదరాబాద్‌: అసోసియేట్ డీన్ గోవర్ధన్ నివాసంలో ఏసీబీ సోదాలు

    • మంగళవారం రూ.1లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయిన అసోసియేట్‌ డీన్‌ గోవర్ధన్‌

    • రాజేంద్రనగర్‌ వ్యవసాయ వర్సిటీలో అసోసియేట్ డీన్‌గా ఉన్న గోవర్ధన్‌

  • Apr 08, 2026 08:48 IST

    సూర్యాపేట: చివ్వేంల మండలం వల్లభాపురం దగ్గర రోడ్డు ప్రమాదం

    • బొలెరోను ఢీకొన్న డీసీఎం, ఇద్దరి మృతి

  • Apr 08, 2026 08:21 IST

    హైదరాబాద్‌: వనస్థలిపురం సమీపంలో రోడ్డు ప్రమాదం

    • వనస్థలిపురం పీఎస్‌ పరిధిలోని హస్తినాపురం వద్ద బైక్‌ను ఢీకొన్న కారు

    • ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

    • మృతులు శివ, సందీప్‌ జోహెల్‌‌గా గుర్తింపు

  • Apr 08, 2026 08:09 IST

    క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రికి అరుదైన గౌరవం

    • వాంఖడే స్టేడియంలో స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టాలని నిర్ణయం

    • ఈ నెల 9న రవిశాస్త్రి స్టాండ్ ఆవిష్కరణ

    • ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

    పూర్తి కథనం

  • Apr 08, 2026 07:58 IST

    కేరళంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

    • గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములు

    • 2011 ఫలితాలు రిపీట్ అవుతాయంటున్న కాంగ్రెస్

    • కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమంటున్న సీపీఐ(ఎం)

    • ఉనికిని చాటుకోవటానికి బీజేపీ పోరాటం

  • Apr 08, 2026 07:48 IST

    అమెరికా-ఇరాన్‌ మధ్య ఫలించిన పాకిస్తాన్ మధ్యవర్తిత్వం

    • పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆర్మీ చీఫ్‌ మునీర్‌తో చర్చల తర్వాత..

    • కాల్పుల విరమణ ప్రకటన చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

    • శాశ్వత శాంతి దిశగా అడుగులేస్తున్నామన్న ట్రంప్

  • Apr 08, 2026 07:41 IST

    నేడు మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ భేటీ

    • పశ్చిమాసియా యుద్ధం, తాజా పరిణామాలపై చర్చ

  • Apr 08, 2026 07:33 IST

    శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ

    • నేడు, రేపు కొనసాగనున్న వాదనలు

  • Apr 08, 2026 07:28 IST

    రేపు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

    • అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్‌కు ఏర్పాట్లు

  • Apr 08, 2026 07:24 IST

    కామారెడ్డి: మద్నూర్‌ మండలం మేనూరు వద్ద రోడ్డు ప్రమాదం

    • బైక్‌ను ఢీకొన్న లారీ, ముగ్గురి మృతి

    • మృతులు నాగు, అశోక్‌, సచిన్‌గా గుర్తింపు

  • Apr 08, 2026 07:19 IST

    ఇరాన్‌-ఒమన్‌ దేశాలకు కొత్త ఆదాయమార్గం

    • హోర్ముజ్‌ జలసంధిని దాటే నౌకలపై ఛార్జీలు

    • యుద్ధ విరమణ చర్చల్లో కొత్త ప్రతిపాదన

    • యుద్ధ నష్టాలను పునర్నిర్మిస్తామని ఇరాన్‌ వెల్లడి

  • Apr 08, 2026 07:09 IST

    మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసు..

    • నిందితుల కస్టడీ పిటిషన్లపై నేడు ఉప్పరపల్లి కోర్టు తీర్పు

    • రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌ శర్మ బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసిన కోర్టు

  • Apr 08, 2026 07:03 IST

    అమరావతి: నేడు ఆంధ్ర విశ్వ విద్యాలయానికి పవన్‌ కల్యాణ్‌

    • మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు హాజరుకానున్న పవన్

  • Apr 08, 2026 06:52 IST

    నేటి మార్కెట్లో బంగారం ధరలివీ..

    • బుధవారం ఉదయం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,830

    • 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,37,340

    • వెండి ధర కిలోకు సుమారు రూ.2.55 లక్షలు

  • Apr 08, 2026 06:50 IST

    ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు

    • కాల్పుల విరమణ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

    • పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను అంగీకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి

    • ఇరాన్ కూడా ఈ తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించినట్లు ప్రకటన

    పూర్తి కథనం

  • Apr 08, 2026 06:45 IST

    ఈ నెల 10న ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్‌ చర్చలు

    • పూర్తిస్థాయి శాంతి ఒప్పందం దిశగా సమావేశం

    • ట్రంప్‌ ప్రకటనతో గ్లోబల్‌ మార్కెట్లకు ఊరట

    • 8 శాతం తగ్గిన క్రూడాయిల్‌ ధరలు

    • 117 నుంచి 103 డాలర్లకు చేరిన బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర

  • Apr 08, 2026 06:42 IST

    హోర్ముజ్‌ జలసంధి తెరిచేందుకు ఇరాన్‌ అంగీకారం

    • రెండు వారాలపాటు హోర్ముజ్‌ తెరుస్తామన్న ఇరాన్‌

    • 10 పాయింట్ల ప్రతిపాదనకు అంగీకరించిన అమెరికా

    • నౌకలను భద్రంగా హోర్ముజ్‌ దాటిస్తాం: ఇరాన్‌ విదేశాంగ శాఖ