-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 4th September 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 04 , 2026 | 07:08 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Sep 04, 2026 09:30 IST
ఫోక్స్‌వ్యాగన్‌లో సంచలనం
లక్ష మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సూపర్‌వైజరీ బోర్డు నిర్ణయం
ట్రంప్ సుంకాలతో భారం, చైనా సంస్థల నుంచి పెరిగిన పోటీ
ప్రస్తుత పరిస్థితుల్లో పునర్ వ్యవస్థీకరణ తప్పదన్న ఫోక్స్‌వ్యాగన్
-
Sep 04, 2026 08:45 IST
విజయవాడ: రామలింగేశ్వర నగర్ ఇస్కాన్ టెంపుల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), బొప్పన భవకుమార్, బహుదూర్
రాష్ట్రం, దేశ వ్యాప్తంగా ప్రజలు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకొంటున్నారు: ఎంపీ కేశినేని శివనాథ్
ఇస్కాన్ ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా చేస్తున్నారు: ఎంపీ కేశినేని శివనాథ్
-
Sep 04, 2026 08:29 IST
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రజలకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు
భగవద్గీతతో కర్తవ్యం, జ్ఞానాన్ని అందించిన భగవానుడు.. శ్రీకృష్ణుడు: మంత్రి నారా లోకేశ్
-
Sep 04, 2026 08:17 IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటులు సాయికుమార్, ఆది
ఇరుముడి బ్లాక్ బ్లస్టర్ అయ్యింది: సాయికుమార్
అంతా గురుస్వామి అన్ని పిలవడం సంతోషంగా ఉంది: సాయికుమార్
తెలుగులో సైరా భానుతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నా: సాయికుమార్
తమిళ్,కన్నడాలో కూడా కొన్ని చిత్రాల్లో చేస్తున్నాను: సాయికుమార్
ప్రేక్షకుల ఆధారాభిమానాలు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా: నటుడు ఆది
-
Sep 04, 2026 08:15 IST
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు : సీఎం చంద్రబాబు
-
Sep 04, 2026 08:14 IST
ఇరాన్‌లో పెళ్లింటిపై దాడి ఘటన.. దర్యాప్తు చేస్తున్నాం: జేడీ వాన్స్
మంగళవారం ఖుహెస్టక్ టౌన్‌లో పెళ్లి జరుగుతున్న ఇంటిపై దాడి
ఐఆర్‌జీసీ టార్గెట్‌గా యూస్ దాడుల సమయంలో ఘటన
అమెరికా దాడితోనే పెళ్లింట నలుగురు మరణించారని ఇరాన్ ఆరోపణ
-
Sep 04, 2026 07:50 IST
కృష్ణాజిల్లా : సీఎం చంద్రబాబుతో గుడివాడ MLA వెనిగండ్ల రాము భేటీ
గుడివాడ నియోజకవర్గ అభివృద్ధిపై వినతిపత్రాల అందజేత
రోడ్లు, మౌలిక వసతులు, కీలక ప్రాజెక్టులపై సీఎంతో చర్చ
నిధులుమంజూరుకు సీఎం చంద్రబాబు హామీ
-
Sep 04, 2026 07:45 IST
కొండా సురేఖను తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
సీఎం సిఫారసుతో నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో ప్రస్తావన
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం చర్య
-
Sep 04, 2026 07:45 IST
ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
శ్రీకృష్ణుడి బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ
-
Sep 04, 2026 07:35 IST
తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అదనపు బస్సులు
భక్తుల రద్దీ దృష్ట్యా ఏపీ-తమిళనాడు మధ్య 300 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఒప్పందం
తిరుపతి నుంచి పలు ప్రాంతాలకు 150 బస్సుల చొప్పున నడపపనున్న ఏపీ, తమిళనాడు RTCలు
ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలతో భక్తుల సౌకర్యార్థం అదనపు ట్రిప్పులు నడిపేందుకు చర్యలు
-
Sep 04, 2026 07:30 IST
హైదరాబాద్: 22ఏ భూ సమస్యలపై తెలంగాణ జనసేన నిరసన
కాసేపట్లో ఇందిరాపార్క్ వద్ద జనసేన ఆధ్వర్యంలో ధర్నా
పాల్గొననున్న జనసేన తెలంగాణ నాయకులు
-
Sep 04, 2026 07:20 IST
హైదరాబాద్: నేడు పాలిటెక్నిక్ విద్యార్థులతో హై-లెవల్ కమిటీ కీలక భేటీ
మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో సమావేశం
పాలిటెక్నిక్ విద్య ఆధునికీకరణపై చర్చ
విద్యార్థుల విద్యా, కెరీర్ ప్రయోజనాల పరిరక్షణపై చర్చ
హై-లెవల్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో చర్చ
-
Sep 04, 2026 07:15 IST
ప్రకాశం : కొండపి వద్ద రోడ్డు ప్రమాదం
బైకు అదుపుతప్పి బోల్తా., ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Sep 04, 2026 07:00 IST
తిరుపతి: భాకరాపేట అటవీ క్షేత్రాధికారి ఎన్. వెంకటరమణపై సస్పెన్షన్ వేటు
సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి చలపతిరావు
అటవీ చెక్‌పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్న సిగరెట్ల నిల్వలను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారని ఆరోపణలు
-
Sep 04, 2026 06:55 IST
హైదరాబాద్: కొనసాగుతోన్న BRS సమరభేరి
నేడు మహిళలు, దివ్యాంగుల సమస్యలపై నిరసనలు
మంచిర్యాల, కాగజ్‌నగర్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన
-
Sep 04, 2026 06:50 IST
కర్నూలు: పత్తికొండ మండలం కోతిరాల గ్రామ శివారులో మహిళ హత్య
పొలంలో శాంతమ్మ అనే మహిళ దారుణ హత్య
పొలం తగాదా విషయంలో బండ రాయితో మోది హత్య చేసినట్లు అనుమానం
ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Sep 04, 2026 06:45 IST
అనంతపురం: పెద్దవడుగూరు మండలం మిడుతూరులో రోడ్డు ప్రమాదం
ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు, మంటలార్పిన ఫైర్ సిబ్బంది
డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు
ప్రమాదంలో పూర్తిగా తగలబడ్డ ప్రైవేట్ స్లీపర్ బస్సు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన
-
Sep 04, 2026 06:30 IST
నేడు KRMB త్రిసభ్య కమిటీ సమావేశం
హైదరాబాద్ జలసౌధలో కీలక సమావేశం
సమావేశానికి హాజరుకానున్న ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు
-
Sep 04, 2026 06:15 IST
హైదరాబాద్: కూకట్‌పల్లి JNTUలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ
రాత్రి తీజ్ వేడుకల్లో ఓ విద్యార్థిపై దాడితో మొదలైన వివాదం
మంజీరా హాస్టల్ ప్రాంగణంలో పరస్పరం కొట్టుకున్న విద్యార్థులు
ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులు
JNTU ప్రధాన గేటు ఎదుట విద్యార్థుల నిరసన, ఉద్రిక్తత
-
Sep 04, 2026 06:10 IST
జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసులో నిందితుల కస్టడీకి అనుమతి
నేటి నుంచి పోలీసుల కస్టడీకి మీనా కుమారి, వినీల్ చౌదరి
నేటి నుంచి 2 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి
ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ అర్జున్ తల్లి మీనాకుమారి
బాధిత కుటుంబాలను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేసిన మీనాకుమారి
-
Sep 04, 2026 06:05 IST
నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
కొడంగల్‌లో సీఎం రేవంత్ రెండు రోజుల పర్యటన
మద్దూరు, దౌల్తాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
-
Sep 04, 2026 06:00 IST
GSLV-F17 రాకెట్ ప్రయోగం సక్సెస్
EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టిన GSLV-F17 రాకెట్
EOS-05ను సబ్-జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన ఇస్రో
శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం