Share News

ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Sep 04 , 2026 | 10:41 AM

ముంబై- శ్రీనగర్ ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. శ్రీనగర్ విమానాశ్రయంలో ల్యాండయిన ఈ విమానం స్తంభాన్ని ఢీ కొట్టింది.

ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
Indigo Flight In Srinagar Airport

శ్రీనగర్, సెప్టెంబర్ 04: ముంబై- శ్రీనగర్ ఇండిగో విమానానికి శుక్రవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. శ్రీనగర్‌ విమానాశ్రయంలో ల్యాండయిన ఇండిగో విమానం.. విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్స్ (వీడీజీఎస్) స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ విమానాన్ని పార్కింగ్ బేలో నిలుపుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఇండిగో సంస్థ వెల్లడించింది. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని తెలిపింది. వారిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొంది.


విమానంలోని మ్యానువల్ మెట్లను ఉపయోగించి వారందరినీ కిందికి దింపినట్లు వివరించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేసింది. నివేదిక వచ్చిన తర్వాత ఈ ఘటనకు కారణం తెలుస్తుందని ఇండిగో సంస్థ తెలిపింది. ఈ రోజు ఉదయం నవీ ముంబై నుంచి బయలుదేరిన ఈ విమానం 9.02 గంటలకు శ్రీనగర్‌ ఎయిర్ పోర్టులో ల్యాండయింది. అయితే ఈ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకల యథావిధిగా కొనసాగుతోన్నాయని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు

ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్

For More National News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 11:45 AM