మనిషికి పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు.. 271 రోజుల తర్వాత ఏమైందంటే..
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:18 PM
అమెరికాలో మెడికల్ మెరాకిల్ చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 271 రోజుల పాటు పంది కిడ్నీతో డయాలసిస్ అవసరం లేకుండా జీవించాడు. 271 రోజుల తర్వాత పంది కిడ్నీ ఫెయిల్ అయింది. డాక్టర్లు పంది కిడ్నీ తొలగించి మనిషి కిడ్నీని రోగికి అమర్చారు.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికాలో మెడికల్ మెరాకిల్ చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 271 రోజుల పాటు పంది కిడ్నీతో డయాలసిస్ అవసరం లేకుండా జీవించాడు. 271 రోజుల తర్వాత పంది కిడ్నీ ఫెయిల్ అయింది. డాక్టర్లు పంది కిడ్నీ తొలగించి మనిషి కిడ్నీని రోగికి అమర్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన టిమ్ ఆండ్ర్యూ అనే 66 ఏళ్ల వృద్ధుడికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. పాడైన రెండు కిడ్నీలను తొలగించి కొత్త కిడ్నీ అమర్చాలని డాక్టర్లు చెప్పారు. ఆండ్ర్యూ కుటుంబం కిడ్నీ కోసం ప్రయత్నించారు. డోనర్ దొరకలేదు.
ఈ నేపథ్యంలోనే డాక్టర్లు అతడికి జెనటికల్లీ ఎడిటెడ్ పంది కిడ్నీని అమర్చారు. 2025 జనవరి నెలలో సర్జరీ జరిగింది. ఆండ్ర్యూ పంది కిడ్నీతో 271 రోజుల పాటు డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా గడిపాడు. ఆ తర్వాత పంది కిడ్నీలో సమస్య మొదలైంది. దీంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి పంది కిడ్నీ తీసేశారు. కొన్ని రోజుల పాటు ఆండ్ర్యూ డయాలసిస్ మీద బతికాడు. 2026లో చనిపోయిన వ్యక్తి కిడ్నీని అతడికి అమర్చారు.
ఆండ్ర్యూ 271 రోజుల పాటు పంది కిడ్నీతో డయాలసిస్ అవసరం లేకుండా జీవించటం ఓ మెడికల్ మెరాకిల్ అని మస్సాచూస్సెట్స్ జనరల్ హాస్పిటల్ అండ్ కొలీగ్స్ శాస్త్రవేత్తలు అన్నారు. వైద్య చరిత్రలో ఇదే మొదటి కేసు అని వారు చెప్పారు. పంది కిడ్నీ పాడవటానికి కారణాలను వారు వెల్లడించారు. 271 రోజుల పాటు పని చేయటం వల్ల పంది కిడ్నీలో మైక్రోవ్యాస్యూలర్ గాయాలు, ఇన్‌ఫ్లమేషన్ వచ్చాయని తెలిపారు. ఆండ్య్రూకు ఇన్‌ఫెక్షన్ రావటం వల్ల ఆరు నెలల తర్వాత పంది కిడ్నీలో ఇమ్యూనోసప్రెషన్ దెబ్బతిందని తెలిపారు. ఆ కారణంగానే పంది కిడ్నీ పాడైందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
సచిన్ లాంటి గొప్ప కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలి: బీసీసీఐ