Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 21 , 2026 | 07:01 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 21, 2026 21:57 IST

    తిరుపతి: శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ హుండీలో చోరీ యత్నం

    • హుండీలో నగదు దొంగిలిస్తూ ఆలయ సిబ్బందికి దొరికిన దొంగ

    • నిందితుడి నుంచి రూ.10 వేలకు పైగా నగదు స్వాధీనం

  • Jun 21, 2026 21:50 IST

    వైసీపీ కాపు నేతల సమావేశం ఒక డ్రామా: మంత్రి దుర్గేష్‌

    • కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ కుట్ర: మంత్రి దుర్గేష్

    • వైసీపీ హయాంలో కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు: మంత్రి దుర్గేష్‌

    • పిఠాపురంలోనే పవన్ ఎందుకు పోటీ చేశారంటున్నారు: మంత్రి దుర్గేష్‌

    • పులివెందుల నుంచే జగన్‌ ఎందుకు పోటీ చేస్తున్నారు?: దుర్గేష్

    • వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల: మంత్రి దుర్గేష్‌

  • Jun 21, 2026 21:26 IST

    ఢిల్లీ చేరుకున్న మంత్రి నారా లోకేశ్

    • లోకేశ్‌కు స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు

    • రేపు రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌‌‌లో పాల్గొననున్న మంత్రి నారా లోకేశ్

  • Jun 21, 2026 21:13 IST

    వికారాబాద్: తాండూరు పట్టణం శివాజీ చౌక్‌లో ప్రమాదం

    • రెండు బైకులు ఢీకొని ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

    • మృతుడు తాండూరు మండలం కొత్తలాపూర్ గ్రామానికి చెందిన బసవరాజ్(54)గా గుర్తింపు

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 21, 2026 20:58 IST

    హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో TG 20 లీగ్‌ ప్రారంభం

    • టోర్నీని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    • టోర్నీలో 8 జట్లు, మొత్తం 32 మ్యాచ్‌లు

    • బరిలో హైదరాబాద్‌ సహా 8 జిల్లాల జట్లు

  • Jun 21, 2026 20:45 IST

    మహిళల ప్రపంచ కప్: ముగిసిన భారత్ ఇన్నింగ్స్

    • 20 ఓవర్లకు 158/7

    • సౌతాఫ్రికా టార్గెట్ 159

    • రాణించిన షఫాలీ వర్మ(31), దీప్తి శర్మ(29), హర్మన్ ప్రీత్(24)

    • 17 పరుగులకే ఔటైన స్మృతి మంధాన

    పూర్తి కథనం..

  • Jun 21, 2026 20:20 IST

    హైదరాబాద్‌: VB-G RAM G చట్టంపై కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ

    • హాజరైన మంత్రులు సీతక్క, తుమ్మల, వివేక్

    • గ్రామీణ పేదల పొట్టపై కేంద్రం దెబ్బకొట్టింది: ఉత్తమ్‌

    • నరేగా పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర: ఉత్తమ్‌

    • VB-G RAM G చట్టాన్ని ఉపసంహరించుకోవాలి: ఉత్తమ్‌

  • Jun 21, 2026 19:59 IST

    లెబనాన్‌లో ఘర్షణలు తగ్గించేందుకు ట్రంప్‌ ఎంతో కృషి చేశారు: జేడీ వాన్స్‌

    • సీజ్‌ ఫైర్‌లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది: జేడీ వాన్స్

    • పూర్తి కాల్పుల విరమణకు ట్రంప్‌ కట్టుబడి ఉన్నారు: జేడీ వాన్స్

  • Jun 21, 2026 19:59 IST

    రంగారెడ్డి: మీర్‌పేట్‌ పరిధి బడంగ్‌పేట్‌లో పేలుడు

    • డెకరేషన్‌ సామగ్రి నిల్వ గోదాంలో కెమికల్‌ బాక్స్‌ పేలి కార్మికుడి మృతి

    • మృతుడు కోల్‌కతాకు చెందిన అనూప్‌(43)గా గుర్తింపు

  • Jun 21, 2026 19:57 IST

    సింగరేణి బొగ్గు రవాణాపై యాజమాన్యం క్లారిటీ

    • సింగరేణిలో బొగ్గు చోరీ ఆరోపణలు అవాస్తవం: సింగరేణి యాజమాన్యం

    • బొగ్గు రవాణాపై డిజిటల్ పర్యవేక్షణ

    • 85% రైల్వే.. 15% రోడ్డుమార్గంలో సరఫరా

    • సింగరేణిలో 24 గంటలూ CCTV పర్యవేక్షణ

    • బొగ్గు మాయం, చోరీ ఆరోపణలు నిరాధారం: సింగరేణి యాజమాన్యం

  • Jun 21, 2026 19:53 IST

    IND vs SA: 10 ఓవర్లు పూర్తి.. భారత్ స్కోర్ 82/3

    • ప్రస్తుతం క్రీజులో జెమిమా(12*), హర్మన్ ప్రీత్(7*)

  • Jun 21, 2026 19:53 IST

    అయోధ్య వివాదంపై సిట్ దర్యాప్తు

    • ప్రాథమిక నివేదికను సీఎం యోగికి సమర్పించిన సిట్

    • అవకతవకలకు పాల్పడ్డ పలువురి పేర్లను నివేదికలో ప్రస్తావన

    • 150 మందిని సిట్ విచారించినట్టు జాతీయ మీడియా కథనం

  • Jun 21, 2026 19:52 IST

    విజయవాడ: సాయి కృష్ణా కేసులో సిట్ ఎంట్రీ

    • కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి చేరుకున్న సిట్ సభ్యులు సుధాకర్

    • సమాచారం సేకరిస్తున్న సిట్ అధికారులు

    • మూడు రోజులుగా జరుగుతున్న కేసు విచారణ అంశాలను సిట్‌కు వివరించనున్న ఏసీపీ దైవ ప్రసాద్ బృందం

  • Jun 21, 2026 19:44 IST

    ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి హెచ్చరిక

    • చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తాం: ట్రంప్‌

    • లెబనాన్‌పై ఇరాన్‌ దాడులు ఆపాలి: ట్రంప్‌

    • ఈసారి దాడులు తీవ్రంగా ఉంటాయి: ట్రంప్

    • హోర్ముజ్‌ను మూసివేస్తే.. ఇరాన్‌‌ను లేకుండా చేస్తాం: ట్రంప్

  • Jun 21, 2026 18:54 IST

    ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

    • రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే ఉండనున్న సీఎం రేవంత్ రెడ్డి

    • కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసే అవకాశం

    • హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన సమస్యలు, IRFC ఫైనాన్సింగ్‌పై చర్చించే అవకాశం

  • Jun 21, 2026 18:47 IST

    రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం

    • ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకూ విస్తరించిన ద్రోణి

    • రేపు ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు

  • Jun 21, 2026 18:47 IST

    రేపు హైదరాబాద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

    • బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి రజతోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

  • Jun 21, 2026 18:37 IST

    మహిళ టీ20 ప్రపంచ కప్: టాస్ నెగ్గిన భారత్

    • టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

    • మరికాసేపట్లో భారత్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్

  • Jun 21, 2026 18:13 IST

    ఈ డీల్ మాకు అనుకూలం: ఇరాన్ అధ్యక్షుడు

    • ఇరాన్ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో అధ్యక్షుడు పెజెష్కియాన్ వ్యాఖ్య

    • తమకు దక్కిన విజయాలు త్వరలో వెల్లడవుతాయని వ్యాఖ్య

    • విదేశాల్లోని తమ నిధులు కూడా దక్కుతాయని వెల్లడి

    పూర్తి కథనం..

  • Jun 21, 2026 18:08 IST

    హైదరాబాద్‌: ముగిసిన ట్రాఫిక్ ప్రత్యేక లోక్ అదాలత్ డ్రైవ్

    • ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

    • రికార్డు స్థాయిలో మొత్తం 7,161 పెండింగ్ కేసుల పరిష్కారం

    • అత్యధికంగా 3,804 డ్రంకెన్ డ్రైవ్‌ కేసులు క్లియర్

  • Jun 21, 2026 18:08 IST

    ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

    • అఫ్గానిస్థాన్‌పై 66 పరుగుల తేడాతో గెలిచిన భారత్

    • స్కోర్లు: భారత్ 377/9 ; అఫ్గాన్ 311/10 (47.1 ఓవర్లు)

  • Jun 21, 2026 17:43 IST

    రాజమండ్రి: BLOలు, సూపర్‌వైజర్లకు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు

    • SIR పనుల్లో నిర్లక్ష్యం వహించారంటూ 12 మంది BLOలు, 8 మంది సూపర్‌వైజర్లకు కలెక్టర్‌ నోటీసులు

  • Jun 21, 2026 17:42 IST

    దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్‌ రీ-ఎగ్జామ్‌

    • 551 నగరాల్లో 5,440 కేంద్రాల్లో జరిగిన నీట్‌ పరీక్ష

    • పరీక్ష రాసిన 22 లక్షల మందికిపైగా విద్యార్థులు

  • Jun 21, 2026 17:05 IST

    తమిళనాడు: గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీఎం విజయ్‌ దిగ్భ్రాంతి

    • ఘటనాస్థలికి వెళ్లాలని మంత్రులకు సీఎం విజయ్‌ ఆదేశం

    • సహాయకచర్యలు వేగవంతం చేయాలన్న సీఎం విజయ్

    • ప్రమాదంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన సీఎం విజయ్

    • ఘటనపై 3 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశం

  • Jun 21, 2026 17:00 IST

    హైదరాబాద్: KBR పార్క్‌ చుట్టూ ముగిసిన వన్‌ వే ట్రయల్ రన్

    • 5 గంటల పాటు కొనసాగిన వన్‌ వే ట్రయల్ రన్

    • సీసీ కెమెరాలు, డ్రోన్లతో ట్రయిల్ రన్‌ పర్యవేక్షించిన అధికారులు

    • పూర్తి అధ్యయనం తర్వాత KBR పార్క్‌ చుట్టూ వన్ వే అవకాశం

  • Jun 21, 2026 16:47 IST

    విశాఖ: రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం

    • భర్త శ్రీచరణ్‌పై హత్య కేసు నమోదు

    • ముస్సోరిలో 103(1) సెక్షన్‌ కింద కేసు నమోదు

    • గాయత్రి తండ్రి సుధాకర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు

    • ఫిర్యాదులో 11 అంశాలను పేర్కొన్న తండ్రి సుధాకర్‌

    • డెహ్రాడూన్‌లోనూ పోలీస్‌ అధికారులను కలిసిన సుధాకర్

  • Jun 21, 2026 16:36 IST

    తమిళనాడు: తిరువళ్లూరులో అమ్మోనియం గ్యాస్ లీక్

    • రొయ్యల పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌, ఇద్దరి మృతి

    • 40 మందికి పైగా అస్వస్థత, పలువురి పరిస్థితి విషమం

    పూర్తి కథనం..

  • Jun 21, 2026 16:22 IST

    తేనెటీగల దాడిలో విద్యార్థికి తీవ్రగాయాలు

    • నంద్యాల: హనీఫ్ నగర్‌లో వాటర్ ట్యాంక్ ఎక్కిన విద్యార్థి షేక్ మాజు

    • విద్యార్థిని చుట్టుముట్టిన తేనెటీగలు.. భయంతో కేకలు వేసిన బాలుడు

    • తేనెటీగల దాడిలో తీవ్ర గాయాలపాలై, స్పృహ కోల్పోయిన విద్యార్థి

    • విద్యార్థిని సురక్షితంగా కిందకు దించిన అగ్నిమాపక సిబ్బంది

    • మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని ఆసుపత్రికి తరలింపు

  • Jun 21, 2026 15:55 IST

    సిద్దిపేట: కుకునూరుపల్లి మండలం లకుడారం దగ్గర ప్రమాదం

    • ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌, దంపతులు మహేందర్‌(28), దీక్ష(25) మృతి

    • హైదరాబాద్‌ నుంచి ధర్మపురి వెళ్తుండగా ఘటన

  • Jun 21, 2026 15:54 IST

    ఉప్పల్‌ స్టేడియంలో TG 20 లీగ్‌ ప్రారంభోత్సవం

    • టోర్నీని ప్రారంభించనున్న VVS లక్ష్మణ్‌, విజయ్‌ దేవరకొండ

    • ఉప్పల్‌ స్టేడియంలో 22 రోజుల పాటు TG 20 లీగ్‌, పోటీలో 8 జట్లు

    • 7.15 గంటలకు పాలమూరు-ఖమ్మం జట్ల మధ్య తొలి మ్యాచ్

  • Jun 21, 2026 15:34 IST

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డుప్రమాదం

    • అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు, ముగ్గురి మృతి

    • ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర ఘటన

  • Jun 21, 2026 15:34 IST

    యూఎస్ పోలీసు అధికారి కాల్పుల్లో పెంపుడు కుక్క మరణం

    • లాస్‌ ఏంజెలెస్‌లో జూన్ 13న వెలుగు చూసిన ఘటన

    • ఒక మహిళ పెంపుడు కుక్క తన వైపు దూసుకు రావడంతో కాల్పులు

    • ఘటన తాలూకు బాడీ క్యామ్ ఫుటేజీని తాజాగా రిలీజ్ చేసిన పోలీసులు

    • విమర్శలు వెల్లువెత్తడంతో తగు చర్యలు తీసుకుంటామని హామీ

  • Jun 21, 2026 15:23 IST

    కేటీఆర్‌ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: అద్దంకి దయాకర్

    • దోచుకుని, దాచుకున్న డబ్బుతో రోజుకో మీటింగ్ పెడుతున్నారు: అద్దంకి దయాకర్

    • అధికారం పోయాక పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు: అద్దంకి

    • SBI అధికారులను ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా లొంగదీసుకున్నారా? : అద్దంకి

    • ప్రభుత్వానికి చెందిన HCU భూములపైనా తప్పుడు ప్రచారం: అద్దంకి

    • తెలంగాణ అభివృద్ధిని చూసి BRSకు భయం పట్టుకుంది: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

  • Jun 21, 2026 15:22 IST

    నాపై ఎలాంటి లీగల్‌ కేసులూ లేవు: మీనాక్షి నటరాజన్‌

    • నామినేషన్‌ పత్రంలో లీగల్‌ నోటీస్‌ కాలమ్‌ లేదు: మీనాక్షి

    • నా రాజ్యసభ సీటు చోరీ చేశారు: మీనాక్షి నటరాజన్‌

    • BJP కుట్రలు ప్రజలకు తెలియాలనే పోరాటం: మీనాక్షి

    • నామినేషన్‌ తిరస్కరణలో కాంగ్రెస్‌ నేతల పాత్ర లేదు: మీనాక్షి

  • Jun 21, 2026 15:21 IST

    ప.గో.: ఐదేళ్ల జగన్ పాలన అంతా అరాచకమే: మంత్రి నిమ్మల

    • విధ్వంసం, కుట్రలు, కుతంత్రాలు, కక్షలతోనే జగన్‌ పాలన సాగింది

    • ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ పట్టించుకోలేదు: మంత్రి నిమ్మల

    • గొడ్డలి పార్టీకి మా ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదు: మంత్రి నిమ్మల

  • Jun 21, 2026 14:54 IST

    TBJP చీఫ్‌ రాంచందర్‌రావుకు TPCC చీఫ్‌ మహేష్‌గౌడ్‌ కౌంటర్‌

    • తెలంగాణలో రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పాలనకు, కేంద్రంలో 12 ఏళ్ల BJP పాలనపై చర్చకు సిద్ధమా?: మహేష్‌గౌడ్‌

    • నల్లధనం సంగతి ఏమైంది?: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌

    • ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలపై రాంచందర్‌రావు మాట్లాడాలి: మహేష్‌గౌడ్‌

    • BJP ఇచ్చిన హామీలపై ముందు మాట్లాడితే మంచిది: మహేష్‌గౌడ్‌

  • Jun 21, 2026 14:41 IST

    ఈ నెల 25 నుంచి ఆదివాసీ కాంగ్రెస్‌ బస్సుయాత్ర

    • బస్సు యాత్ర పోస్టర్‌‌ను ఆవిష్కరించిన మహేష్‌గౌడ్

    • ఇందిరాగాంధీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేసి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బస్సుయాత్ర

  • Jun 21, 2026 14:25 IST

    తెలంగాణలో సైబర్ నేరాల బాధితులకు భారీగా రీఫండ్‌

    • 2026 జూన్ 20 వరకు రూ.45.21 కోట్ల రీఫండ్‌: TG CSB

    • ఫిర్యాదుల ఆధారంగా 6,303 బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్: TG CSB

  • Jun 21, 2026 14:24 IST

    బెంగాల్‌: జల్పాయ్‌గురి దగ్గర రోడ్డుప్రమాదం

    • ఆగివున్న లారీని ఢీకొన్న బస్సు, ఐదుగురి మృతి

    • 17 మందికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం

    పూర్తి కథనం..

  • Jun 21, 2026 13:47 IST

    విశాఖ: మధురవాడ సాయిరాం కాలనీలో విషాదం

    • కరెంట్ తీగలు తగిలి ఆరేళ్ల బాలుడు అఖిల్ మృతి

    • ఇంటి ముందు క్రికెట్ ఆడుతున్న సమయంలో ప్రమాదం

  • Jun 21, 2026 13:39 IST

    అల్లూరి జిల్లా: భారీగా గంజాయి పట్టివేత

    • రూ.5.6 కోట్ల విలువైన 1125 కిలోల గంజాయి స్వాధీనం

    • ముంచంగిపట్టు మండలం బూసిపుట్టు వద్ద గంజాయి పట్టివేత

    • ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు

  • Jun 21, 2026 13:18 IST

    సీఎం రేవంత్‌రెడ్డికి టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు లేఖ

    • నెరవేరని కాంగ్రెస్ గ్యారెంటీలపై వినతిపత్రం ఇచ్చేందుకు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరుతూ లేఖ

    • రాహుల్ అపాయింట్‌మెంట్ కల్పించడంలో టీకాంగ్రెస్ విఫలమైతే అది తెలంగాణ ప్రజలకు మీరు చేసిన ద్రోహమని స్పష్టమవుతుంది: రాంచందర్‌రావు

    • హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది: రాంచందర్‌రావు

    • ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది: రాంచందర్‌రావు

  • Jun 21, 2026 12:58 IST

    కామారెడ్డి: అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

    • రూ.1.93కోట్ల విలువైన 387 కిలోల గంజాయి సీజ్

    • ముగ్గురి అరెస్ట్, వాహనం, 2 ఫోన్లు స్వాధీనం

    • నిందితులు కరీముల్లా, సుభాష్‌, రహీం నిజామాబాద్ వాసులు

    • ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న నిందితులు

  • Jun 21, 2026 12:29 IST

    విజయవాడ: సీఐ నాగరాజు నివాసానికి భారీగా వచ్చిన మద్దతుదారులు

    • సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవద్దని నిరసన

    • నాగరాజు వల్లే అసాంఘిక కార్యకలాపాలకు బ్రేక్ పడిందంటున్న మద్దతుదారులు

  • Jun 21, 2026 11:37 IST

    హైదరాబాద్: తన నామినేషన్ తిరస్కరణపై స్పందించిన మీనాక్షి

    • నామినేషన్ తిరస్కరణ అంశంపై మాట్లాడాలని నాక్కూడా ఉంది: మీనాక్షి

    • ఎన్నికల కమిషన్ చేసిన దుర్మార్గాన్ని తప్పకుండా మాట్లాడుతాను: మీనాక్షి

    • సమయం తీసుకుని తప్పకుండా మాట్లాడుతాను: మీనాక్షి

    • మీ అందర్నీ పిలిచి నా మనసులో ఉన్న మాటలను తప్పకుండా మాట్లాడుతాను: మీనాక్షి

    • నేనిప్పుడు SIR సమావేశం కోసం వచ్చాను: మీనాక్షి

  • Jun 21, 2026 11:25 IST

    భారత నౌకాదళంలోకి మూడు యుద్ధ నౌకలు

    • ఒకేసారి మూడు స్వదేశీ యుద్ధనౌకల కమిషనింగ్

    • ప్రధాని మోదీ చేతుల మీదుగా కమిషనింగ్

    • అత్యాధునిక యుద్ధనౌకలు INS దూనగిరి, INS సంశోధక్, INS అగ్రయ్‌ను దేశానికి అంకితం చేసిన ప్రధాని మోదీ

  • Jun 21, 2026 11:22 IST

    ఖమ్మం: గాంధీనగర్‌లో విషాదం

    • ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

    • చిన్నారులు వేదిక్‌కుమార్(07), తనిష్క్(05) మృతి

    • తల్లి స్వాతి పరిస్థితి విషమం, ఆస్పత్రిలో చికిత్స

  • Jun 21, 2026 11:21 IST

    విజయవాడ: సాయికృష్ణ కేసులో అజ్ఞాతంలోకి ఆరుగురు కానిస్టేబుళ్లు

    • నిన్న మధ్యాహ్నం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం

  • Jun 21, 2026 11:10 IST

    వరంగల్: కేసీఆర్ వరంగల్‌కు చేసిందేమీ లేదు: ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

    • కల్వకుంట్ల కుటుంబం రాజకీయాన్నే వ్యాపారంగా మార్చుకుంది

    • బీఆర్ఎస్ నేతలు హైనాలకంటే డేంజర్: ఎమ్మెల్యే నాయిని

    • వరంగల్‌కు ఇచ్చిన హామీలపై కేటీఆర్‌ను ప్రజలు నిలదీయాలి: ఎమ్మెల్యే నాయిని

    • వరంగల్‌కు హైడ్రా లాంటి సంస్థను తీసుకొస్తాం: ఎమ్మెల్యే నాయిని

  • Jun 21, 2026 11:09 IST

    ఏపీ తీరం వెంబడి తమిళనాడు, పుదుచ్చేరి మరబోట్లు హల్‌చల్

    • టాస్క్‌ఫోర్స్ గస్తీ బోట్లను సైతం లెక్కచేయని వైనం

    • మత్స్యసంపద దోచుకెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు

    • కోట మండల తీరం వెంబడి లంగరు వేసిన‌ 30 మరబోట్లు

    • మరబోట్ల సమీపానికి వెళ్లేందుకు భయపడుతున్న మత్స్యకారులు

  • Jun 21, 2026 10:53 IST

    ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: ట్రంప్

    • ప్రస్తుతం హోర్ముజ్‌లో 60 రోజుల పాటు స్వేచ్ఛా నౌకాయానం అమల్లో ఉంది: ట్రంప్

    • ప్రస్తుతం ఇరాన్ సుంకాలు వసూలు చేయడం లేదు: ట్రంప్

  • Jun 21, 2026 10:47 IST

    శ్రీలంకతో ఫైనల్: వైభవ్ సూర్యవంశీ ఔట్

    • 29 బంతుల్లోనే 94 పరుగులు చేసిన సూర్యవంశీ

    • 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో చెలరేగిన వైభవ్

  • Jun 21, 2026 10:33 IST

    శ్రీలంకతో ఫైనల్: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

    • 11 బంతుల్లోనే వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ

    • 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో చెలరేగిన వైభవ్

  • Jun 21, 2026 10:14 IST

    హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ సిగరెట్లు పట్టివేత

    • రూ.4లక్షల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం

    • దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి అరెస్ట్

  • Jun 21, 2026 10:13 IST

    విశాఖ వెళ్లాల్సిన 3 విమానాలు శంషాబాద్‌కు మళ్లింపు

    • విశాఖ ఎయిర్‌పోర్టులో అనుకూలించని వాతావరణం

    • 3 ఇండిగో విమానాలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మళ్లింపు

  • Jun 21, 2026 09:58 IST

    విశాఖలో భారీ వర్షాలు.. తప్పిన ప్రమాదం

    • సీతమ్మధారలో అర్ధరాత్రి కూలిన ఇంటి గోడ

    • శ్రీకృష్ణ మందిర్ సమీపంలోని చోటు చేసుకున్న ఘటన

    • గోడ కూలడంతో రెండు కార్లు ధ్వంసం

  • Jun 21, 2026 09:55 IST

    తూర్పుగోదావరి: దేవరపల్లి నేషనల్ హైవే‌పై లారీ దగ్ధం

    • షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా లారీలో చెలరేగిన మంటలు

    • కడియం నుండి రాజస్థాన్‌కు మొక్కల లోడుతో వెళుతుండగా ప్రమాదం

    • అప్రమత్తమై లారీ నుంచి దూకిన లారీ డ్రైవర్, క్లీనర్

    • మంటలను అదుపులోకి తీసుకొచ్చిన కొవ్వూరు ఫైర్ సిబ్బంది

  • Jun 21, 2026 09:45 IST

    ముక్కోణపు సిరీస్: టాస్ నెగ్గిన శ్రీలంక-ఎ

    • దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ మధ్య ఫైనల్ పోరు

    • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక-ఎ

    • తొలుత బ్యాటింగ్‌కు దిగనున్న భారత్-ఎ జట్టు

  • Jun 21, 2026 09:39 IST

    అమరావతి: సాయి కృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    • కేసు దర్యాప్తునకు ప్రత్యేక సిట్ ఏర్పాటు

    • ఐజీ రవి ప్రకాష్‌ను సిట్ చీఫ్‌గా నియమించిన ప్రభుత్వం

    • నలుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు

  • Jun 21, 2026 09:35 IST

    రంగారెడ్డి: హయత్‌నగర్‌లోని పుల్లారెడ్డి స్వీట్స్ సమీపంలో స్కూటీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

    • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష(20) మృతి

    • బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న యువతి

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jun 21, 2026 09:33 IST

    పశ్చిమగోదావరి: నరసాపురంలో దారుణం

    • టీనా రోజా (31)ను కత్తితో పొడిచి చంపిన రమేష్

    • రోజా నరసాపురం రైల్వే స్టేషన్ నుంచి సఖినేటిపల్లికి కారులో వెళ్తుండగా ఘటన

    • అడ్డుకోబోయిన కార్ డ్రైవర్ సురేష్‌కు గాయాలు

    • మృతురాలు, నిందితుడు ఇద్దరూ సఖినేటిపల్లివారే

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jun 21, 2026 09:26 IST

    హైదరాబాద్‌: నేడు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్

    • ఉదయం 10 గంటలకు ట్రయల్ రన్ ప్రారంభం

    • ట్రాఫిక్ నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించనున్న హైదరాబాద్ సీపీ

    • ప్రజల అభిప్రాయాలు సేకరించనున్న అధికారులు

    • ట్రయల్ ఫలితాల ఆధారంగా తదుపరి నిర్ణయాలు

    • వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

  • Jun 21, 2026 09:24 IST

    సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో యోగా డే వేడుకలు

    • జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ హైమావతి

    • యోగను జీవితంలో భాగంగా చేసుకోవాలి: రఘునందన్

    • పని ఒత్తిడి ఎంత ఉన్నా ప్రతిరోజూ యోగ చేయాలి: రఘునందన్

    • ప్రధాని మోదీ ఆరోగ్య రహస్యం యోగానే: రఘునందన్

  • Jun 21, 2026 09:22 IST

    స్పేస్‌లో ఫుట్‌బాల్ ఆడిన వ్యోమగాములు

    • స్పేస్‌ను తాకిన ఫిఫా ప్రపంచ కప్ ఫీవర్

    • ఫిఫా అధికారిక మ్యాచ్ బంతి ‘ట్రియొండా’పై ప్రయోగాలు చేస్తోన్న వ్యోమగాములు

    • వీడియో విడుదల చేసిన నాసా

    పూర్తికథనం

  • Jun 21, 2026 09:19 IST

    కరీంనగర్: అలుగునూర్ శివారులో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం

    • ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన బస్సు

    • అప్రమత్తమై బస్సు దిగిన ప్రయాణికులు, తప్పిన ప్రాణనష్టం

    • మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

    • ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్న అధికారులు

  • Jun 21, 2026 09:16 IST

    భద్రాద్రి: చుంచుపల్లి మండలం అంబేద్కర్ నగర్‌లో యువకుడు నాగరాజు దారుణహత్య

    • ఇంట్లో నిద్రిస్తున్న నాగరాజును కత్తితో పొడిచి హత్యచేసిన ప్రత్యర్థి

    • పరారీలో నిందితుడు, కేసు నమోదు చేసిన పోలీసులు

    • హత్యకు పాతకక్షలే కారణమని అనుమానం

  • Jun 21, 2026 09:14 IST

    కరీంనగర్‌లో అంతర్జాతీయ యోగా డే వేడుకలు

    • పాల్గొన్న కేంద్రమంత్రి బండి సంజయ్

    • ప్రపంచమంతా భారత్‌ను యోగా భూమిగా గుర్తించింది

    • యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు శరీరం, ఆత్మను ఏకం చేసేది: బండి సంజయ్

  • Jun 21, 2026 09:14 IST

    యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ

    • యోగా అందరినీ ఒకే వేదికపైకి తెస్తుంది: మోదీ

    • కోల్‌కతాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

    • 35 వేల మందితో కోల్‌కతాలో రికార్డు స్థాయిలో యోగా డే

  • Jun 21, 2026 07:53 IST

    వైభవ్ ప్రవర్తనపై విమర్శలు.. తిలక్ వర్మ రియాక్షన్ ఇదే

    • ముక్కోణపు సిరీస్: నేడు భారత్-ఎ, శ్రీలంక-ఎ మధ్య ఫైనల్ పోరు

    • గత మ్యాచ్‌లో లంక ప్లేయర్లతో వాగ్వాదానికి దిగిన వైభవ్ సూర్యవంశీ

    • అతడి ప్రవర్తనపై వస్తోన్న విమర్శలపై స్పందించిన భారత్-ఎ కెప్టెన్ తిలక్ వర్మ

  • Jun 21, 2026 07:26 IST

    కర్నూలు: మంత్రాలయం ఓల్డ్ టౌన్‌లో వైసీపీ నాయకుడు ప్రాణేష్ వీరంగం

    • తన ఇంటి ముందు నుంచి బైక్ పై వెళ్తావా అంటూ ఈరన్న అనే యువకుడితో వాగ్వాదానికి దిగిన ప్రాణేష్

    • మద్యం మత్తులో ఈరన్నపై కత్తితో దాడి చేసిన ప్రాణేష్

    • ఈరన్న పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు

    • వైసీపీ నాయకుడు ప్రాణేష్ పై హత్యాయత్నం కేసు నమోదు

  • Jun 21, 2026 07:22 IST

    తూర్పు విదర్భ, ఛత్తీస్‌గఢ్‌పై విస్తరించిన ద్రోణి

    • నేడు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు

    • బాపట్ల, నెల్లూరు, రాయలసీమలో పిడుగుపాట్లు

    • తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ

    • హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన

    • ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం

  • Jun 21, 2026 07:10 IST

    హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు

    • ఇందిరాపార్క్‌ యోగా వేడుకల్లో పాల్గొన్న టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు, ఎంపీ లక్ష్మణ్‌

  • Jun 21, 2026 07:10 IST

    నేడు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • మెట్రో ప్రాజెక్టు నిధులపై కేంద్రమంత్రులతో భేటీ

    • రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రుణంపై ఒత్తిడికి యోచన

  • Jun 21, 2026 07:09 IST

    నీట్ ఎగ్జామ్‌కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

    • ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు

    • ప్రతి జవాబు పత్రాల రవాణాకు ప్రత్యేక పోలీస్ భద్రత

    • పరీక్షా కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్‌

  • Jun 21, 2026 07:09 IST

    తెలంగాణలో 208 నీట్‌ ఎగ్జామ్ కేంద్రాల ఏర్పాటు

    • తెలంగాణలో నీట్ రాయనున్న 2.95 లక్షల మంది

    • పరీక్ష రాసే అభ్యర్థులకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం

    • అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

    • ఏపీలో నీట్‌ పరీక్షకు 185 కేంద్రాల ఏర్పాటు

    • ఏపీలో నీట్ ఎగ్జామ్‌ రాయనున్న 65,790 మంది అభ్యర్థులు

  • Jun 21, 2026 07:08 IST

    నేడు నీట్‌ రీఎగ్జామ్‌

    • పరీక్ష రాయనున్న 22.79 లక్షల అభ్యర్థులు

    • దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

    • సీసీ కెమెరాలతో లైవ్ మానిటరింగ్‌

    • అక్రమాల నియంత్రణకు Ai ఆధారిత సీసీటీవీ

    • 51వేల జామర్లతో ఎలక్ట్రానిక్‌ పరికరాల నియంత్రణ

  • Jun 21, 2026 07:07 IST

    పశ్చిమ బెంగాల్: కోల్‌కతాలో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం..

    • పాల్గొన్న ప్రధాని మోదీ, సీఎం సువేందు అధికారి

  • Jun 21, 2026 07:05 IST

    అమరావతి: సీఎం చంద్రబాబుతో ప్రాణాయామం చేయించిన రామ్‌దేవ్‌

    • వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో IGM స్టేడియంలో సీఎం చంద్రబాబు యోగా సాధన

    • చంద్రబాబుతో కలిసి యోగాలో పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

  • Jun 21, 2026 07:01 IST

    అమరావతి: నేడు ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం

    • విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యోగా వేడుకలు

    • యోగా గురు బాబా రాందేవ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం

    • ఏపీలో సామూహిక యోగాలో పాల్గొన్న 6,300 మంది ట్రైనర్లు

    • ఏపీలో 1.33 లక్షల సెంటర్లలో యోగా వేడుకలు