Share News

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..

ABN , Publish Date - Jun 21 , 2026 | 03:00 PM

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..
Jalpaiguri accident

కోల్‌కతా, జూన్ 21: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన బస్సు మైనాగురి నుంచి డోమోహనికి బయలు దేరింది. ఉల్లదబారి ఏరియాలో బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్‌ను ఢీకొట్టింది.


దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని జల్పాయ్‌గురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. ఐదు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 17 మందిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న దాని ప్రకారం.. గత కొద్దిరోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఆ రోడ్డు మొత్తం బురదతో నిండిపోయింది. బురద కారణంగా వాహనాలు జారుతున్నాయి. బురద కారణంగా బస్సు అదుపుతప్పింది. బస్సు డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును ఢీకొట్టాడు.


ఇవి కూడా చదవండి

సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. మార్కాపురం ఎపిసోడ్‌పై విచారణ వేగవంతం!

ఇంగ్లండ్‌ పర్యటన.. భారత వన్డే జట్టు ఇదే

Updated Date - Jun 21 , 2026 | 03:05 PM