సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. మార్కాపురం ఎపిసోడ్‌పై విచారణ వేగవంతం!
ABN , Publish Date - Jun 21 , 2026 | 02:56 PM
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసుల పాత్రపై విచారణాధికారి ఏసీపీ దైవ ప్రసాద్ బృందం దృష్టి సారించింది.
అమరావతి, జూన్ 21: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసుల పాత్రపై విచారణాధికారి ఏసీపీ దైవ ప్రసాద్ బృందం దృష్టి సారించింది. ఈ మొత్తం వ్యవహారంలో మార్కాపురం నుంచి విజయవాడ వరకు జరిగిన ఎపిసోడ్ అత్యంత కీలకంగా మారింది.
నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేసే క్రమంలో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ నవీన్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు మార్కాపురం వెళ్లినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. అక్కడ సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న ఈ ముగ్గురు సిబ్బంది, ఒక ప్రైవేట్ వాహనంలో విజయవాడకు తరలించినట్లు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారి, ఎస్ఐ నవీన్, ఇద్దరు కానిస్టేబుళ్లను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు.. వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు.
అసలు ఎవరి రాతపూర్వక లేదా మౌఖిక ఆదేశాల మేరకు వీరు ప్రైవేట్ వాహనంలో మార్కాపురం వెళ్లారు?. అక్కడ సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నాక ఎవరికి అప్పగించారు? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే దిశగా ఆ రాత్రి స్టేషన్ రికార్డులను, సీసీటీవీ దృశ్యాలను అధికారులు ల్యాబ్‌కు పంపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సాయికృష్ణ అదృశ్యంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
పెద్దల పాదాలకు నమస్కరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..