సాయికృష్ణ అదృశ్యంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - Jun 21 , 2026 | 09:57 AM
గాదె సాయికృష్ణ అదృశ్యం నేపథ్యంలో కృష్ణలంక సీఐ నాగరాజును ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
విజయవాడ, జూన్ 21: గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సెట్)ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాశ్‌ను నియమించింది. ఇందులో ముగ్గురు సభ్యులుగా ఐపీఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందంలో సభ్యులుగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్ ఉంటారు.
మరో వైపు ఈ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. సింగ్ నగర్‌లోని ఓ ఇంటిలో ఆయన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయికృష్ణ అదృశ్యంపై పోలీసుల దర్యాప్తును వేగవంతం చేశారు. గత మూడు రోజులుగా అనుమానాస్పదంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను కూడా పోలీస్ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాయికృష్ణ తల్లి ఆరోపణల నేపథ్యంలో ఆయా అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యోగా జీవితంలో భాగస్వామిగా చేయాలి.. ప్రజలకు ఎంపీ పిలుపు
పెద్దల పాదాలకు నమస్కరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
For More AP News And Telugu News