పెద్దల పాదాలకు నమస్కరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ABN , Publish Date - Jun 21 , 2026 | 07:09 AM
భారతీయ సంస్కృతిలో.. పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందడం తరతరాలుగా వస్తున్న అత్యంత పురాతనమైన సంప్రదాయం. దీనిని గౌరవ సూచకంగా భావిస్తారు.
పెద్దల పాదాలకు నమస్కరించడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని.. దాని వెనుక విభిన్నమైన శాస్త్రీయ కారణం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
భారతీయ సంస్కృతిలో.. పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందడం తరతరాలుగా వస్తున్న అత్యంత పురాతనమైన సంప్రదాయం. దీనిని గౌరవ సూచకంగా భావిస్తారు. ఇలా పాదాలకు నమస్కరించం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని శాస్త్రీయ అంశాలు ఉన్నాయని వారు అంటున్నారు.
అలా చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితం..
మన శరీరంలో అనేక నాడులు, కణాలు ఉంటాయి. పాదాలు, వేళ్లలో చాలా నాడీ అంత్యాలు (Nerve Endings) ఉంటాయి. పెద్దవారి పాదాలను తాకి నమస్కరించినప్పుడు ఈ నాడులు ఉత్తేజితం అవుతాయని చెబుతున్నారు. దీనివల్ల శరీరానికి శాంతిని ఇచ్చే నాడీ వ్యవస్థలు క్రియాశీలకం అవుతాయని అంటున్నారు.
రక్త ప్రసరణను..
పాదాలకు నమస్కరించేటప్పుడు.. మన శరీరాన్ని ముందుకు వంచుతాం. ఈ భంగిమ వినయాన్ని పెంచడమే కాకుండా.. శరీరంలోని రక్త ప్రసరణపై కూడా ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంటున్నారు. ఇది వాగస్ నాడిని (Vagus nerve) క్రియశీలకంగా చేయడంలో దోహదపడతాయి. ఇలా చేయడం వల్ల విశ్రాంతి, ప్రశాంతత లభిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అలాగే పెద్దలకు గౌరవంగా నమస్కరించడం వినయం, కృతజ్ఞత వంటి సానుకూల బావాలను పెంచుతుంది. ఇది కోపం, అహంకారం, ఆందోళన వంటి ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. ఈ ప్రక్రియ మానసిక ప్రశాంతతను పెంపొందించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
పాదాల స్పర్శతో ఆత్మీయ భావన..
పాదాలకు నమస్కరించినప్పుడు.. పెద్దలు మన తలపై చేతులు ఉంచి ఆశీర్వదిస్తారు. దీని వల్ల కలిగే స్పర్శ మన మనస్సుకు సాన్నిహిత్య భావనను కలిగిస్తుంది. ఇలాంటి సానుకూల స్పర్శ వల్ల ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్ వంటి రసాయనాలు విడుదల అవుతాయి. వీటి వల్ల బంధాలు దృఢంగా మారతాయని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.
స్పృహతో కూడిన సానుకూల స్పర్శ, ప్రేమ పూర్వక సంభాషణలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది శరీరంలోని ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ (Cortisol) స్థాయిని తగ్గిస్తుందని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనితో ఆంధ్రజ్యోతిని ఎలాంటి సంబంధం లేదు. దీనికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏ విధంగానూ బాధ్యత వహించదు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేటి రాశి ఫలాలు.. ఎలా ఉన్నాయంటే..
For More Devotional News And Telugu News