Share News

యోగా జీవితంలో భాగస్వామిగా చేయాలి.. ప్రజలకు ఎంపీ పిలుపు

ABN , Publish Date - Jun 21 , 2026 | 09:39 AM

యోగా మన జీవితంలో ఒక భాగస్వామిగా చేయాలని ప్రజలకు మెదక్ లోక్‌సభ సభ్యుడు, ఎంపీ ఎం.రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని క్రికెట్ స్టేడియంలో జ్యోతి ప్రజ్వలనం చేసి యోగను ఆయన ప్రారంభించారు.

యోగా జీవితంలో భాగస్వామిగా చేయాలి.. ప్రజలకు ఎంపీ పిలుపు
BJP MP Raghunandan Rao

సిద్దిపేట, జూన్ 21: యోగా మన జీవితంలో ఒక భాగస్వామిగా చేయాలని ప్రజలకు మెదక్ లోక్‌సభ సభ్యుడు, ఎంపీ ఎం.రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని క్రికెట్ స్టేడియంలో జ్యోతి ప్రజ్వలనం చేసి యోగాను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హైమావతితోపాటు పట్టణ ప్రజలు, వాకర్స్ పాల్గొన్నారు.


MP-Raghu.jpg

ఈ సందర్బంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రజలందరికీ 12వ అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు తెలిపారు. పని ఒత్తిడి ఎంత ఉన్నా ప్రతిరోజు యోగా చేయాలని ప్రజలకు స్పష్టం చేశారు. 75 సంవత్సరాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటూ అందుకు యోగానే కారణమని ఆయన వివరించారు.


భారతదేశంలో అతి ప్రాచీనమైన విద్య యోగా అని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. స్వచ్ఛమైన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరి యోగా చేయాలని సూచించారు. ప్రజల జీవన విధానం మారిందని.. అందుకే ప్రతి ఒక్కరు యోగా చేయాలని ప్రజలకు కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ మట్టి గడ్డను తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ జయశంకర్: హరీశ్ రావు

పెద్దల పాదాలకు నమస్కరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..

For More TG News And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 10:30 AM