Share News

తెలంగాణ మట్టి గడ్డను తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ జయశంకర్: హరీశ్ రావు

ABN , Publish Date - Jun 21 , 2026 | 08:47 AM

తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జన్మదినం నేడు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్ రావు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

తెలంగాణ మట్టి గడ్డను తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ జయశంకర్: హరీశ్ రావు
BRS MLA Harish Rao

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జన్మదినం నేడు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్ రావు తన ఎక్స్ ఖాతా వేదికగా ఆదివారం స్పందించారు. ‘ తెలంగాణ మట్టి గడ్డను తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ. తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన మహోన్నత దార్శనికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకే అంకితమైన ఆయన జీవితం, పోరాటం, త్యాగం తరతరాలకు స్ఫూర్తి. వారి ఆశయాలకు అనుగుణంగా, ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కంకణ బద్ధులమై ఉంటామని పునరుద్ఘాటిస్తూ.. ఆచార్య జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఐ నాగరాజు అరెస్ట్‌కు రంగం సిద్ధం..

పెద్దల పాదాలకు నమస్కరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..

For More TG News And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 09:49 AM