తమిళనాడులో గ్యాస్ లీక్.. ఏడుగురి మృతి, 60 మందికి అస్వస్థత..
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:45 PM
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో గ్యాస్ లీక్ అవ్వటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
చెన్నై, జూన్ 21: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో గ్యాస్ లీక్ అవ్వటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. తిరువల్లూరు జిల్లా, పెరియపాలెం సమీపంలోని కన్నిగైపైర్‌లో ‘సెయింట్ పీటర్స్ అండ్ పాల్ సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్’ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఆదివారం యూనిట్‌లో గ్యాస్ లీక్ అవ్వటంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 60 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. 60 మందిలో పలువురు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. బాధితులలో ఎక్కువ మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారని తెలుస్తోంది. వాంతులు, ఊపిరితీసుకోవటంలో ఇబ్బంది, అలసట సమస్యలు ఉన్న వారిని కూడా పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ సంఘటనపై తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విచారం వ్యక్తం చేశారు.
గ్యాస్ లీక్ ఘటనపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి
గ్యాస్ లీక్ ఘటనపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి వెళ్లాలని మంత్రులను ఆదేశించారు. సహాయకచర్యలు వేగవంతం చేయాలన్నారు. ప్రమాదంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఘటనపై 3 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
'మమ్మల్ని తొక్కేస్తున్నారు'.. యూఎస్ తీరుపై ఇరాన్ కోచ్ ఘలానెయి తీవ్ర అసంతృప్తి
పశ్చిమాసియాలో శాంతి దిశగా మరో కీలక అడుగు.. స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ కీలక చర్చలు