మహిళల ప్రపంచ కప్ 2026: భారత్ స్కోర్ 158/7
ABN , Publish Date - Jun 21 , 2026 | 08:58 PM
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలి వర్మ (15 బంతులు, 31) రాణించింది. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 29 , హర్మన్‌ప్రీత్ కౌర్ 24, స్మృతి మంధాన 17, యాస్తికా భాటియా 15, రిచా ఘోష్ 15, జెమీమా12 పరుగులు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ , మారిజెన్ కాప్ చెరో రెండు వికెట్లు సాధించారు. మ్లాబా, అయాబొంగా ఖాకా, నాడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ పడగొట్టారు.