-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 20th July 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 20 , 2026 | 07:15 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 20, 2026 21:40 IST
హైదరాబాద్: మైనర్‌పై లైంగిక దాడి కేసులో కోర్టు కీలక తీర్పు
పోక్సో కేసు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
కామాటిపుర పీఎస్ పరిధిలో 2021లో కేసు నమోదు
-
Jul 20, 2026 21:35 IST
NTR ఆరోగ్య వర్సిటీ ఉన్నతస్థాయి సమీక్షలో కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 17 కొత్త కోర్సులు
ఈ ఏడాది నుంచే అలైడ్, హెల్త్‌కేర్ కోర్సులు అమలు
NCAHP నిబంధనల మేరకు దశల వారీగా కోర్సులు
-
Jul 20, 2026 21:15 IST
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
మంగళగిరిలో తల్లికి వందనం లబ్ధిదారులతో మంత్రి నారా లోకేశ్ ముఖాముఖి
ప్రభుత్వ పాఠశాలలను చూసి అసూయపడేలా చేస్తాం: మంత్రి నారా లోకేశ్
మంగళగిరి నియోజకవర్గాన్ని నెం.1గా తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేశ్
ఇందుకు మీ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి: మంత్రి నారా లోకేశ్
-
Jul 20, 2026 21:12 IST
ఉక్రెయిన్‌లో వాణిజ్య నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి
మరో భారతీయుడి పరిస్థితి విషమం
ఒడెసా రేవు నుంచి బయల్దేరుతుండగా 'MV గోల్డెన్ లియో' వాణిజ్య నౌకపై దాడి
విదేశీ వ్యవహారాలశాఖ అధికారిక ప్రకటన
-
Jul 20, 2026 21:00 IST
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం వ్యవహారంలో మరో ట్విస్ట్
ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించలేదు: పోలీసులు
మద్యం అతిగా సేవించడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లారు: పోలీసులు
విషం తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో ఆధారాలు లభించలేదు: పోలీసులు
సానుభూతి కోసమే ఉదయ్ కృష్ణారెడ్డి ఇలా చేసినట్లు పోలీసుల అనుమానం
-
Jul 20, 2026 20:48 IST
అమరావతి: ఎస్టీల సంక్షేమం, అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష
సమస్యలపై గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు: సీఎం చంద్రబాబు
గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు
జీఓ-3 ప్రయోజనాలు దక్కేలా ప్రత్యామ్నాయాలు: సీఎం చంద్రబాబు
జోన్-1లోకి అల్లూరి, జోన్-2లోకి పోలవరం జిల్లాలు: సీఎం చంద్రబాబు
-
Jul 20, 2026 20:46 IST
ప్రకాశం: నేర విభాగం ఏఎస్పీగా సీహెచ్ వెంకటేశ్వర్లు నియమాకం
విశాఖ: మెరైన్ ఏఎస్పీగా కె.వి.రమణ బదిలీ, ఏఎస్పీ (నేర విభాగం)గా ఎన్.రమ్య
ప.గో. జిల్లా ఎస్పీ(అడ్మిన్)గా డి.విశ్వనాథ్
-
Jul 20, 2026 20:44 IST
మరో 2 వారాలు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
వైద్యుల సూచన మేరకు పర్యటనలు వాయిదా వేసుకున్న పవన్ కల్యాణ్
శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి కొనసాగించాలని వైద్యుల సూచన
మంగళగిరి క్యాంప్ ఆఫీస్ నుంచే విధులు నిర్వర్తించనున్న పవన్ కల్యాణ్
అధికారిక కార్యక్రమాలకు అందుబాటులో ఉంటానన్న పవన్ కల్యాణ్
-
Jul 20, 2026 19:58 IST
ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు రిమాండ్
నిందితులు వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, సునీల్‌కు రిమాండ్
ఆగస్టు 3వ తేదీ వరకూ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
-
Jul 20, 2026 19:40 IST
డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన క్రికెటర్ సిరాజ్
డీఎస్పీ హోదాలో తొలిసారి డీజీపీని కలిసిన మహ్మద్ సిరాజ్
పోలీస్ యూనిఫామ్‌తో డీజీపీ కార్యాలయానికి మహ్మద్ సిరాజ్

-
Jul 20, 2026 19:23 IST
ఖమ్మం: ఎల్‌నినో ప్రభావంపై భట్టి, తుమ్మల సమీక్ష
రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుంది: డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల
ఎల్‌నినో ప్రభావాన్ని రైతులకు, ప్రజలకు వివరించాలి
వర్షాల మీద ఆధారపడని పంటలు వేసుకోవాలి: భట్టి, తుమ్మల
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల
-
Jul 20, 2026 18:45 IST
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
తన సూసైడ్‌కు నలుగురు కారణమని లేఖ
తోటి బ్యాచ్‌మేట్‌తో ఏడాది నుంచి రిలేషన్‌లో ఉన్నా: ఉదయ్ కృష్ణారెడ్డి
పెళ్లి తర్వాత కూడా రిలేషన్‌లో ఉన్నాం: ఉదయ్ కృష్ణారెడ్డి
ఆమె తనంతట తానే నా రూమ్‌కు వచ్చింది: ఉదయ్ కృష్ణారెడ్డి
నా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి: ఉదయ్ కృష్ణారెడ్డి
ఇదే విషయాన్ని ట్రైనీ ఐపీఎస్ భర్తకు చెప్పా: ఉదయ్ కృష్ణారెడ్డి
ఆధారాలు ఫోన్‌లో ఉన్నాయి: ఉదయ్ కృష్ణారెడ్డి
-
Jul 20, 2026 18:00 IST
వాంగ్‌చుక్ భార్యపై దాడి వార్తలను ఖండించిన ఢిల్లీ పోలీసులు
జట్టు పట్టుకుని లాగారన్న వార్తలు అవాస్తవం: ఢిల్లీ పోలీసులు
CJP నిరసనలో ఎవరిపైనా బలప్రయోగం చేయలేదు: పోలీసులు
వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేదు: ఢిల్లీ పోలీసులు
సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: పోలీసులు
-
Jul 20, 2026 17:48 IST
హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం
ఓ కేసులో హైడ్రా జోక్యాన్ని ప్రశ్నించిన హైకోర్టు
కోర్టుకు హాజరుకావాలని రంగనాథ్‌కు ఆదేశం
హాజరుకాకుంటే చర్యలకు సిఫార్సు చేస్తామన్న హైకోర్టు
-
Jul 20, 2026 17:47 IST
అమరావతి: ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం
ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై శాఖల వారీగా సీఎం ఆదేశాలు
భద్రత, రవాణా, ప్రోటోకాల్ ఏర్పాట్లపై అధికారులతో చర్చ
అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచన
విజయనగరం జిల్లా యంత్రాంగంతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
-
Jul 20, 2026 17:46 IST
బిహార్‌లో కోవిడ్ కలకలం
భాగల్పూర్ జిల్లాలో దంపతులకు కరోనా పాజిటివ్
JLNMCHలో చికిత్స పొందుతున్న దంపతులు
RT-PCR పరీక్షల ద్వారా నిర్ధారణ చేసిన వైద్యులు
-
Jul 20, 2026 17:15 IST
అయోధ్య రామమందిరం విరాళాల లెక్కింపుపై ట్రస్ట్ కీలక నిర్ణయం
ఇకపై SBI పర్యవేక్షణలోనే విరాళాల లెక్కింపు
రెండు షిఫ్టులలో రోజుకు 12 గంటల పాటు సాగనున్న కానుకల లెక్కింపు
-
Jul 20, 2026 17:14 IST
హైదరాబాద్: పార్టీ మారే ప్రసక్తే లేదు: MLA మల్లారెడ్డి
నేను ఏ పార్టీలోనూ చేరను: మల్లారెడ్డి
BRSలోనే కొనసాగుతా: MLA మల్లారెడ్డి
-
Jul 20, 2026 16:39 IST
అమరావతి: హంద్రీనీవా పనులపై వైసీపీ దుష్ప్రచారం: మంత్రి పయ్యావుల
వైసీపీ పాలనలో హంద్రీనీవా కాలువలో గంప మట్టి తీయలేదు: మంత్రి పయ్యావుల
ప్రభుత్వం ఇచ్చిన ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో పనులు: మంత్రి పయ్యావుల
లైనింగ్ పనులు పూర్తి చేసి నీటిని తీసుకొచ్చాం: మంత్రి పయ్యావుల
-
Jul 20, 2026 16:37 IST
ఏపీ లిక్కర్ రవాణా స్కాం కేసు నిందితులకు వైద్య పరీక్షలు
నిందితులు సునీల్, రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి
కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరు పరచనున్న సిట్ అధికారులు
-
Jul 20, 2026 16:35 IST
ఢిల్లి: సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
23 రోజుల పాటు దీక్ష చేసిన వాంగ్‌చుక్
-
Jul 20, 2026 16:34 IST
ఖమ్మం: ఏన్కూర్‌లో దారుణం
పోలీస్ స్టేషన్‌లోనే భార్యపై కత్తితో భర్త దాడి
రెండేళ్లుగా వేర్వేరుగా ఉంటున్న దంపతులు రజిని, రాంబాబు
భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన భార్యపై కత్తితో దాడి
రజినికి తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
-
Jul 20, 2026 16:12 IST
కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసిన ఢిల్లీ పోలీస్ కమిషనర్
ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితులను హోం సెక్రటరీకి వివరించిన CP
-
Jul 20, 2026 16:12 IST
ఢిల్లీ: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే అరెస్టు వార్తలను ఖండించిన పోలీసులు
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దు: పోలీసులు
జంతర్‌మంతర్ ధర్నా పాయింట్ దగ్గర అభిజిత్ ఉన్నారు: పోలీసులు
-
Jul 20, 2026 15:47 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
443 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
96 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Jul 20, 2026 15:46 IST
CJP నేతలు, విద్యార్థుల దాడిని ఖండించిన ప్రియాంకా గాంధీ
టియర్ గ్యాస్ ప్రయోగించి ఎందుకు కొడుతున్నారు: ప్రియాంక గాంధీ
సమస్యలపై ప్రభుత్వం చర్చకు రావడం లేదు: ప్రియాంక గాంధీ
-
Jul 20, 2026 15:45 IST
అమరావతి: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణ ఉండదు: సీఎం చంద్రబాబు
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం: సీఎం చంద్రబాబు
ప్రజా సేవ కోసమే రిజిస్ట్రేషన్ కేంద్రాలు: సీఎం చంద్రబాబు
డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి సీఎం చంద్రబాబు భరోసా
-
Jul 20, 2026 15:44 IST
ఢిల్లీ పోలీసులపై కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపణలు
వాంగ్‌చుక్ భార్య గీతాంజలిపై దాడి చేశారు: CJP
12 ఏళ్ల బాలిక తల పగిలింది: CJP
40-50 మంది CJP కార్యకర్తలకు గాయాలు: CJP
-
Jul 20, 2026 15:22 IST
అమరావతి: ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వండి: చంద్రబాబు
అమరావతిలో NFDB ప్రాంతీయ కార్యాలయం అవసరం: చంద్రబాబు
DGFT ద్వారా ఫిష్ మీల్ ఎగుమతి నియంత్రణ: చంద్రబాబు
FCV పొగాకు ఎగుమతిని ప్రోత్సహించాలి: సీఎం చంద్రబాబు
-
Jul 20, 2026 15:21 IST
జైపూర్‌లో 2వ రోజు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
టూరిజం గైడ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు నరేంద్ర సింగ్ రాథోడ్‌తో దుర్గేష్ భేటీ
పర్యాటక ప్రాంతాల్లో Ai డిజిటల్, ప్రొఫెషనల్ టూర్ గైడ్స్ అందుబాటులోకి వస్తారన్న మంత్రి
ఏపీకి రావాల్సిందిగా రాథోడ్‌కు మంత్రి దుర్గేష్ ఆహ్వానం
-
Jul 20, 2026 15:09 IST
పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా
విపక్షాల ఆందోళనతో రేపటికి వాయిదా
-
Jul 20, 2026 14:59 IST
జమ్మూకశ్మీర్ క్లౌడ్ బరస్ట్ ఘటనలో మొత్తం 20 మంది మృతి
భారీ వరదలకు పూంఛ్ జిల్లాలో 15 మంది మృతి
రాజౌరిలో ముగ్గురు, దోడా జిల్లాలో ఇద్దరి మృతి
కొండచరియలు విరిగిపడి పలుచోట్ల ధ్వంసమైన ఇళ్లు
పలువురు గల్లంతు, కొనసాగుతున్న రెస్క్యూ
-
Jul 20, 2026 14:58 IST
రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి: యువరాజ్ సింగ్
బీసీసీఐకు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సూచన
వన్డే ప్రపంచ కప్ 2027 ప్రణాళికల్లో రోహిత్, విరాట్ ఉంటారా?: యువీ
వీరి భవిష్యత్తుపై వస్తోన్న ఊహాగానాలకు స్పష్టత ఇవ్వండి: యువీ
-
Jul 20, 2026 14:51 IST
బహదూర్‌గూడ భూముల వ్యవహారంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
తక్షణమే ఫెన్సింగ్ తొలగించాలని కోరుతూ రైతుల పిటిషన్
భూముల దగ్గర నుంచి అధికారులు వెళ్లిపోయేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్
కాసేపట్లో హైకోర్టు ధర్మాసనం విచారణ
-
Jul 20, 2026 14:51 IST
APAAR ఐడీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
APAAR ఐడీ పూర్తి స్వచ్ఛందమే: సుప్రీంకోర్టు
సమ్మతి పత్రాల్లో ఆప్ట్-అవుట్ ఎంపిక తప్పనిసరి: సుప్రీంకోర్టు
విద్యార్థుల సమాచారాన్ని విద్యావసరాలకే ఉపయోగించాలి
ఇతర ప్రయోజనాలకు వినియోగించరాదు: సుప్రీంకోర్టు
-
Jul 20, 2026 14:15 IST
హైదరాబాద్: పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై కేటీఆర్ విమర్శలు
ఏ పార్టీలో ఉన్నారో తెలియని దుస్థితిలో పోచారం ఉన్నారు
పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఓడించడమే మన లక్ష్యం: కేటీఆర్
-
Jul 20, 2026 14:00 IST
ఢిల్లీ: సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సోనమ్ వాంగ్‌చుక్ లేఖ
తనను తాత్కాలికంగా డిశ్చార్జ్ చేయాలని కోరుతూ వాంగ్‌చుక్ లేఖ
CJP చలో పార్లమెంట్ ర్యాలీలో పాల్గొంటానన్న సోనమ్ వాంగ్‌చుక్
ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని లేఖలో పేర్కొన్న వాంగ్‌చుక్
-
Jul 20, 2026 13:59 IST
త్రిపుర డీజీపీ అనుమానాస్పద మృతి
అగర్తలాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ అనురాగ్ ధన్కర్ అనుమానాస్పద మృతి
-
Jul 20, 2026 13:59 IST
ఢిల్లీ: సీజేపీ ఫౌండర్ అభిజిత్ నిరాహార దీక్ష విరమణ
నీట్ పేపర్ లీక్‌పై జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేస్తున్న అభిజిత్
-
Jul 20, 2026 13:50 IST
ఢిల్లీ: రెండో రోజు అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
వైష్ణోదేవి, శివ్‌ఖోరీ యాత్రలకూ బ్రేక్
భారీ వర్షాలతో యాత్రలు తాత్కాలికంగా నిలిపివేత
బేస్ క్యాంపుల్లోనే ఉండాలని భక్తులకు సూచన
యాత్రికుల వాహనాలకు అనుమతి నిరాకరణ
వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
-
Jul 20, 2026 13:49 IST
నల్లగొండ: గుర్రంపోడు కానిస్టేబుల్‌పై పోక్సో కేసు
బాలికతో కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ
బాలిక ఫిర్యాదుతో నల్లగొండ వన్ టౌన్ పోలీసుల విచారణ
సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కానిస్టేబుల్ సత్యనారాయణగా గుర్తింపు
గతంలోనూ కానిస్టేబుల్‌పై పోక్సో కేసులున్నట్టు సమాచారం
-
Jul 20, 2026 13:48 IST
జనగామ: రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి: కడియం శ్రీహరి
హరీష్ రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు: కడియం శ్రీహరి
కుంగిన మేడిగడ్డకు ఎవరు బాధ్యత వహిస్తారు?: కడియం శ్రీహరి
మిడిమిడి జ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు: కడియం శ్రీహరి
-
Jul 20, 2026 13:47 IST
ఢిల్లీ: పార్లమెంట్ దగ్గర ఉద్రిక్తత
పార్లమెంట్ ప్రధాన గేట్ దగ్గరకు సీజేపీ కార్యకర్తలు
బారికేడ్లు తోసుకుని వచ్చిన నిరసనకారులపై లాఠీచార్జ్
పోలీసు బలగాలు, సీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట
పలువురు పోలీసులు, సీజేపీ కార్యకర్తలకు గాయాలు
టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
పార్లమెంట్ దగ్గర భారీగా పోలీస్ బలగాల మోహరింపు
పార్లమెంట్ గేట్లు మూసివేసిన భద్రతా బలగాలు
-
Jul 20, 2026 13:46 IST
ఢిల్లీ: సీజేపీ కార్యకర్తలపై టియర్ గ్యాస్ ప్రయోగం
పరుగులు తీసిన కార్యకర్తలు
పలువురు కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
-
Jul 20, 2026 13:26 IST
హైదరాబాద్: క్యూర్‌లో LIG ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
ప్రారంభించిన మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, పొన్నం, అజహరుద్దీన్
ఇందిరమ్మ LIG ఇళ్ల బ్రోచర్ విడుదల చేసిన మంత్రులు
-
Jul 20, 2026 13:25 IST
హైదరాబాద్: గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు
సెప్టెంబర్ 14న వినాయక చవితి
సెప్టెంబర్ 25న సామూహిక నిమజ్జనోత్సవం
వందేమాతరం 150 ఏళ్ల సందర్భంగా మండపాల దగ్గర జాతీయ జెండా ఆవిష్కరించాలని నిర్ణయం
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్
గణేష్ ఉత్సవాల్లో డీజేలకు చెక్
ఆధ్యాత్మిక, దేశభక్తి కార్యక్రమాలకే ప్రాధాన్యత
-
Jul 20, 2026 13:24 IST
ఢిల్లీ: విద్యార్థులపై లాఠీఛార్జ్.. ప్రజాస్వామ్యంపై దాడే: ఖర్గే
అధికారంలో కొనసాగేందుకు ప్రభుత్వానికి సామర్థ్యం లేదు: ఖర్గే
అయోధ్య విరాళాల అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాం: ఖర్గే
అయోధ్య ట్రస్ట్ స్థాపకుల్లో ప్రధాని మోదీ కూడా ఒకరు: ఖర్గే
విరాళాల చోరీపై ప్రధాని మోదీ బాధ్యత వహించాలి: ఖర్గే
-
Jul 20, 2026 13:23 IST
ఢిల్లీ: అమిత్‌షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ
కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనతో భేటీకి ప్రాధాన్యం
-
Jul 20, 2026 13:05 IST
హైదరాబాద్: క్యూర్ పరిధిలో ప్లాట్ల కోసం రేపటి నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు
మీ సేవ, వాట్సాప్, వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రూ.10వేలు టోకెన్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి: మంత్రి
డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక: మంత్రి
లాటరీలో ఇళ్లు రానివారి డబ్బులు వెంటనే చెల్లిస్తాం: మంత్రి
లబ్ధిదారుల పేరిట స్థలం రిజిస్ట్రేషన్ చేస్తాం: మంత్రి
స్థలంతో పాటు రూ.5లక్షల సాయం: మంత్రి
-
Jul 20, 2026 13:02 IST
పార్లమెంట్ ముట్టడికి సీజేపీ కార్యకర్తల యత్నం
పార్లమెంట్ ప్రధాన గేట్ దగ్గరకు సీజేపీ కార్యకర్తలు
పోలీసు బలగాలు, సీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట
ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం
-
Jul 20, 2026 12:35 IST
కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని కాకతీయ నగర్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ
మూడున్నర తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాల చోరీ
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 20, 2026 12:28 IST
కృష్ణా: గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
శస్త్రచికిత్స అనంతరం తొలిసారి ఏపీకి రాక
గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం
తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరిన పవన్ కల్యాణ్
-
Jul 20, 2026 12:26 IST
రిటైర్‌మెంట్ వార్తలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
నా పని బ్యాట్‌తో పరుగులు చేయడం.. జట్టును గెలిపించడం: రోహిత్
బయట వచ్చే ప్రచారాలను నేను అస్సలు పట్టించుకోను: రోహిత్
లార్డ్స్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్
-
Jul 20, 2026 12:07 IST
ఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు వాయిదా
-
Jul 20, 2026 11:42 IST
వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
-
Jul 20, 2026 11:20 IST
హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు
నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయంతో చర్యలు
సీసీ ఫుటేజీతో పాటు ఆధారాలు సేకరించిన ప్రివిలేజ్ కమిటీ
ఉదయ్ కృష్ణారెడ్డిపై ఆరోపణలు నిజమని నిర్ధారించిన కమిటీ
తక్షణమే ఎన్‌పీఏ నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ నిర్ణయం
సర్వీస్‌లో జాయినింగ్‌కు సంబంధించి DOPTదే తుది నిర్ణయం: ఎన్‌పీఏ
-
Jul 20, 2026 11:18 IST
హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
పరిస్థితి విషమం, ఎర్రగడ్డలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు
నిన్న ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదు
-
Jul 20, 2026 11:16 IST
విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ వాయిదా
మధ్యాహ్నం 12 గంటల వరకు సభ వాయిదా
-
Jul 20, 2026 11:05 IST
ఢిల్లీ: జంతర్‌మంతర్ దగ్గర హైటెన్షన్
సీజేపీ చలో పార్లమెంట్‌ను అడ్డుకున్న పోలీసులు
సీజేపీ ఆందోళనకు అనుమతి లేదన్న పోలీసులు
పోలీసులతో ఆందోళనకారుల వాగ్వాదం
సీజేపీ కార్యకర్తలపై భద్రతా బలగాల లాఠీఛార్జ్
-
Jul 20, 2026 11:00 IST
ఇరాన్‌లోని కెర్మాన్‌షా ప్రావిన్స్‌లో భూకంపం
రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదు
-
Jul 20, 2026 10:59 IST
ఢిల్లీ: సీజేపీ ఆందోళనకు మద్దతు తెలిపిన ఆప్
నిరసనలో పాల్గొన్న అతిషి, మనీష్ సిసోడియా, సంజయ్‌సింగ్
నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
-
Jul 20, 2026 10:58 IST
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలి: ప్రధాని మోదీ
గత నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయి: ప్రధాని
అంతరిక్ష ప్రస్థానంలో నవశకం ప్రారంభమైంది: ప్రధాని
భారత అంతరిక్ష ప్రస్థానంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది: ప్రధాని
మన యువత అంతరిక్షంలోకి దూసుకుపోయింది: ప్రధాని
స్కైరూట్ విజయవంతం అవడం దేశానికి గర్వకారణం: ప్రధాని
-
Jul 20, 2026 10:25 IST
ఢిల్లీ: దేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు: అభిజిత్ దీప్కే
పదేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి: అభిజిత్ దీప్కే
పార్లమెంట్‌కు వెళ్లకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు: అభిజిత్ దీప్కే
-
Jul 20, 2026 10:24 IST
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
భారీగా జంతర్ మంతర్ చేరుకుంటున్న సీజేపీ కార్యకర్తలు
పార్లమెంట్ మార్చ్‌కు భారీగా తరలివచ్చిన సీజేపీ మద్దతుదారులు
భారీ భద్రతను ఏర్పాటు చేసిన కేంద్రం
జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వచ్చే అన్ని మార్గాలను మూసివేసిన కేంద్ర బలగాలు
-
Jul 20, 2026 10:02 IST
చెన్నై: డీఎంకే ఎమ్మెల్యే మార్కండయన్‌ను అరెస్టు చేసిన పోలీసులు
తమిళనాడు సీఎం విజయ్‌పై అవమానకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే
సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అరెస్టు చేసిన పోలీసులు
-
Jul 20, 2026 09:39 IST
ఢిల్లీ: సీజేపీ చలో పార్లమెంట్ పిలుపునకు మద్దతు తెలిపిన నటుడు ప్రకాశ్ రాజ్
-
Jul 20, 2026 09:37 IST
హైదరాబాద్: దోమలగూడలో ముగ్గురు బాలికల అదృశ్యం
ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన స్నేహ, లలిత, లత
హిమాయత్‌నగర్‌లో బాలికలు ఆటో ఎక్కినట్లు గుర్తింపు
కాచిగూడ రైల్వేస్టేషన్ దగ్గర ఆటో దిగినట్లు నిర్ధారణ
దోమలగూడ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదు
బాలికల ఆచూకీ కోసం పోలీస్ బృందాల గాలింపు
-
Jul 20, 2026 09:36 IST
ముంబై కోస్టల్ రోడ్డులో ప్రమాదం
ఇథనాల్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు, ఆరుగురి మృతి
పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Jul 20, 2026 09:35 IST
నిజామాబాద్: నేనిచ్చిన హామీలు, ప్రభుత్వ హామీలపై చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
నా స్థాయి నాయకులు లేదా కొడంగల్ ఎమ్మెల్యేతో చర్చకు సిద్ధం: రాకేష్ రెడ్డి
నేను స్కూటీలు తీసుకెళ్లాలని మాత్రమే చెప్పా: రాకేష్ రెడ్డి
చోరీ చేయాలని చెప్పలేదు: రాకేష్ రెడ్డి
-
Jul 20, 2026 09:34 IST
హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
నాపై వచ్చిన ఫిర్యాదులు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవం: కృష్ణారెడ్డి
చట్టంపై నాకు పూర్తి నమ్మకం ఉంది: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతే రిపోర్ట్ చేయండి: కృష్ణారెడ్డి
-
Jul 20, 2026 09:33 IST
నిజామాబాద్: ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత
బయటకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
బీజేపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట
-
Jul 20, 2026 09:30 IST
హైదరాబాద్: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం
ఉదయ్ కృష్ణారెడ్డికి అత్తాపూర్ పోలీసుల నోటీసులు
ఘటనపై 8 రోజుల్లో వివరణ ఇవ్వాలన్న పోలీసులు
కేసును పర్యవేక్షిస్తున్న జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్
-
Jul 20, 2026 09:26 IST
నంద్యాల: ఆరేళ్ల చిన్నారి ప్రణవి అదృశ్యం
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ప్రణవి
తల్లి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు
200 మంది పోలీసులు, డ్రోన్లు, జాగిలాలతో గాలింపు
సీసీటీవీ ఫుటేజీలో ప్రణవి కదలికల గుర్తింపు
తెల్లవారుజామున జొన్న చేనులో సురక్షితంగా కనిపించిన ప్రణవి
చిన్నారిని తల్లికి అప్పగించిన పోలీసులు
ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు, పోలీస్ బృందాలు
-
Jul 20, 2026 08:57 IST
ఒమన్‌లో చిక్కుకున్న పహాడీషరీఫ్ మహిళ సెల్ఫీ వీడియో
దయచేసి నన్ను స్వదేశానికి తీసుకెళ్లండి అంటూ సెల్ఫీ వీడియో
ఉద్యోగం పేరుతో ఒమన్ పంపి ఏజెంట్ మోసం చేశాడని ఆవేదన
-
Jul 20, 2026 08:55 IST
హైదరాబాద్: బహదూర్‌గూడలో 650 ఎకరాల ప్రభుత్వ భూములకు కంచె పనులు పూర్తి
బుల్లెట్ రైలు, బస్సు టెర్మినల్ ప్రాజెక్టుల కోసం భూముల స్వాధీనం
హైడ్రా ఆధ్వర్యంలో భారీ భద్రత మధ్య ఫెన్సింగ్ పూర్తి చేసిన పోలీసులు
ఇప్పటికే సాగు చేస్తున్న రైతులకు పొలాల్లోకి వెళ్లేందుకు అనుమతి
భూముల్లో 4 ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసిన పోలీసులు
రైతుల దీక్షా శిబిరాన్ని తొలగించిన అధికారులు
పోలీసులపై దాడి ఘటనలో 41 మందిపై కేసులు నమోదు
-
Jul 20, 2026 08:54 IST
హైదరాబాద్: విల్లాల పేరుతో భారీ మోసం
గురు రాఘవేంద్ర ఇన్‌ఫ్రా డెవలపర్స్‌పై CCSలో కేసు నమోదు
భారీ లాభాలు వస్తాయని పెట్టుబడి పెట్టించిన నిర్వాహకులు
'రాయల్ పామ్స్' ప్రాజెక్ట్‌లో 3 విల్లాలు బుక్ చేసిన బాధితులు
2017లో రూ.2కోట్లు చెల్లించినా రిజిస్ట్రేషన్ చేయడం లేదన్న బాధితులు
2022లో అదే విల్లాలను ఇతరులకు విక్రయించినట్టు బాధితుల ఫిర్యాదు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న CCS పోలీసులు
-
Jul 20, 2026 08:54 IST
హైదరాబాద్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కనుమూరి సునీల్‌కు పీటీ వారెంట్
చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులు
పీటీ వారెంట్‌పై విజయవాడకు తరలించిన ఏపీ పోలీసులు
విచారణ కోసం చంచల్‌గూడ జైలు నుంచి విజయవాడకు తరలింపు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరింత లోతుగా విచారించనున్న పోలీసులు
ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో చంచల్‌గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులు
-
Jul 20, 2026 08:51 IST
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో భారీ చోరీ
ప్రైవేట్ సంస్థ కార్యాలయంలో కిలో బంగారం మాయం
7 నెక్లెస్‌లు, 7 జతల చెవిపోగులు ఎత్తుకెళ్లిన దుండగులు
డైమండ్ ఫిక్సింగ్ కోసం లాకర్‌లో భద్రపరిచిన ఆభరణాలు మాయం
వాష్‌రూమ్ కిటికీ ధ్వంసం చేసి లోపలకు ప్రవేశించినట్టు గుర్తింపు
సూరత్‌కు చెందిన వ్యాపారి ఫిర్యాదుతో కేసు నమోదు
-
Jul 20, 2026 07:52 IST
నిజామాబాద్: ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వినయ్‌రెడ్డి హౌస్ అరెస్ట్
ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
పోలీసుల ఆంక్షల నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్
అంకాపూర్‌లోని తన నివాసంలో ఉన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు
-
Jul 20, 2026 07:36 IST
ఇరాన్‌పై వరుసగా 9వ రోజు అమెరికా దాడులు
పోర్టు నగరాలు, సైనిక స్థావరాలపై బాంబుల వర్షం
ఇరాన్ క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు ధ్వంసం
ఖుజెస్థాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు
చాబహరా, బందర్ అబ్బాస్ నగరాల్లో బాంబులు పడ్డాయన్న ఇరాన్
-
Jul 20, 2026 07:35 IST
గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు
ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంటున్న కువైట్
-
Jul 20, 2026 07:24 IST
నేడు సుప్రీంకోర్టులో అయోధ్య విరాళాల చోరీ కేసు విచారణ
సీల్డ్ కవర్‌లో స్టేటస్ రిపోర్టు సమర్పించిన సిట్
సిట్ నివేదికపై విచారణ చేపట్టనున్న ధర్మాసనం
ట్రస్ట్, కేంద్రం, యూపీకి గతంలో నోటీసులు
సీబీఐ విచారణ కోరుతూ పలు పిటిషన్లు
-
Jul 20, 2026 07:23 IST
నేడు చలో పార్లమెంట్‌కు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు
ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన పోలీసులు
సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో అదనపు బలగాల మోహరింపు
సీజేపీ అనుమతి తీసుకోలేదంటున్న పోలీసులు
హైసెక్యూరిటీ జోన్‌లో ర్యాలీని అనుమతించబోం: పోలీసులు
-
Jul 20, 2026 07:23 IST
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
వ్యూహ, ప్రతి వ్యూహాలతో సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు
ఐదు కొత్త బిల్లుల ఆమోదమే లక్ష్యంగా కేంద్రం అడుగులు
-
Jul 20, 2026 07:15 IST
నేడు యాదగిరిగుట్ట ఆలయంలో వరుణ యాగం
మూడు రోజుల పాటు వర్ష పాశుపత వరుణయాగం
ఎల్‌నినోతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా యాగం