Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 19 , 2026 | 06:54 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 19, 2026 20:45 IST

    లండన్ కు బయలుదేరిన బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు

    • అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు వివాహానికి హాజరుకానున్న హరీశ్ రావు

  • Aug 19, 2026 20:34 IST

    హైదరాబాద్‌: ఇంటర్ బోర్డులో విజిలెన్స్ సోదాలు

    • 2019లో ఇంటర్ ఫలితాల అంశంలో సోదాలు

    • గ్లోబరీనా కంపెనీ టెండర్ ప్రక్రియ వివాదంపై విచారణ

    • ఇంటర్ మాజీ సెక్రటరీ అశోక్‌ను ప్రశ్నించిన అధికారులు

    • ఇటీవల నీట్ ఫలితాల్లో గ్లోబరీనా అంశం వెలుగులోకి రావడంతో సోదాలు

    • గ్లోబరీనా సంస్థల్లో ముగిసిన విజిలెన్స్ అధికారుల సోదాలు

  • Aug 19, 2026 20:30 IST

    హైదరాబాద్: SIR-2026పై సీఈఓ సుదర్శన్ రెడ్డి కీలక సమీక్ష

    • డీఈఓలు, ఈఆర్‌ఓలతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్

    • అనామలీస్, నో-మ్యాపింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి

    • క్లెయిమ్స్, అభ్యంతరాలను సకాలంలో పరిష్కరించాలి

    • ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణలు చేపట్టాలి

    • ASDD జాబితాలోని కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలి

  • Aug 19, 2026 20:21 IST

    నంద్యాల : శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరదనీరు

    • ఇన్ ఫ్లో : 65,890 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : 28,252 క్యూసెక్కులు

    • పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 875.50 అడుగులు

    • పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు.. ప్రస్తుతం : 165.9244 టీఎంసీలు

  • Aug 19, 2026 20:00 IST

    గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం చేయాలని చంద్రబాబు ఆదేశం

    • కోనసీమలో ఏడుగురు మత్స్యకారుల గాలింపు చర్యలపై అధికారులతో సీఎం సమీక్ష

    • మంత్రి అచ్చెన్న, అధికారులతో వర్చువల్‌గా మాట్లాడిన సీఎం చంద్రబాబు

    • రెండు విమానాలు, నేవీ బోట్లతో పాటు మరో ఏడు బోట్లతో గాలింపు

  • Aug 19, 2026 19:55 IST

    బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పీవీ సింధు ముందంజ

    • రౌండ్‌ ఆఫ్‌ 16లోకి ప్రవేశించిన పీవీ సింధు

  • Aug 19, 2026 19:50 IST

    ఢిల్లీ: CWC కీలక నిర్ణయాలు

    • 1937 నాటి వందేమాతరం పాడాలని CWC నిర్ణయం

    • వందేమాతరంలో రెండు చరణాలే పాడాలని నిర్ణయం

    • డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా CWC తీర్మానం

    • 543 పార్లమెంట్ స్థానాలే కొనసాగించాలి: CWC

    • ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలి: CWC

  • Aug 19, 2026 19:45 IST

    విజయనగరం. జిల్లా జలవనరుల శాఖ కార్యలయంలో ఏసీబీ సోదాలు

    • ఏసీబీకి పట్టుబడిన చీపురపల్లి ఇన్‌ఛార్జి స్పెషలాఫీసర్ చింతల మహేష్

    • కోళ్ల ఫారం ఏర్పాటుకు రూ.15000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

  • Aug 19, 2026 19:35 IST

    అమరావతి: స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు నివేదించిన ఏపీ ప్రభుత్వం

    • అక్టోబర్ చివరి నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి: AG దమ్మాలపాటి శ్రీనివాస్

    • హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్

    • విచారణను 2 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు

  • Aug 19, 2026 19:30 IST

    మున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌

    • ఏపీలో 100 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    • 87 మున్సిపాలిటీలకు పాలక వర్గాల గడువు ఇప్పటికే పూర్తి

    • నవంబర్‌తో ముగియనున్న మరో 13 పాలకవర్గాల గడువు

    • ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘంతో సమన్వయం

  • Aug 19, 2026 19:15 IST

    అమరావతి: కొంతమంది అధికారుల తీరుపై హైకోర్టు అసంతృప్తి

    • అధికారులు హైకోర్టు ఆదేశాలను తేలికగా తీసుకుంటున్నారు

    • కౌంటర్, వివరాలు సమర్పించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోండి

    • అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌కు ఏపీ హైకోర్టు ధర్మాసనం సూచన

  • Aug 19, 2026 19:00 IST

    హైదరాబాద్: పోలీస్‌ శాఖ పునర్‌వ్యవస్థీకరణ: DGP సీవీ ఆనంద్

    • మారుతున్న సవాళ్లకు అనుగుణంగా శాఖలో మార్పులు: DGP సీవీ ఆనంద్

    • గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, SIB నుంచి 513 మంది సిబ్బంది ఇతర విభాగాలకు బదిలీ

    • 513 మందిలో 5 మంది సీఐలు, 22 మంది ఎస్‌ఐలు, 14 మంది ASIలు: DGP ఆనంద్

    • 84 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 388 మంది కానిస్టేబుళ్లకు కొత్త బాధ్యతలు

  • Aug 19, 2026 18:50 IST

    హైదరాబాద్‌: బండ్లగూడ చాంద్రాయణగుట్టలో పల్లచెరువుకు గండి

    • ఇళ్లు, రోడ్లపైకి భారీగా చేరిన వరద నీరు

    • నూరీషా కాలనీ, రెహమత్‌ కాలనీలోకి చేరిన చెరువు నీరు

    • సహాయక చర్యలు చేపట్టిన GHMC, డిజాస్టర్‌ టీమ్‌

  • Aug 19, 2026 18:45 IST

    ఏపీలో జూడాల ఉపకార వేతనం పెంపు

    • జూనియర్‌ డాక్టర్ల విజ్ఞప్తితో ప్రభుత్వ ప్రకటన.. ప్రతి ఏటా స్టైఫండ్‌ పెంపు

    • 2026 నుంచి ఇంటర్న్‌లకు 5 శాతం పెంపు.. ఆ తర్వాత ప్రతి ఏడాది 3 శాతం పెంపు

    • పీజీ, సూపర్‌స్పెషాలిటీ విద్యార్థులకు ఏటా 3 శాతం పెంపు

    • తక్షణం విధుల్లో చేరాలని జూడాలకు ప్రభుత్వం విజ్ఞప్తి

  • Aug 19, 2026 18:38 IST

    హైదరాబాద్: పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

    • 33 మంది దోషులకు శిక్ష ఖరారు చేసిన నాంపల్లి పోక్సో కోర్టు

    • 2015 CID కేసులో తీర్పును వెల్లడించిన న్యాయస్థానం

    • 9 మంది బాలికలను ట్రాప్ చేసి, వ్యభిచారంలోకి దింపిన ముఠా

    • ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు

    • ముగ్గురికి 14 ఏళ్లు, మరో 14 మందికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

    • బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశం

  • Aug 19, 2026 18:36 IST

    కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్‌

    • సుస్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖను వివరణ కోరనున్న టీపీసీసీ

    • ఇప్పటికే సీరియస్‌గా ఉన్న క్రమశిక్షణ కమిటీ

    • కఠిన చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ పార్టీ

  • Aug 19, 2026 18:36 IST

    కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో విషాదం

    • నిర్మాణ భవనం పైనుంచి పడి కుమార్ (33) అనే కార్మికుడి మృతి

    • పైఅంతస్తు స్లాబ్ కోసం క్రేన్ ద్వారా మెటీరియల్ తరలిస్తుండగా ప్రమాదం

    • అకస్మాత్తుగా క్రేన్ వైర్ తెగిపోవడంతో మెటీరియల్‌తో సహా కిందపడిన కుమార్

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 19, 2026 18:33 IST

    హైదరాబాద్: 22Aపై కలెక్టర్లతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్‌

    • నిషేధిత భూముల సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం: మంత్రి పొంగులేటి

    • కేసులను పరిశీలించి వేగంగా పరిష్కరించాలి: మంత్రి పొంగులేటి

    • 22A జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్‌ తిరస్కరించొద్దు: మంత్రి పొంగులేటి

    • భూముల విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • Aug 19, 2026 18:30 IST

    విశాఖ: ఈ నెల 22, 23న బ్రిక్స్‌ దేశాల కీలక సమావేశాలు

    • హాజరుకానున్న 11 బ్రిక్స్‌ దేశాల మంత్రులు

    • సమావేశంలో భాగస్వామ్యం కానున్న సీఎం చంద్రబాబు

    • ఈ నెల 22న యువజన మంత్రుల సమావేశం

    • ఈ నెల 23న బీచ్‌రోడ్‌లో ఫ్రెండ్షిప్‌ సైకిల్‌ ర్యాలీ

  • Aug 19, 2026 18:21 IST

    జాతీయ భద్రతను రాజకీయంగా చూడకూడదు: మల్లిఖార్జున ఖర్గే

    • సరిహద్దు పరిస్థితులపై ప్రజలకు నిజాలు తెలియాలి: మల్లిఖార్జున ఖర్గే

    • గాల్వాన్ తర్వాత సరిహద్దుపై ప్రశ్నలకు సమాధానాలేవి: ఖర్గే

    • సరిహద్దు పరిస్థితులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: ఖర్గే

    • ప్రభుత్వ జవాబుదారీతనం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి: మల్లిఖార్జున ఖర్గే

  • Aug 19, 2026 18:15 IST

    విజయవాడ: యూట్యూబర్‌ రావణ్‌ బెయిల్‌పై కోర్టులో విచారణ

    • బెయిల్‌ పిటిషన్‌ తమ పరిధిలోకి రాదన్న 2వ ఏడీజే కోర్టు

    • UAPA కేసును ఈ కోర్టు విచారించదన్న న్యాయమూర్తి

    • బెయిల్‌ పిటిషన్‌ను రిటర్న్‌ చేస్తానన్న న్యాయమూర్తి

    • స్పీకింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వాలని న్యాయవాదుల విజ్ఞప్తి

  • Aug 19, 2026 17:54 IST

    రంగారెడ్డి: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన అత్తాపూర్‌ పోలీసులు

    • CEIR పోర్టల్‌ ద్వారా 25 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు

    • రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు అప్పగించిన పోలీసులు

  • Aug 19, 2026 17:35 IST

    సర్వర్‌ సమస్యతో నిలిచిపోయిన ఇండిగో ఆన్‌లైన్‌ సేవలు

    • టికెట్‌ బుకింగ్స్‌లో సాంకేతిక సమస్యలు

    • ఇబ్బందులు పడుతున్న ఇండిగో ప్రయాణికులు

    • అత్యవసర ప్రయాణికులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి: ఇండిగో

  • Aug 19, 2026 17:30 IST

    కొండా సుస్మితకు పరకాల ఎవరైనా రాసిచ్చారా?: కాంగ్రెస్ నేత సునీత

    • ఆమె ఏ పార్టీ నుంచి వచ్చిందో గుర్తు పెట్టుకోవాలి: జక్కని సునీత

    • ఇప్పటికైనా అహంకారంతో మాట్లాడటం మానుకోవాలి: జక్కని సునీత

    • సీఎంపై మాట్లాడే అర్హత కొండా సుస్మితకు లేదు: జక్కని సునీత

  • Aug 19, 2026 17:20 IST

    ఢిల్లీ: టిక్రీకలాన్‌ CNG స్టేషన్‌లో పేలుడు

    • చమురు నింపుతుండగా పేలిన ట్యాంకర్‌

    • ప్రమాదంలో ఒకరి మృతి, పలువురికి గాయాలు

  • Aug 19, 2026 17:15 IST

    హైదరాబాద్: నన్ను ఎవరూ అరెస్ట్‌ చేయలేదు: మాజీ MLA రేగా కాంతారావు

    • నేను ఎక్కడికీ పారిపోలేదు: రేగా కాంతారావు

    • నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా కొందరు వ్యవహరించారు: రేగా కాంతారావు

    • నేను అరెస్ట్‌ అయినట్లు ప్రచారం చేశారు: రేగా కాంతారావు

  • Aug 19, 2026 17:10 IST

    హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టులో విచారణ

    • ప్రజాధనం ఉచిత పథకాలకు ఖర్చు చేయడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

    • చట్టబద్ధత లేని పథకాలకు ప్రజాధనం వృథా చేస్తే ఎలా?: హైకోర్టు

    • ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తెచ్చి ఉచిత పథకాలకు ఖర్చు చేయొచ్చు కదా?

    • భూసేకరణలో న్యాయం జరగక బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు: హైకోర్టు

  • Aug 19, 2026 17:00 IST

    మాజీ MLA రేగా కాంతారావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

    • రేగా కాంతారావుపై నమోదైన కేసును కొట్టివేసిన హైకోర్టు

    • పంజాగుట్ట పీఎస్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన FIRను కొట్టివేసిన కోర్టు

  • Aug 19, 2026 16:59 IST

    హైదరాబాద్: కొండా సుస్మిత వ్యవహారంపై ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

    • పీసీసీ ఛీఫ్ నుంచి నివేదిక కోరిన ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్

    • సుస్మిత వ్యవహరాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఇప్పటికే ప్రకటించిన మల్లు రవి

    • సుస్మిత వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

  • Aug 19, 2026 16:55 IST

    హనుమకొండ: సుస్మితా పటేల్‌కు ఎమ్మెల్యే రేవూరి కౌంటర్‌

    • కాంగ్రెస్‌ అనేది జాతీయ పార్టీ.. కొన్ని ప్రొసీజర్స్‌ ఉంటాయి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

    • సీఎం వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తారు: ఎమ్మెల్యే రేవూరి

    • నాపై సుస్మిత వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా: ఎమ్మెల్యే రేవూరి

    • టైం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం చెప్తా: ఎమ్మెల్యే రేవూరి

    • ఇది ప్రారంభం మాత్రమే.. ముందు ముందు చాలా ఉంది: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

  • Aug 19, 2026 16:52 IST

    రేపు తమిళనాడులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన

    • మహాబలిపురంలో 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం

    • శుక్ర, శనివారాల్లో బెంగాల్‌లో అమిత్‌ షా పర్యటన

    • సిలిగురిలో సరిహద్దు భద్రత ప్రాజెక్టుల ప్రారంభోత్సవం

  • Aug 19, 2026 16:52 IST

    తెలంగాణలో సినిమా టికెట్‌ రేట్లపై కీలక జీవో

    • కొత్తగా స్పెషల్‌ థియేటర్స్‌ కేటగిరీ ఏర్పాటు

    • 7.1 సౌండ్‌, 2K/4K స్క్రీన్లకు స్పెషల్‌ కేటగిరీ

    • ప్రతి థియేటర్‌లో 25% సీట్లు నాన్‌-ప్రీమియం

    • ఉదయం 8 నుంచి రాత్రి ఒంటిగంట వరకూ 5షోలకు అనుమతి

    • చిన్న సినిమాలకు రోజూ ఒక షో తప్పనిసరి

    పూర్తి కథనం..

  • Aug 19, 2026 16:45 IST

    హైదరాబాద్: ఉదయ్‌కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

    • చంచల్‌గూడ జైలుకు ఉదయ్‌కృష్ణారెడ్డి తరలింపు

    • రేపు ఉప్పరపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్న ఉదయ్ న్యాయవాదులు

  • Aug 19, 2026 16:40 IST

    కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్‌లో కుక్కల స్పైర విహారం

    • గొర్రెల మందపై వేట కుక్కల దాడి

    • నాలుగు గొర్రెల మృతి

    • ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థుల వినతి

  • Aug 19, 2026 16:36 IST

    కొండా సుస్మిత వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందన

    • కొండా సుస్మిత వ్యాఖ్యలు ఖండిస్తున్నా: చైర్మన్ మల్లు రవి

    • సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసేలా సుస్మిత వ్యాఖ్యలు: మల్లు రవి

    • పార్టీ లైన్‌ను ఎవరు అతిక్రమించినా చర్యలే: మల్లు రవి

    • ఇటీవల రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే నోటీసులు: మల్లు రవి

    పూర్తి కథనం..

  • Aug 19, 2026 16:20 IST

    అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు

    • జమ్మూకశ్మీర్‌లో భారత్‌లో భాగమే

    • జమ్మూకశ్మీర్‌ కోసం భారత్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది

    • జమ్మూకశ్మీర్‌ ట్రావెల్ అడ్వైజరీపై పునఃసమీక్ష: సెర్గియో గోర్

  • Aug 19, 2026 16:15 IST

    అమరావతి: రాజకీయాల్లో తన వారసురాలిని ప్రకటించిన బొత్స

    • విజయనగరం జెడ్పీ చైర్మన్ బరిలో తన కుమార్తె ఉంటుందని బొత్స వెల్లడి

    • త్వరలో జరిగే జెడ్పీ ఎన్నికల్లో బొత్స అనూష పోటీ చేస్తుందని ప్రకటన

  • Aug 19, 2026 16:00 IST

    కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

    • రూ.13,041 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

    • నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

    • గూడూరు-గుమ్మిడిపుండి 3, 4వ లైన్లకు ఆమోదం

    • ముజఫర్‌పూర్‌-సీతామర్హి-సోన్‌బర్సా హైవేకు ఆమోదం

    • నాలుగు లైన్ల హైవేకు రూ.3,591 కోట్ల వ్యయం

  • Aug 19, 2026 15:55 IST

    YCP హయాంలో జరిగిన గ్రూప్‌-1 పరీక్షల్లో అక్రమాలు: సీఎం చంద్రబాబు

    • గ్రూప్‌-1 నియామకాలపై సీఎం చంద్రబాబు ప్రజంటేషన్‌

    • అభ్యర్థుల ప్రతిభ చూసి ఉద్యోగాలు ఇవ్వలేదు: సీఎం చంద్రబాబు

    • ఎందరో విద్యార్థుల జీవితాశయం.. సివిల్స్‌, గ్రూప్స్‌: సీఎం చంద్రబాబు

    • గ్రూప్‌-1 పరీక్షలకు లక్షా 14 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు: సీఎం చంద్రబాబు

    • 17 దశల్లో గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేశారు: సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం..

  • Aug 19, 2026 15:50 IST

    వెలుగొండ నిర్వాసితులను గొడ్డలి పార్టీ మోసం చేసింది: మంత్రి డోలా

    • పూర్తికాని ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత జగన్‌కే చెల్లింది: మంత్రి డోలా

    • వెలుగొండకు శంకుస్థాపన చేసిన చంద్రబాబే తిరిగి ప్రారంభిస్తున్నారు: మంత్రి డోలా

    • ఇచ్చిన హామీ మేరకు మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాం: మంత్రి డోలా

    • నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేయాలని కోరుతున్నా: మంత్రి డోలా

  • Aug 19, 2026 15:45 IST

    హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలు

    • మరికాసేపట్లో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఉప్పరపల్లి కోర్టుకు తరలింపు

    • రెండు రోజుల కస్టడీలో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించిన పోలీసులు

  • Aug 19, 2026 15:35 IST

    భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • సెన్సెక్స్‌ 326, నిఫ్టీ 76 పాయింట్ల నష్టం

  • Aug 19, 2026 15:30 IST

    అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతలమ్మ ఘాట్ రోడ్డులో ప్రమాదం

    • ఘాట్ రోడ్డులో అదుపుతప్పి కొండను ఢీకొన్న ఎరువు లారీ

    • డ్రైవర్ మృతి, క్లీనర్‌కు తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న కొయ్యూరు పోలీసులు

  • Aug 19, 2026 15:25 IST

    వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర మొదలుపెడతా: వైఎస్ జగన్‌

    • స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: జగన్‌

    • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించడం లేదు: వైఎస్ జగన్‌

  • Aug 19, 2026 15:20 IST

    హైదరాబాద్: కూకట్‌పల్లి భాగ్య నగర్ కాలనీలో ఓయో హోటళ్లపై పోలీసులు దాడి

    • హోటల్స్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం

    • పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు

    • ఆరుగురు నిర్వాహకులు, నలుగురు కస్టమర్స్, ఇద్దరు మహిళల అరెస్ట్

  • Aug 19, 2026 15:15 IST

    రాయదుర్గం పోలీసులకు రాజేంద్రనగర్ కోర్టు నోటీసులు

    • పోక్సో కేసులో నిందితుడిని చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు

    • రిమాండ్ సమయంలో గాయాలను చూపించిన న్యాయవాది

    • తక్షణమే నిందితుడిని విడుదల చేయాలని కోర్టు ఆదేశం

    • వేధింపులపై పోలీసులకు కోర్టు షోకాజ్‌ నోటీసులు జారీ

  • Aug 19, 2026 15:00 IST

    ఢిల్లీ: కొనసాగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ

    • AICC చీఫ్ ఖర్గే అధ్యక్షతన సమావేశం

    • పాల్గొన్న సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్‌

    • పాల్గొన్న సీఎంలు రేవంత్‌, డీకే శివకుమార్‌, సతీషన్‌, సుఖ్వీందర్‌ సింగ్‌

    • వచ్చే ఏడాది జరిగే 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

  • Aug 19, 2026 14:55 IST

    మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు

    • సీఎం పొంగులేటినా లేక రేవంతా.. అర్థం కావడం లేదు: సుస్మితా పటేల్

    • కొండా మురళి సహకారంతోనే రేవంత్ టీపీసీసీ చీఫ్ అయ్యారు

    • కొండా మురళికి MLC ఇస్తానని రేవంత్ ఇవ్వలేదు: సుస్మితా పటేల్

    • హామీ ఇవ్వలేదని రేవంత్ ప్రమాణం చేస్తారా?: సుస్మితా పటేల్

    పూర్తి కథనం..

  • Aug 19, 2026 14:30 IST

    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్‌ సంచలన వ్యాఖ్యలు

    • మూడు శాఖల్లో అవినీతి వివరాలు నాదగ్గర ఉన్నాయి: సీఎం విజయ్‌

    • అవినీతికి సంబంధించిన వివరాలు నా టేబుల్‌పైనే ఉన్నాయి: విజయ్

    • సమయం వచ్చినప్పుడు ఆ ఫైల్ తెరుస్తా: సీఎం విజయ్

    • ప్రజలకు ఎప్పుడు.. ఏం చెప్పాలో నాకు తెలుసు: సీఎం విజయ్

  • Aug 19, 2026 14:25 IST

    30 ఏళ్ల కల నెరవేరింది: వెలుగొండ నిర్వాసితులు

    • కూటమి ప్రభుత్వం చేసిన సాయం మర్చిపోలేం: నిర్వాసితులు

    • వెలుగొండ ప్రాజెక్టు జీవితంలో పూర్తవుతుందని అనుకోలేదు..

    • వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినందుకు ఆనందంగా ఉంది: నిర్వాసితులు

  • Aug 19, 2026 14:20 IST

    వెలుగొండ ప్రాజెక్టు పనులు క్రమపద్ధతిలో పూర్తి: మంత్రి నిమ్మల

    • వెలుగొండ నిర్వాసితుల 7కాలనీల్లో.. నాలుగింటిలో 100శాతం మౌలిక వసతులు పూర్తి

    • మిగిలిన మూడు కాలనీల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం: మంత్రి నిమ్మల రామానాయుడు

  • Aug 19, 2026 14:15 IST

    అమ‌రావ‌తి: ఏపీ మున్సిపల్‌ శాఖ 4వ స‌వ‌ర‌ణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

    • ఇక‌పై మేయ‌ర్, మున్సిప‌ల్ చైర్‌పర్సన్‌ల ఎంపికకు ప్రత్యక్ష ఎన్నికలు

    • ఇప్పటివరకూ మేయ‌ర్, మున్సిపల్‌ చైర్మన్లను ప‌రోక్ష పద్ధతిలో ఎన్నిక

  • Aug 19, 2026 14:10 IST

    ఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ

    • NTAలో సమగ్ర సంస్కరణల అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశం

    • పరీక్షల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థ అవసరం: సుప్రీంకోర్టు

    • NTAను సంస్థాగతంగా బలోపేతం చేయాలి: సుప్రీంకోర్టు

    • నీట్‌ పరీక్షల భద్రతకు శాశ్వత కమిటీ అవసరం: సుప్రీంకోర్టు

  • Aug 19, 2026 14:07 IST

    కరీంనగర్: ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటాం: బండి సంజయ్

    • కాంగ్రెస్ మాటలు నమ్మితే నట్టేట మునుగుతారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

    • ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంలో కాలేజీ యాజమాన్యాలు మోసపోయాయి: బండి సంజయ్

  • Aug 19, 2026 14:05 IST

    హైదరాబాద్: ముగిసిన నటి నిధి అగర్వాల్ ఈడీ విచారణ

    • బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రశ్నించిన ఈడీ

    • జీత్ విన్‌ సహా పలు బెట్టింగ్, గేమింగ్స్‌ యాప్స్ ప్రమోట్ చేసిన నిధి

    • ప్రమోట్ చేసిన యాప్స్ కాంట్రాక్టులు, రెమ్యునరేషన్‌పై ఈడీ ఆరా

  • Aug 19, 2026 14:00 IST

    వెలుగొండ నిర్వాసితులకు పరిహారం చెక్‌లు అందజేసిన చంద్రబాబు

    • అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో నిర్వాసితులను కలిసిన సీఎం చంద్రబాబు

    • రెండో విడత R&R పరిహారానికి సంబంధించిన చెక్కులను అందజేసిన సీఎం

    • 1,600 మంది నిర్వాసితులకు రూ.200 కోట్ల పంపిణీ

    • ఇప్పటికే తొలి విడతలో 2,560 మంది నిర్వాసితులకు రూ.318 కోట్ల పంపిణీ

  • Aug 19, 2026 13:56 IST

    భూములను కాజేసేందుకు ప్రభుత్వం కుట్రలు: హరీశ్ రావు

    • బద్వేల్‌లో 30 ఎకరాల భూముల కాజేసేందుకు కుట్ర: మాజీ మంత్రి హరీశ్ రావు

    • లక్షల ఎకరాలను 22-A కిందకు తెచ్చారు: హరీశ్ రావు

    • యాదాద్రి జిల్లాలో 40వేల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి : హరీశ్ రావు

    • 30 ఏళ్లుగా లేని నిబంధనలు ఇప్పుడెందుకు?: మాజీ మంత్రి హరీశ్ రావు

  • Aug 19, 2026 13:55 IST

    పెద్దపల్లి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని BRS విచ్ఛిన్నం చేసింది: మంత్రి తుమ్మల

    • BRS నిర్వాకంతో అన్నీ విధ్వంసానికి గురయ్యాయి: మంత్రి తుమ్మల

    • BRS నేతల విమర్శలకు బెదిరేది లేదు: మంత్రి తుమ్మల

    • పాలనను భ్రష్టుపట్టించి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు: తుమ్మల

    • శంకుస్థాపనలు, జీవోలు తప్ప.. BRS చేసిందేమీ లేదు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • Aug 19, 2026 13:53 IST

    నల్లగొండ: ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో ట్విస్ట్

    • స్కూల్‌లో విద్యార్థి చెడు ప్రవర్తనపై మందలించిన రూపారెడ్డి

    • కక్షతో, డబ్బుల కోసం రూపారెడ్డిని హత్య చేసిన టెన్త్ విద్యార్థి

    • హత్యకు పలువురు విద్యార్థుల సహకారం తీసుకున్న నిందితుడు

    • చేతులకు గ్లౌజ్‌ వేసుకుని హత్య, రూ.2లక్షలు, ఫోన్ అపహరణ

  • Aug 19, 2026 13:50 IST

    గాలే టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం

    • శ్రీలంకపై 165 పరుగుల తేడాతో భారత్ గెలుపు

    • స్కోర్లు: భారత్ 462&193, శ్రీలంక 284&206

    • రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్

    • రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 10 వికెట్లు తీసిన మానవ్ సుతార్

  • Aug 19, 2026 13:30 IST

    చెన్నై: విద్యార్థుల నిరసనలపై ఆంక్షలు..

    • విమర్శలతో వెనక్కి తగ్గిన విజయ్ సర్కర్

    • విద్యార్థుల ఆందోళనలపై ఆంక్షలను తొలగించిన ప్రభుత్వం

    • స్కూళ్లు, కాలేజీలకు ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకున్న సర్కార్

  • Aug 19, 2026 13:30 IST

    ఢిల్లీ: మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

    • సత్యేంద్ర జైన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరిన ఏసీబీ

    • ఢిల్లీ జలబోర్డు కుంభకోణం ఆరోపణలతో సత్యేంద్ర జైన్‌ను అరెస్టు చేసిన ఏసీబీ

  • Aug 19, 2026 13:08 IST

    అమరావతి: మండలి డిప్యూటీ చైర్మన్ మాధవరావు కామెంట్స్..

    • నాకు డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు

    • ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు

    • సభా నిర్వహణలో అందరూ నాకు సహకరించాలని కోరుతున్నా

    • ప్రజాస్వామ్యంలో శాసనసభ, శాసన మండలి కీలకం

    • శాసన మండలి గౌరవాన్ని కాపాడేందుకు పని చేస్తా: డిప్యూటీ చైర్మన్ మాధవరావు

  • Aug 19, 2026 13:03 IST

    అమరావతి: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వర్ల రామయ్య

    • రామయ్యతో ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ మోషేను రాజు

    • శాసనమండలి రేపటికి వాయిదా వేసిన చైర్మన్

  • Aug 19, 2026 12:50 IST

    బీజింగ్: ప్రభుత్వ ఏజెన్సీలకు చైనా సర్కార్ కీలక ఆదేశాలు

    • ప్రభుత్వ వ్యవస్థల్లో విండోస్‌ తొలగించండి: చైనా

    • విండోస్‌కు బదులు లైనెక్స్‌ వాడాలని సూచన

    • అమెరికా టెక్నాలజీపై ఆధారపడటానికి చెక్‌

  • Aug 19, 2026 12:38 IST

    ఢిల్లీ: ముగిసిన కేంద్రమంత్రివర్గ సమావేశం

    • మధ్యాహ్నం 3 గంటలకు వివరాలు వెల్లడించనున్న మంత్రి అశ్విని వైష్ణవ్

  • Aug 19, 2026 12:32 IST

    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రకటనలు

    • ప్రతి ఎమ్మెల్యేకు అధికారిక వాహనం కేటాయిస్తాం: విజయ్

    • ప్రతి ఎమ్మెల్యేకు నెలకు రూ.75వేల వాహన భత్యంతో పాటు రూ.25వేల అసిస్టెంట్ అలవెన్స్ ఇస్తాం: సీఎం విజయ్

    • ప్రజాప్రతినిధులు ఇతరులపై ఆధారపడకూడదు: విజయ్

    • ఆరోగ్య బీమా కింద ఇచ్చే వార్షిక కవరేజీ రూ.25లక్షలకు పెంపు: విజయ్

  • Aug 19, 2026 12:27 IST

    అమరావతి: ఫొటో జర్నలిస్ట్‌గా మారిన ఏపీ సీఎం చంద్రబాబు

    • ఫొటో జర్నలిస్టులందరినీ కలిపి గ్రూప్ ఫొటో తీసిన చంద్రబాబు

    • కెమెరా తీసుకుని తానే ఫొటో తీస్తానని చెప్పిన సీఎం

    • ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో సీఎంను కలిసిన ఫొటో జర్నలిస్టులు

    • ఫొటో జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

  • Aug 19, 2026 12:18 IST

    అమరావతి: ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, రమాదేవి నియామకం

    • గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకానికి గవర్నర్ అనుమతి

    • గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

    • కాసేపట్లో ప్రమాణస్వీకారం చేయనున్న వర్ల రామయ్య, రమాదేవి

  • Aug 19, 2026 12:16 IST

    హైదరాబాద్: ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

    • బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈడీ ముందుకు నిధి అగర్వాల్

  • Aug 19, 2026 12:16 IST

    హైదరాబాద్: మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు బెయిల్

    • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

    • రూ.25వేల పూచీకత్తుతో 2 బాండ్లు సమర్పించాలని ఆదేశం

    • ప్రతి శుక్రవారం కూకట్‌పల్లి పీఎస్‌లో హాజరుకావాలని షరతు

  • Aug 19, 2026 11:39 IST

    అమరావతి: ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావు

    • మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు చైర్మన్ ప్రకటన

    • మాదవరావును సభాఅధ్యక్ష స్థానం వరకూ తీసుకెళ్లిన వైసీపీ సభ్యులు

    • మాధవరావుకు వైసీపీ సభ్యుల అభినందనలు

    • డిప్యూటి చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉన్న కూటమి పార్టీల సభ్యులు

  • Aug 19, 2026 10:51 IST

    IND vs SL: పట్టు బిగిస్తున్న శ్రీలంక బ్యాటర్లు

    • అర్ధ సెంచరీ చేసిన ధనుంజయ డి సిల్వా

    • 127 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సిల్వా

  • Aug 19, 2026 10:50 IST

    విజయవాడ: 10వ రోజుకు చేరిన జూనియర్ డాక్టర్ల సమ్మె

    • అత్యవసర సేవలు కూడా నిలిపివేసిన జూడాలు

    • ప్రభుత్వాస్పత్రుల్లో ఇబ్బందులు పడుతున్న రోగులు

    • తమ సమస్యలు పరిష్కరించాలని జూడాలు డిమాండ్

  • Aug 19, 2026 10:50 IST

    బెజవాడలో భారీ కార్పొరేట్ మోసం

    • తప్పుడు సమాచారంతో యూనియన్ బ్యాంక్‌కు రూ.24కోట్ల టోకరా

    • యూనిట్లు పెట్టకుండానే షెల్ కంపెనీల ద్వారా లోన్ నిధుల మళ్లింపు

    • తనిఖీల్లో రూ.23.85కోట్ల సరుకుకు రూ.25లక్షల నిల్వల గుర్తింపు

    • CBIకి ఫిర్యాదు చేసిన యూనియన్ బ్యాంక్ AGM శ్రీకాంత్ పాత్రో

    • లోన్ తీసుకున్న ఓంకార విజయలక్ష్మి స్ట్రయిప్స్‌పై CBI కేసు

  • Aug 19, 2026 10:47 IST

    వైసీపీ సభ్యుల నిరసనలతో ఏపీ శాసన మండలి వాయిదా

    • ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డ మండలి

    • మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ వాయిదా తీర్మానం

    • వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్

    • చైర్మన్ పోడియం దగ్గర వైసీపీ ఆందోళన

    • మెడలో నల్ల కండువాలతో సభకు వచ్చిన వైసీపీ సభ్యులు

  • Aug 19, 2026 09:59 IST

    జమ్మూకశ్మీర్‌‌లో ఘోర ప్రమాదం

    • రైసీ వద్ద లోయలో పడిన వాహనం

    • మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన

    • ప్రమాదంలో ముగ్గురి మృతి, మరికొందరికి గాయాలు

  • Aug 19, 2026 09:56 IST

    IND vs SL: తొలి టెస్టు ఐదో రోజు ప్రారంభమైన ఆట

    • 37 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోర్ 92/4

    • ప్రస్తుతం క్రీజులో ధనుంజయ(37), సోనాల్(27)

    • శ్రీలంక టార్గెట్ 280

  • Aug 19, 2026 09:56 IST

    కశ్మీర్‌కు 10 వేల మంది ఉగ్రవాదులను పంపాం: పాక్ మతబోధకుడు

    • బహావల్‌నగర్‌లో ఆగస్టు 14న ఓ సమావేశంలో వ్యాఖ్యలు

    • ఎల్‌ఈటీ అధినేత 10 వేల మంది ఉగ్రవాదులను పంపించాడని వెల్లడి

    • ఇప్పటికే ఎల్‌ఈటీపై అమెరికా నిషేధం

    • ఎల్‌ఈటీ చీఫ్‌పై భారత్‌లోనూ కేసులు

  • Aug 19, 2026 09:54 IST

    భారత్‌ గేమ్‌ప్లాన్‌తో విజయం ఖాయమని చెప్పలేము

    • ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే

    • భారత్‌ 10 వికెట్లు తీయడానికి వాన అడ్డం పడొచ్చు: భోగ్లే

  • Aug 19, 2026 09:54 IST

    నష్టాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు

    • 100 పాయింట్ల(77,118) దిగువన కదలాడుతోన్న సెన్సెక్స్

    • 30 (24, 111) పాయింట్ల దిగువన నిఫ్టీ

  • Aug 19, 2026 09:54 IST

    అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ హత్యకు కుట్ర

    • మహిళకు ఆరేళ్ల జైలు శిక్ష

  • Aug 19, 2026 09:50 IST

    హోర్ముజ్ జలసంధి తెరిచే ఉంది: ట్రంప్

    • ఇరాన్‌తో ఎలాంటి చర్చలకు ప్రణాళికలు లేవు: ట్రంప్

  • Aug 19, 2026 09:50 IST

    ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు తెంచుకున్న UAE

    • తమపై క్షిపణి దాడికి ప్రతీకారంగా UAE చర్యలు

    • దాడిలో తమ ప్రమేయం లేదన్న ఇరాన్

  • Aug 19, 2026 09:49 IST

    కెనడా-అమెరికా మధ్య కీలక ఒప్పందం

    • కెనడా నుంచి 20 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల దిగుమతిపై అవగాహనకు వచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి

  • Aug 19, 2026 09:49 IST

    ఇద్దరు ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన ఫ్రాన్స్

    • ఇరాన్‌లో ఫ్రాన్స్ దౌత్యవేత్తలపై దాడికి నిరసనగా చర్యలు

  • Aug 19, 2026 09:43 IST

    హిమాచల్‌ప్రదేశ్‌లో భూప్రకంపనలు

    • చంబా, కంగ్రా ప్రాంతాల్లో కంపించిన భూమి

    • రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.6గా నమోదు

  • Aug 19, 2026 09:42 IST

    హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్

    • కోకాపేట్‌లోని హరీశ్ రావు నివాసం వద్ద పోలీసుల మోహరింపు

    • సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు హరీష్ రావు పిలుపు

  • Aug 19, 2026 09:40 IST

    న్యూయార్క్ అటార్నీ జనరల్ అభ్యర్థిగా సరితా కోమటిరెడ్డికి ట్రంప్ మద్దతు

    • ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు

    • న్యూయార్క్ అటార్నీ జనరల్‌ లటీషియా జేమ్స్‌తో పోటీ పడనున్న సరిత

  • Aug 19, 2026 09:39 IST

    హైదరాబాద్: బీజేపీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నేతలపై రాజాసింగ్ ఆగ్రహం

    • జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు లేకపోవడం బాధాకరం: రాజాసింగ్

    • తెలంగాణ నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం తప్ప.. చేసిందేమీలేదు: రాజాసింగ్

    • గ్రూప్ రాజకీయాల వల్లే తెలంగాణకు చోటు దక్కలేదు: రాజాసింగ్

    • తెలంగాణలో అధికారంలోకి రావాలంటే విభేదాలు పక్కనపెట్టాలి: రాజాసింగ్

  • Aug 19, 2026 09:28 IST

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

    • తిరుమలేశుడిని దర్శించుకున్న సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ మంత్రి రోజా, నటులు ప్రభు, తిరువీర్, తమిళనాడు మాజీ మంత్రి కడంబూర్ రాజు

  • Aug 19, 2026 09:27 IST

    నంద్యాల: ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

    • పాడి గేదెను చంపిన పెద్దపులి, భయాందోళనలో ప్రజలు

    • పెద్దపులి కదలికలపై నిఘా ఉంచామన్న అటవీ అధికారులు

  • Aug 19, 2026 09:23 IST

    మూడో స్థానంపై చర్చలను కొట్టిపడేసిన దేవదత్ పడిక్కల్

    • అలాంటి చర్చలు అనవసరం: పడిక్కల్

    • ఎప్పుడు, ఎక్కడ ఆడే అవకాశం వచ్చినా సిద్ధమే: పడిక్కల్

  • Aug 19, 2026 08:46 IST

    ఏపీలో విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ

    • ప్రజావాణిని చట్ట సభల్లో వినిపించేందుకే రాజకీయ పార్టీ: విజయసాయి

    • శ్రీవారి దర్శనం తర్వాత తిరుమలలో రాజకీయ పార్టీపై ప్రకటన

    • ఈనెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళిక: విజయసాయిరెడ్డి

  • Aug 19, 2026 08:42 IST

    నేడు మూడవ రోజు ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

    • వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్-1 అక్రమాలపై ఇవాళ అసెంబ్లీలో కీలక చర్చ

    • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి ఫరూఖ్

    • శాసనమండలిలో రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

    • పురపాలక, గ్రంథాలయాల సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

  • Aug 19, 2026 08:40 IST

    కోల్‌కతాలోని ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం

    • 9 మంది బంగ్లాదేశీయుల మృతి, పలువురికి గాయాలు

    • వైద్యం కోసం కోల్‌కతా వచ్చిన బంగ్లాదేశీయులు

  • Aug 19, 2026 08:38 IST

    గద్వాల: బీచుపల్లి దగ్గర కారును ఢీకొట్టిన ఆటో

    • రెండేళ్ల బాలుడు సహా 8 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • Aug 19, 2026 07:59 IST

    నల్గొండ: కొండమల్లెపల్లిలో వీడిన నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య మిస్టరీ

    • అదే స్కూల్‌కు చెందిన టెన్త్ విద్యార్థులు వంశీ, అనిల్ హత్య చేసినట్టు నిర్ధారణ!

    • ఈ నెల 11న దారుణ హత్యకు గురైన రూపారెడ్డి

    • వారం రోజులుగా సంచలనం సృష్టించిన రూపారెడ్డి హత్య కేసు

    • డబ్బుల కోసం రూపారెడ్డిని హత్య చేసిన విద్యార్థులు!

    • హత్య తర్వాత గోవా పారిపోయిన నిందితులు వంశీ, అనిల్

  • Aug 19, 2026 07:55 IST

    వరంగల్: నర్సంపేట మండలం ముత్తోజిపేటలో కారు బీభత్సం

    • అదుపుతప్పి రోడ్డు పక్కన ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

    • ఒకరి మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు, రెండు పశువుల మృతి

  • Aug 19, 2026 07:52 IST

    వికారాబాద్: పరిగి మున్సిపాలిటీ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

    • గంజాయి సీజ్, ముగ్గురి అరెస్ట్

    • బిహార్ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయం, కేసు నమోదు

  • Aug 19, 2026 07:49 IST

    హైదరాబాద్: నేడు గాంధీభవన్‌లో ప్రజలతో మంత్రి అడ్లూరి ముఖాముఖి

    • ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించనున్న అడ్లూరి లక్ష్మణ్

  • Aug 19, 2026 07:47 IST

    సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో పెను విషాదం

    • కుప్పకూలిన గోల్డ్ మైన్స్, 30 మంది మృతి

    • శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు

    • కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

  • Aug 19, 2026 07:37 IST

    ఉ.10 గంటలకు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభం

    • సభ ప్రారంభంలోనే ప్రశ్నోత్తరాలు, మంత్రుల సమాధానాలు

    • ఉ.11 గంటలకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక

    • ప్రైవేట్ వర్సిటీలు, ఉన్నత విద్య నియంత్రణ మండలి సవరణ ఆర్డినెన్సులు సభ ముందు ఉంచనున్న మంత్రి నారా లోకేష్

  • Aug 19, 2026 07:25 IST

    హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్‌ను షేర్ చేసిన ట్రంప్

    • మ్యాప్‌లో హోర్ముజ్‌ను యూఎస్‌కు చెందినదిగా పేర్కొన్న వైనం

    • హోర్ముజ్‌ తమ నియంత్రణలో ఉందని ఇప్పటికే పలుమార్లు చెప్పిన ట్రంప్

  • Aug 19, 2026 07:23 IST

    హైదరాబాద్‌లో ప్రస్తుతం బంగారం రేట్స్ ఇవీ

    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,900

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,910

    • 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,16,930

  • Aug 19, 2026 07:15 IST

    తూ.గో.: డాక్టర్ ప్రియాంక మృతి కేసు

    • నేడు నిందితులను కస్టడీకి తీసుకోనున్న పోలీసులు

    • నేటి నుంచి ఈ నెల 21 వరకు విచారణ

    • మద్యం మత్తులో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన నిందితులు

    • ప్రియాంక కేసులో నిందితులను ప్రశ్నించనున్న పోలీసులు

  • Aug 19, 2026 07:14 IST

    హైదరాబాద్‌: ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసు

    • నేడు రెండోరోజు పోలీసు కస్టడీకి ఉదయ్‌ కృష్ణారెడ్డి

    • మహిళా IPSపై లైంగిక వేధింపుల కేసులో విచారణ

  • Aug 19, 2026 07:13 IST

    నేడు నిజామాబాద్‌లో మహేష్‌గౌడ్‌, సీతక్క పర్యటన

    • దుబ్బాకలో SIR సమీక్ష సమావేశానికి హాజరు

    • అనంతరం పార్టీ కేడర్‌తో మహేష్‌గౌడ్‌, సీతక్క మీట్‌

  • Aug 19, 2026 07:13 IST

    హనుమకొండ: నేడు కొండా సుస్మిత పటేల్‌ కీలక సమావేశం

    • పరకాల నుంచి పోటీకి సిద్ధమైన సుస్మిత పటేల్‌

    • నేడు గీసుకొండలో సుస్మిత పటేల్‌ కీలక భేటీ

    • పరకాలపై తాడోపేడో తేల్చుకునేందుకు కసరత్తు

  • Aug 19, 2026 07:12 IST

    మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ ఘనవిజయం

    • దక్షిణాఫ్రికాపై 6-1 తేడాతో భారత జట్టు గెలుపు

    • ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం

  • Aug 19, 2026 07:02 IST

    రేపటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన

    • ఈనెల 30 వరకు యూకే, అమెరికాలో సీఎం పర్యటన

    • ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలను సందర్శించనున్న సీఎం

    • లండన్ బిజినెస్ స్కూల్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • ఈనెల 23న లండన్ నుంచి అమెరికాకు సీఎం రేవంత్

    • హార్వర్డ్, MIT యూనివర్సిటీలను సందర్శించనున్న సీఎం

    • వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో భేటీకానున్న రేవంత్

    • న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్ & గ్రీట్

    • 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

    • 30న హైదరాబాద్‌ చేరుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • Aug 19, 2026 07:01 IST

    ఢిల్లీ: నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం

    • ఖర్గే అధ్యక్షతన జరగనున్న CWC సమావేశం

    • CWCకి హాజరుకానున్న సోనియా, రాహుల్‌, ప్రియాంక

    • కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం

    • CWC సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి

    • విద్యార్థుల ఆందోళన మీద కేంద్రంపై ఒత్తిడికి వ్యూహం

    • రామ మందిర విరాళాల అంశంపై కార్యాచరణ

    • వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై CWC సమీక్ష

  • Aug 19, 2026 07:00 IST

    ఢిల్లీ: ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్‌ భేటీ

    • ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం

  • Aug 19, 2026 07:00 IST

    నేడు రాజమండ్రిలో వైసీపీ నేతలతో జగన్‌ సమావేశం

    • సంస్థాగత అంశాలు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ

  • Aug 19, 2026 06:59 IST

    హైదరాబాద్‌: నేడు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ జనరల్‌ కౌన్సిల్‌ భేటీ

    • 24 క్రాప్ట్స్‌ అనుబంధ సంఘాల బైలాస్‌ సవరణపై చర్చ

    • డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌పై చర్యల అంశంపైనా చర్చ

  • Aug 19, 2026 06:59 IST

    వరంగల్‌: నేడు నర్సంపేట బంద్‌కు ఎర్రబెల్లి దయాకర్ పిలుపు

    • పెద్ది సుదర్శన్‌ రెడ్డి విగ్రహం తొలగింపుపై ఆగ్రహం

    • బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులను ఖండిస్తూ బంద్‌కు పిలుపు

  • Aug 19, 2026 06:58 IST

    హైదరాబాద్‌: నేడు టిమ్స్‌కు BRS బృందం

    • హరీశ్‌రావు, తలసాని నేతృత్వంలో పర్యటన

    • టిమ్స్‌ను పరిశీలించనున్న బీఆర్ఎస్ బృందం

  • Aug 19, 2026 06:58 IST

    నేడు తిరుమలలో SSD టోకెన్ల జారీ నిలిపివేత

    • శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్ల నిలిపివేత

    • టోకెన్లు లేకుండా నేరుగా దర్శనం చేసుకోవచ్చన్న టీటీడీ

  • Aug 19, 2026 06:57 IST

    విశాఖపట్నం: నేటి నుంచి RSS అఖిల భారత సమన్వయ బైఠక్‌

    • గుడిలోవలో 21వ తేదీ వరకు కొనసాగనున్న సమన్వయ సమావేశం

    • బైఠక్‌కు హాజరుకానున్న మోహన్‌ భాగవత్‌, దత్తాత్రేయ

    • 32 అనుబంధ సంస్థల కార్యక్రమాలపై సమీక్ష

    • పంచ పరివర్తన్‌ అమలుపై కీలక చర్చ

    • సామాజిక, జాతీయ భద్రతా అంశాలపై సమీక్ష

  • Aug 19, 2026 06:56 IST

    నేడు పురుషుల హాకీ ప్రపంచకప్‌లో కీలక పోరు

    • ఈరోజు భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌ డూ ఆర్‌ డై మ్యాచ్‌

    • పాకిస్థాన్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితిలో భారత్‌

    • నెక్ట్స్‌ రౌండ్‌కు వెళ్లాలంటే ఇరు జట్లకు ఇది డూ ఆర్‌ డై మ్యాచ్‌

    • ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

  • Aug 19, 2026 06:56 IST

    నేడు చెన్నైకి ఏపీ సీఎం చంద్రబాబు

    • రేపు చెన్నైలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి