Share News

కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: మల్లు రవి

ABN , Publish Date - Aug 19 , 2026 | 04:36 PM

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా సుస్మిత వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా ఖండించారు.

కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: మల్లు రవి
Mallu Ravi On Konda Sushmita

ఢిల్లీ: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా సుస్మిత వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. పార్టీకి సంబంధించిన లక్ష్మణ రేఖను ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని మల్లు రవి స్పష్టం చేశారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్న తర్వాత ఆమెపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


గతంలోనూ షబ్బీర్ అలీ, కొండా మురళీ మధ్య వివాదం తలెత్తినప్పుడు వారితో చర్చించి సమస్యను పరిష్కరించినట్లు మల్లు రవి తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నాయకుల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించినట్లు మల్లు రవి తెలిపారు.

ఈ క్రమంలోనే కొండా సుస్మిత వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మీనాక్షీ నటరాజన్‌ ఆరా తీశారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ను కోరారు. దీంతో సుస్మితపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.


Also Read:

రాయదుర్గం పోలీసులకు రాజేంద్రనగర్ కోర్టు నోటీసులు

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు.. ఈడీ విచారణకు నిధి అగర్వాల్‌

Updated Date - Aug 19 , 2026 | 05:03 PM