రాయదుర్గం పోలీసులకు.. రాజేంద్రనగర్ కోర్టు నోటీసులు
ABN , Publish Date - Aug 19 , 2026 | 04:21 PM
ఫోక్సో కేసులో నిందితుడిని వేధించి చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణల నేపథ్యంలో రాయదుర్గం పోలీసులకు రాజేంద్రనగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: పోక్సో కేసులో నిందితుడిని వేధించి చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణల నేపథ్యంలో రాయదుర్గం పోలీసులకు రాజేంద్రనగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. రిమాండ్ సమయంలో నిందితుడి ఒంటిపై గాయాలను న్యాయవాది కోర్టుకు చూపించారు. దీంతో రాజేంద్రనగర్ కోర్టు తక్షణమే నిందితుడిని విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. నిందితుడిని వేధింపులకు గురిచేసిన అంశంపై షోకాజ్ నోటీసులు జారీచేసింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని రాయదుర్గం పోలీసులను కోర్టు ఆదేశించింది. నిందితుడి రిమాండ్ రిజెక్ట్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి
కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మల్లు రవి
ఖర్గే అధ్యక్షతన ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన అగ్రనేతలు