Share News

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు.. ఈడీ విచారణకు నిధి అగర్వాల్‌

ABN , Publish Date - Aug 19 , 2026 | 03:02 PM

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో సినీ నటి నిధి అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు.. ఈడీ విచారణకు నిధి అగర్వాల్‌
Nidhi Agarwal

హైదరాబాద్, ఆగస్టు 19: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో సినీ నటి నిధి అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన విచారణలో ఆమె ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ప్రమోషనల్ కార్యక్రమాలకు సంబంధించి కుదుర్చుకున్న కాంట్రాక్టులు, వాటి కాలపరిమితి, ప్రచారం కోసం అందించిన కంటెంట్, సోషల్ మీడియా లేదా ఇతర వేదికల ద్వారా నిర్వహించిన ప్రమోషన్స్‌పై కూడా ఈడీ అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం.


ఇక బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు నిధి అగర్వాల్‌కు అందిన రెమ్యునరేషన్‌పై కూడా ఈడీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఒక్కో ప్రమోషన్‌కు ఎంత మొత్తంలో పారితోషికం తీసుకున్నారు, ఆ మొత్తాలు ఏ విధంగా చెల్లించబడ్డాయి, ఎవరి నుంచి చెల్లింపులు వచ్చాయి వంటి అంశాలపై అధికారులు వివరాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు లేదా వారికి సంబంధించిన వ్యక్తులు నిధి అగర్వాల్ బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసిన డబ్బు లావాదేవీలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఆ చెల్లింపులు ప్రమోషనల్ కాంట్రాక్టులకు సంబంధించినవేనా, వాటికి సంబంధించిన పత్రాలు ఉన్నాయా అనే అంశాలపై కూడా విచారణ జరిగినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్

మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

Updated Date - Aug 19 , 2026 | 03:48 PM