తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై కీలక జీవో.. 5 షోలకు ప్రభుత్వం అనుమతి..
ABN , Publish Date - Aug 19 , 2026 | 05:03 PM
తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉదయం 8 నుంచి రాత్రి ఒంటిగంట వరకు 5 షోలకు అనుమతి ఇచ్చింది.
ఇంటర్‌నెట్ డెస్క్: తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 7.1 సౌండ్, 2K/4K స్క్రీన్లకు స్పెషల్ కేటగిరీ వర్తించనుంది. ప్రతి థియేటర్‌లో 25 శాతం నాన్-ప్రీమియం సీట్లు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 8 నుంచి రాత్రి ఒంటిగంట వరకు 5 షోలకు అనుమతి ఇచ్చింది.
చిన్న సినిమాలకు ప్రతి రోజు ఒక షో తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. రూ.100 కోట్లు పైబడిన సినిమాలకు ప్రభుత్వం సూపర్ హైబడ్జెట్ హోదా కల్పించింది. తొలి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత శాతాన్ని కార్మికుల సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వాలని షరతు పెట్టింది. కార్మికుల సంక్షేమ నిధికి రూ.కోటి వరకు విరాళం తప్పనిసరి చేసింది.
ఇవి కూడా చదవండి
కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: మల్లు రవి
రాయదుర్గం పోలీసులకు.. రాజేంద్రనగర్ కోర్టు నోటీసులు