-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International Breaking Live Updates of 14th May 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 14 , 2026 | 07:16 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 14, 2026 21:46 IST
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం
ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ
పక్షపాతం ఆరోపణలు తలెత్తకుండా ఉండేందుకే విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన
-
May 14, 2026 20:35 IST
ఐపీఎల్ 2026: ముంబై టార్గెట్ 201
పంజాబ్ స్కోర్: 200/ 8
అర్ధసెంచరీతో రాణించిన ప్రభ్‌సిమ్రాన్(57)
4 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్
-
May 14, 2026 20:27 IST
శ్రీ సత్యసాయి: భవిష్యత్తులో RDTకి అండగా ఉంటాం: మంత్రి లోకేష్
RDT అంటే సంస్థ మాత్రమే కాదు.. గొప్ప సేవా వ్యవస్థ: మంత్రి లోకేష్
RDT ద్వారా అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..
యువగళం పాదయాత్రలో RDT సేవలు ప్రత్యక్షంగా చూశా: మంత్రి లోకేష్
-
May 14, 2026 20:26 IST
కామారెడ్డి: నాటు తుపాకీతో కాల్చుకొని వ్యక్తి ఆత్మహత్య
లింగంపేట మండలం మోతెలో ఘటన
భార్యతో గొడవపడ్డ ఇంద్రజిత్ సింగ్ అనే వ్యక్తి
ఇంట్లో ఉన్న నాటు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 14, 2026 20:09 IST
తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు
2026-27 ఏడాది నుంచే నూతన విధానం
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో ఇంటర్ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్
ఫస్టియర్‌లో 15 మార్కులు.. సెకండియర్‌లో 15 మార్కులకు ప్రాక్టికల్స్
-
May 14, 2026 19:27 IST
హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ACB కోర్టు సమన్లు
A1 కేటీఆర్, A2 అరవింద్‌కుమార్, A3 BLN రెడ్డికి నోటీసులు
ఈ-కార్ రేసు కేసు చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు
-
May 14, 2026 19:26 IST
తెలంగాణ: చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్
ట్రాన్స్‌పోర్టు, హమాలీల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి ఉత్తమ్
యాసంగిలో 85 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం..
ధాన్యం తరలింపునకు వాహనాలు ఏర్పాటు..
వరి రైతులు అధైర్యపడొద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
May 14, 2026 19:25 IST
జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్
10 రోజుల కస్టడీ కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసుల పిటిషన్
నిందితులకు నాంపల్లి కోర్టు నోటీసులు
రేపు కౌంటర్ దాఖలు చేయాలని నిందితుల తరపు లాయర్లకు ఆదేశం
-
May 14, 2026 19:24 IST
తెలంగాణ: ములుగు జిల్లాకు నీటిపారుదల శాఖ నిధులు
మిషన్ కాకతీయ కింద రూ.30.95 కోట్లు మంజూరు
పెద్దచెరువు కాల్వల ఆధునికీకరణకు గ్రీన్‌సిగ్నల్
ములుగు, ఘన్‌పూర్ కాల్వల అభివృద్ధికి ఆమోదం
-
May 14, 2026 19:04 IST
ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్
టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
తొలుత బ్యాటింగ్ చేయనున్న పంజాబ్
-
May 14, 2026 18:19 IST
శ్రీలంకలో జరగనున్న ట్రై సిరీస్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
కెప్టెన్‌గా తిలక్ వర్మ, వైస్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్
భారత-ఏ జట్టులో సూర్యవంశీ వైభవ్ చోటు
ఈ సిరీస్‌లో తలపడనున్న భారత్, అఫ్గానిస్తాన్, శ్రీలంక జట్టు
-
May 14, 2026 17:59 IST
విశాఖ: గాజువాక శనివాడ దగ్గర ప్రమాదం
అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టిన కారు..
నవ వధువు మృతి, వరుడికి గాయాలు
-
May 14, 2026 17:58 IST
ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్ష కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు
ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విచారణ
తాజాగా తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
-
May 14, 2026 17:55 IST
పోలవరం: KRMB త్రిసభ్య కమిటీ నిర్ణయంతో నీటి కేటాయింపులు
తెలంగాణకు సాగర్ నుంచి 15 టీఎంసీల కేటాయింపు
శ్రీశైలం నుంచి 5 టీఎంసీల కేటాయింపు
మొత్తంగా తెలంగాణకు 20 టీఎంసీల కేటాయింపు
ఏపీకి నాగార్జునసాగర్ నుంచి 10 టీఎంసీల కేటాయింపు
-
May 14, 2026 17:35 IST
సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
కాన్వాయ్‌లో మూడు వాహనాలు తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
-
May 14, 2026 16:51 IST
అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలి: సీఎం చంద్రబాబు
ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలి: సీఎం చంద్రబాబు
-
May 14, 2026 16:50 IST
రాయలసీమకు భారీగా డిఫెన్స్ ప్రాజెక్టులు
రేపు పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన
డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో రూ.15,803 వేల కోట్లతో మరో 12 ప్రాజెక్టులు
కేంద్రమంత్రి రాజ్‌నాథ్, సీఎం చంద్రబాబు భూమిపూజ
-
May 14, 2026 16:49 IST
ఢిల్లి: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
నీట్ పేపర్ లీక్ కేసులో ఐదుగురి అరెస్ట్
నిందితులను కోర్టులో హాజరుపరచిన CBI
-
May 14, 2026 16:04 IST
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
790 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
277 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
May 14, 2026 15:38 IST
తెలంగాణ: బండి భగీరథ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
మధ్యంతర బెయిల్‌పై రేపు హైకోర్టు నిర్ణయం
ముందస్తు బెయిల్‌పై విచారణ వారంపాటు వాయిదా
-
May 14, 2026 15:32 IST
తెలంగాణ: సింగరేణిలో మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం
13 దశాబ్దాల చరిత్రలో తొలిసారి డంపర్లు నడపనున్న మహిళలు
ఓసీ గనుల్లో 100 టన్నుల భారీ డంపర్ల నిర్వహణకు అవకాశం
భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ పూర్తిచేసిన 13 మంది మహిళలు
-
May 14, 2026 15:02 IST
ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు సీఎం విజయ్ శుభవార్త
ప్రభుత్వ ఉద్యోగుల DA 58 శాతం నుంచి 60 శాతానికి పెంపు
ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి DA పెంపు
-
May 14, 2026 15:01 IST
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
పొదుపు చర్యలపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ
కొద్దిరోజుల పాటు మంత్రుల విదేశీ పర్యటనల రద్దు
వారానికి ఒకరోజు నో వెహికల్ డే
మంత్రులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు లేదా EV, సైకిల్ వినియోగించాలని నిర్ణయం
-
May 14, 2026 14:47 IST
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కీలక నిర్ణయం
తన కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించుకోవాలని నిర్ణయం
ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంలో భాగంగా వాహనాలను తగ్గించాలని నిర్ణయం
ఇప్పటి వరకూ ఉన్న వాహనాల్లో కొన్నిటిని తగ్గించుకొనే అవకాశం
-
May 14, 2026 14:39 IST
పల్నాడు: నాదెండ్ల మండలం సాతులూరు దగ్గర రోడ్డు ప్రమాదం
బైక్, ప్రైవేట్ బస్సు ఢీ.. ఇద్దరి మృతి
మృతులు అశోక్ (34), సీతారామయ్య (21)గా గుర్తింపు
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 14, 2026 14:37 IST
ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
హైకోర్టు CJ కుమారుడి రిసెప్షన్‌కు హాజరుకానున్న రేవంత్
అధిష్ఠానాన్ని కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
May 14, 2026 14:36 IST
మూడో దశ 'SIR'పై ఈసీ ప్రకటన
16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో దశ 'SIR'
మూడో దశలో 3.94 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు
ఏపీలో జులై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన
తెలంగాణలో జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన
-
May 14, 2026 14:34 IST
హైదరాబాద్: ఆసిఫ్‌నగర్‌లో అగ్నిప్రమాదం
ఫర్నిచర్ గోడౌన్‌లో చెలరేగిన మంటలు
అపార్ట్‌మెంట్‌లో షోరూం ఉండటంతో అప్రమత్తమైన ఫ్లాట్ల వాసులు
మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది
-
May 14, 2026 14:26 IST
అమరావతి: ఉబెర్ టీమ్‌తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమావేశం
టెక్నాలజీ, మొబిలిటీ, ఇన్నోవేషన్, భవిష్యత్ నగర రవాణా విధానాలపై చర్చలు
-
May 14, 2026 14:17 IST
కేరళం కాంగ్రెస్‌లో మొదలైన అసంతృప్తి
సీఎంగా సతీశన్ ఎంపికపై కాంగ్రెస్‌లో మరో వర్గం ఆగ్రహం
సీఎంగా సతీశన్ నియామకంపై రమేష్ చెన్నితల వర్గం అసంతృప్తి
సీఎం ప్రకటనకు ముందు రమేష్ చెన్నితలకు రాహుల్ ఫోన్
ఆ తర్వాత కాంగ్రెస్ నేతలకు అందుబాటులో లేని రమేష్ చెన్నితల
-
May 14, 2026 13:20 IST
హైదరాబాద్: గాంధీ భవన్‌కు చాకలి ఐలమ్మ వారసులు
మహేష్ గౌడ్‌కు వినతి పత్రం ఇచ్చిన ఐలమ్మ కుటుంబ సభ్యులు
చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించిన ప్రభుత్వం
శ్వేత మరో కుటుంబం నుంచి వచ్చిందన్న ఐలమ్మ కుటుంబ సభ్యులు
ప్రభుత్వాన్ని శ్వేత మోసం చేసిందంటున్న ఐలమ్మ కుటుంబ సభ్యుల ఆరోపణ
శ్వేతను మహిళా కమిషన్ పదవి నుంచి తొలగించాలని కుటుంబసభ్యుల డిమాండ్
-
May 14, 2026 13:15 IST
తైవాన్ విభేదాలపై జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు
తైవాన్ విభేదాలు అమెరికా, చైనా మధ్య ఘర్షణలకు దారితీయెచ్చు: జిన్‌పింగ్
సమస్య పరిష్కరిస్తే దౌత్య సంబంధాలు స్థిరంగా కొనసాగుతాయి: జిన్‌పింగ్
తైవాన్ సమస్య పరిష్కారం కాకపోతే యుద్ధం వచ్చే అవకాశం: జిన్‌పింగ్
-
May 14, 2026 13:05 IST
మధ్యప్రదేశ్: దేవాస్‌లో బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు
నలుగురి మృతి, పలువురికి గాయాలు
-
May 14, 2026 13:05 IST
కేరళం సీఎం సతీశన్‌కు అభినందనలు తెలిపిన కేసీ వేణుగోపాల్
నేను కాంగ్రెస్‌వాదిని, హైకమాండ్ నిర్ణయంతో ఏకీభవిస్తా: కేసీ
-
May 14, 2026 13:04 IST
నల్లగొండ: మిర్యాలగూడ రైల్వేస్టేషన్ దగ్గర నిలిచిపోయిన చెన్నై ఎక్స్‌ప్రెస్
విద్యుత్ సమస్యతో రెండున్నర గంటలుగా రైలు నిలిపివేత
-
May 14, 2026 13:03 IST
కేసీ వేణుగోపాల్ నాకు మంచి మిత్రుడు: వి.డి. సతీశన్
కేసీ, రమేష్ చెన్నితల సహకారంతోనే యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: సతీశన్
-
May 14, 2026 12:08 IST
వీడిన ఉత్కంఠ.. కేరళం సీఎంగా వి.డి సతీశన్
సతీశన్ పేరును ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
-
May 14, 2026 11:58 IST
నల్లగొండ జిల్లాలో మంత్రుల బృందం పర్యటన
చెట్లచెన్నారం దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్
-
May 14, 2026 11:56 IST
కర్నూలు: ఆదోని - సిరుగుప్ప రహదారిపై ఇటేగల్ వద్ద కూలిన భారీ వృక్షం
కర్ణాటక సరిహద్దు వద్ద నిలిచిపోయిన వాహన రాకపోకలు
రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల ట్రాఫిక్ జామ్
-
May 14, 2026 11:41 IST
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన వి. హనుమంతరావు
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, నేతలు
-
May 14, 2026 11:39 IST
యూపీలో గాలివాన బీభత్సం.. షాకింగ్ వీడియో..
-
May 14, 2026 11:38 IST
యూపీలో 89కి చేరిన మృతుల సంఖ్య..
-
May 14, 2026 11:30 IST
కరీంనగర్: PMJ జ్యువెలరీ చోరీ కేసులో వీడిన మిస్టరీ
సుబోధ్ సింగ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
రూ.82 లక్షలు విలువచేసే 161.4 తులాల బంగారం స్వాధీనం
చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు
ది గోల్డెన్ థీఫ్ పేరుతో ఆపరేషన్
-
May 14, 2026 11:23 IST
యూపీలో ఈదురుగాలులతో కూడిన వర్ష బీభత్సం
పలు జిల్లాల్లో నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
-
May 14, 2026 11:03 IST
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సముద్ర మట్టానికి 5.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం
48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో వర్షాలు
గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు
మరోవైపు చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
మే 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులను తాకే అవకాశం
-
May 14, 2026 11:01 IST
అమరావతి: పొదుపు చర్యల్లో భాగంగా సీఎం కాన్వాయ్ కుదింపు
4 వాహనాలతో సచివాలయానికి సీఎం చంద్రబాబు
సీఎం భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు
ప్రధాని మోదీ పిలుపుతో సీఎం చంద్రబాబు, మంత్రుల కాన్వాయ్ తగ్గింపు
-
May 14, 2026 10:55 IST
ఢిల్లీలో దారుణం
ప్రైవేట్ బస్సులో మహిళపై గ్యాంగ్ రేప్
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
ఇద్దరు నిందితులు అరెస్ట్, బస్సు స్వాధీనం
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు
-
May 14, 2026 10:54 IST
హనుమకొండ: ఎల్కతుర్తిలో దారుణం..
కల్లుగీత కార్మికుడు గొడిశాల విజయ్‌పై కత్తితో దాడి చేసిన అఖిల్
దాడికి వివాహేతర సంబంధమే కారణంగా అనుమానం
విజయ్ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 14, 2026 10:34 IST
మహబూబాబాద్: కురవిలో దారుణం
భర్త కొట్టిన దెబ్బలకు తాళలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న నిండు గర్భిణీ రమణ
కొంత కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 14, 2026 10:17 IST
హైదరాబాద్: కొంపల్లి దగ్గర డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
రూ.2.58 లక్షలు విలువ చేసే ఎండీఎంఏ, ఓజీ కుష్, చరస్ డ్రగ్స్ స్వాధీనం
బెంగళూరులో కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అమ్ముతున్న ముఠా
-
May 14, 2026 10:16 IST
సింహాచలం హుండీ లెక్కింపులో చేతివాటం
నగదును దొంగలించిన సేవకుడు రాంబాబుపై కేసు నమోదు చేసిన గోపాలపట్నం పోలీసులు
ఎస్పీఎఫ్ తనిఖీల్లో బయటపడిన రూ.17,100 నగదు
-
May 14, 2026 10:16 IST
నల్లగొండ: చర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర బైక్‌ను ఢీకొన్న కంటైనర్
అక్కడికక్కడే మృతి చెందిన బైకర్
మృతుడు నిడమనూరు మండలం రాజన్నగూడెంకు చెందిన బొల్లం లింగయ్యగా గుర్తింపు
-
May 14, 2026 10:14 IST
ఢిల్లీ: రాహుల్ గాంధీతో భేటీ అయిన ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్
సాయంత్రం కేరళం సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై స్పష్టత
కేరళంలో సాయంత్రం కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం
సమావేశంలో శాసనసభ పక్షనేతను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు
సీఎం అభ్యర్థి రేసులో కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేష్ చెన్నితాల
-
May 14, 2026 09:59 IST
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
సెన్సెక్స్ 417, నిఫ్టీ 150 పాయింట్లకుపైగా లాభం
-
May 14, 2026 09:44 IST
భద్రాచలం శ్రీరాముడిని దర్శించుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరావు
మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం... ఆలయంలో ప్రత్యేక పూజలు
ఎన్టీఆర్ పాలనలో రామాలయం అభివృద్ధి చేసే భాగ్యం దక్కింది: మంత్రి
నలబై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో భద్రాద్రి రాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి: తుమ్మల
-
May 14, 2026 09:29 IST
మంత్రి నారాయణ కాన్వాయ్‌లోని వాహనాలు సగానికి కుదింపు
రెండు వాహనాల్లోనే మంత్రి నారాయణ ప్రయాణం
-
May 14, 2026 09:09 IST
అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త ఆంక్షలు
ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళిక విడుదల
ఆర్థిక ఆత్మరక్షణలో భాగంగా పెట్రోల్ వినియోగం తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపు
ప్రభుత్వ క్వార్టర్ల నుంచి ఆఫీసులకు వెళ్లేందుకు మెట్రో స్టేషన్ల మీదుగా ప్రత్యేక బస్సులు
మెట్రో, బస్సుల్లో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు 10% అదనపు రవాణా భత్యం
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వ శాఖల పని వేళల్లో మార్పులకు ప్రతిపాదన
-
May 14, 2026 08:41 IST
హైదరాబాద్‌లో నేడు బంగారం, వెండి ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,62,010
22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,48,510
కిలో వెండి రూ.3,20,100
-
May 14, 2026 08:34 IST
కరీంనగర్‌లో బండి భగీరథ్ పోస్టర్ల కలకలం
భగీరథ్ కనిపించట్లేదంటూ వెలసిన పోస్టర్లు
-
May 14, 2026 08:34 IST
హైదరాబాద్: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో దర్యాప్తు
బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు
గచ్చిబౌలి, మొయినాబాద్‌లో సాంకేతిక ఆధారాలు సేకరణ
-
May 14, 2026 08:15 IST
కరీంనగర్: PMJ జ్యువెలరీ చోరీ కేసు
ఇప్పటికే పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు
చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు
-
May 14, 2026 08:00 IST
అమరావతి: లోకేశ్ కాన్వాయ్‌లోని వాహనాలు సగానికి కుదింపు
రెండు వాహనాల్లోనే మంత్రి నారా లోకేశ్ ప్రయాణం
-
May 14, 2026 07:45 IST
పంచదార ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం
పంచదార ఎగుమతులను నిలిపివేసిన కేంద్రం
చక్కెర ధరలు పెరగకుండా ఉండేందుకు కేంద్రం నిర్ణయం
సెప్టెంబర్ 30 వరకు పంచదార ఎగుమతులు నిలిపివేత
-
May 14, 2026 07:29 IST
నేడు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా
ఏపీ విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేసిన KRMB
-
May 14, 2026 07:29 IST
ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దళాల దాడులు
20 కీలక ప్రాంతాలపై 800 డ్రోన్లతో రష్యా దళాల దాడులు
రష్యా దాడుల్లో ఆరుగురు మృతి, పలువురికి గాయాలు
కీవ్, ఎల్విన్, ఒడెసా నగరాలపై రష్యా దాడులు చేసింది: జెలెన్‌స్కీ
-
May 14, 2026 07:16 IST
హైదరాబాద్: బండి భగీరథ్ బెయిల్‌పై నేడు హైకోర్టులో విచారణ
పోక్సోకేసు కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్
బండి భగీరథ్‌కు మరోసారి సైబరాబాద్ పోలీసుల నోటీసులు
కరీంనగర్‌లో భగీరథ్ బంధువుకు నోటీసులు అందజేత