Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 08 , 2026 | 06:00 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 08, 2026 21:46 IST

    ఆసిఫాబాద్‌: జైనూర్‌లో దివ్యాంగ బాలికపై ఇద్దరు మైనర్ల అత్యాచారం

    • పోక్సో కేసు నమోదు

  • Jul 08, 2026 21:43 IST

    హస్త కళాకారులకు ఇచ్చినమాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్‌

    • నరసాపురం, శ్రీకాళహస్తిలో‌ హస్త కళాకారులకు ఉచిత వైద్య శిబిరాలు

    • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సూచనతో హస్త కళాకారుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేలా క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు

  • Jul 08, 2026 21:03 IST

    రైతు సంస్థల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

    • MSP కొనుగోలు కేంద్రాల్లో FPOలకు అవకాశం

    • యూరియా పంపిణీలో FPOలకు ప్రాధాన్యం

    • ఎరువులు, విత్తనాల లైసెన్స్‌లు మంజూరు

    • FPOల ద్వారా కొనుగోలు వ్యవస్థ విస్తరణకు గ్రీన్ సిగ్నల్

  • Jul 08, 2026 20:08 IST

    తడిసి మోపెడవుతున్న ఏఐ ఖర్చులు.. మైక్రోసాఫ్ట్‌ పొదుపు చర్యలు

    • ఓపెన్ ఏఐ, క్లాడ్ ఏఐ మోడల్స్‌ను పక్కన పెట్టిన సంస్థ

    • సొంతంగా అభివృద్ధి చేసుకున్న మోడల్స్‌ను వాడుతున్న వైనం

  • Jul 08, 2026 20:06 IST

    అమరావతి: పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో వచ్చే శనివారం ప్రత్యేక డ్రైవ్

    • అదనపు, ముందస్తు అపాయింట్‌మెంట్లు సులభతరం కోసం కార్యక్రమం

    • దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్లు, రీషెడ్యూలింగ్ సౌకర్యం కోసం వెబ్‌సైట్‌ www.passportindia.gov.in సందర్శించాలని సూచన

  • Jul 08, 2026 20:05 IST

    అమరావతి: కనీస మద్దతు ధరకు పొగాకు కొనాల్సిందే: సీఎం చంద్రబాబు

    • రైతులను ఇబ్బంది పెట్టే కంపెనీలపై కఠినచర్యలు: చంద్రబాబు

    • టొబాకో బోర్డుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

  • Jul 08, 2026 20:01 IST

    హైదరాబాద్‌: ఐటీ శాఖ పనితీరుపై CS సంజయ్ జాజు సమీక్ష

    • ప్రజా సేవల మెరుగుదలపై అధికారులకు కీలక ఆదేశాలు

    • 'మీ సేవ' సేవలను మరింత బలోపేతం చేయాలని ఆదేశం

    • పౌరులకు వేగవంతమైన సేవలే లక్ష్యం: CS సంజయ్‌ జాజు

    • ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు వేగవంతం చేయాలి: CS సంజయ్ జాజు

    • ప్రజా సేవల డిజిటల్ విస్తరణపై ప్రత్యేక దృష్టి: CS సంజయ్‌ జాజు

  • Jul 08, 2026 19:49 IST

    ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల వసతులపై కేంద్రం సమీక్ష

    • అమిత్‌ షా, రామ్మోహన్‌ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం

    • ఎయిర్‌పోర్టుల్లో భద్రతా ఏర్పాట్లు, ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థల పనితీరుపై సుదీర్ఘ చర్చ

    • దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ATRS ఏర్పాటుకు ఆదేశాలు

  • Jul 08, 2026 19:43 IST

    రేపు వరంగల్‌కు గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లా

    • పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్‌ శుక్లా

  • Jul 08, 2026 19:36 IST

    హైదరాబాద్: పీజీఐ 2.0 ర్యాంకింగ్‌లో తెలంగాణకు భారీ మెరుగుదల

    • 31వ స్థానం నుంచి 26వ స్థానానికి తెలంగాణ

    • PGI స్కోరు 552.5 నుంచి 599.7కు పెరుగుదల

    • ఆకాంక్షి-1 స్థాయి నుంచి ప్రచేష్ట-3 విభాగంలోకి రాష్ట్రం

    • విద్యా రంగంలో సీఎం రేవంత్‌రెడ్డి సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు

    • జనగాం, మంచిర్యాల జిల్లాలకు ఉత్తమ్-3 గుర్తింపు

  • Jul 08, 2026 19:27 IST

    గుంటూరు: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

    • వైద్య ఆరోగ్య శాఖలో లైంగిక వేధింపులపై శాఖాపరమైన విచారణ

    • మహిళా ఉద్యోగిపై పైఅధికారి వేధింపులు

    • ABN కథనంతో ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశం

  • Jul 08, 2026 19:12 IST

    నేటి రాత్రి మరిన్ని దాడులు జరగవచ్చు: ట్రంప్

    • ఇరాన్‌కు మరో వార్నింగ్ ఇచ్చిన యూఎస్ అధ్యక్షుడు

    • ఇరాన్ పాలకుల తీరు చెత్తగా ఉందని మండిపాటు

    • నాటో సమావేశాల సందర్భంగా ఇరాన్‌పై ట్రంప్ ఆగ్రహం

  • Jul 08, 2026 19:05 IST

    రష్యాపై డ్రోన్ దాడులను ఉధృతం చేసిన ఉక్రెయిన్

    • 2026లో రష్యా చమురు, గ్యాస్ కేంద్రాలపై 194 డ్రోన్ దాడులు

    • గతేడాదితో పోలిస్తే దాడులు 11 రెట్ల పెరుగుదల

    • రష్యా ఇంధన మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యంగా దాడులు

    • సరిహద్దుకు వందల, వేల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలపై కూడా దాడులు

  • Jul 08, 2026 19:02 IST

    నంద్యాల: ఆళ్లగడ్డకు చేరుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

    • భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆళ్లగడ్డకు రాక

    • ఎమ్మెల్యే అఖిలప్రియను ఆమె ఇంటికి తీసుకెళ్లిన పోలీసులు

  • Jul 08, 2026 18:26 IST

    అమరావతి: కారుణ్య మరణాలకు మార్గం సుగమం

    • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం చర్యలు

    • కారుణ్య మరణాలకు సంబంధించిన మార్గదర్శకాలకు ఆమోదం తెలిపిన మంత్రి సత్యకుమార్.

    • వైద్యులు, రోగుల కుటుంబ సభ్యుల నిర్ణయాలకు చట్టబద్ధత

  • Jul 08, 2026 18:25 IST

    నంద్యాల: ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు

    • అహోబిలం తలనీలాల వివాదంపై భూమా, గంగుల కుటుంబాల మాటల యుద్ధం

    • అహోబిలంలో చర్చకు రావాలన్న అఖిలప్రియ

    • అహోబిలం వెళ్లేందుకు బయల్దేరిన గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

    • అహోబిలం నుంచి ఆళ్లగడ్డకు బయలుదేరిన అఖిలప్రియ

    • గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి నివాసానికి అఖిలప్రియ వెళ్లనున్నట్లు సమాచారం

    • ఆళ్లగడ్డలో భారీగా మోహరించిన పోలీసులు

  • Jul 08, 2026 18:11 IST

    రేపు ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన

    • ఆస్ట్రేలియాలో మూడోసారి పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు

    • ఆస్ట్రేలియా పీఎం ఆంటోనీ అల్బనీస్‌తో భేటీకానున్న మోదీ

    • ప్రవాస భారతీయులతో సమావేశంకానున్న ప్రధాని మోదీ

  • Jul 08, 2026 18:05 IST

    ఢిల్లీ: వ్యభిచారం ఆరోపణల కేసులో కీలక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

    • భర్త హోటల్ రికార్డులు, కాల్ డేటా కోరేందుకు భార్యకు అనుమతి

    • ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

    • హోటల్ రికార్డులు, కాల్ డేటాను సీల్డ్ కవర్‌లో ఫ్యామిలీ కోర్టుకు సమర్పించాలని ఆదేశం

    • భర్తపై వ్యభిచారం, క్రూరత్వం ఆరోపణలతో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన భార్య

  • Jul 08, 2026 17:57 IST

    హైదరాబాద్: కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్‌తో సీఎం రేవంత్ భేటీ

    • తెలంగాణలో పెట్టుబడులు పెంచేందుకు కెనడా ఆసక్తి

    • మూసీ రివర్‌ఫ్రంట్, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీపై కీలక చర్చ

    • గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు కెనడా కంపెనీలకు సీఎం ఆహ్వానం

    • హరిత ఆర్థిక వ్యవస్థ, సౌర విద్యుత్ రంగాల్లో కెనడా సహకారం కోరిన సీఎం

  • Jul 08, 2026 17:53 IST

    ఫిఫా ప్రపంచ కప్: అమెరికాపై ఇరాన్ సంచలన ఆరోపణలు

    • అమెరికా నిబంధనలు అతిక్రమించింది: ఇరాన్

    • అమెరికా ప్రత్యర్థి జట్లను బెదిరించింది: ఇరాన్

    • ఫిఫా ప్రపంచ కప్‌లో అమెరికా మోసం చేసింది: ఇరాన్

  • Jul 08, 2026 17:52 IST

    హైదరాబాద్‌: వాట్సాప్‌ డీపీ పేరుతో సైబర్‌ నేరగాళ్ల మోసం

    • రూ.4.70 కోట్ల వాట్సాప్‌ ఫ్రాడ్‌ కేసును ఛేదించిన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో

    • కంపెనీ ఎండీ పేరుతో నకిలీ వాట్సాప్‌ ప్రొఫైల్‌ సృష్టించి మోసం

    • ఖమ్మం కు చెందిన దోసపాటి కృష్ణసాయి, మండవల్లి శివనాగరాజు అరెస్ట్‌

  • Jul 08, 2026 17:38 IST

    ఢిల్లీ: పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకున్న 9 ఆయిల్ ట్యాంకర్లపై భారత్ ఫోకస్

    • గల్ఫ్‌లో దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం

    • ట్యాంకర్లకు సురక్షిత మార్గం కల్పించేందుకు ఇరాన్‌తో చర్చలపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన

    • ముడి చమురు, ఎల్పీజీతో ఉన్న నౌకల కదలికలను నిశితంగా పర్యవేక్షిస్తోన్న కేంద్ర ప్రభుత్వం

  • Jul 08, 2026 17:21 IST

    అక్రమాస్తులు కూడబెట్టడంలో భీమ్‌రెడ్డి తెలివిగా వ్యవహరించారు: ఏసీబీ

    • భీమ్‌రెడ్డి కూడబెట్టిన ఆస్తుల్లో ఎక్కువభాగం బినామీ పేర్లపైనే రిజిస్ట్రేషన్లు: ఏసీబీ

    • బినామీలు ఎప్పుడైనా తిరగబడే ప్రమాదం ఉందని భీమ్‌రెడ్డి జాగ్రత్త పడ్డారు: ఏసీబీ

    • బినామీల నుంచి క్యాన్సిలేషన్‌ డీడ్లను భీమ్‌రెడ్డి ముందే రాయించుకున్నారు: ఏసీబీ

  • Jul 08, 2026 17:20 IST

    డీఎస్పీ భీమ్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలకాంశాలు

    • భీమ్‌రెడ్డి నుంచి 2 మెమొరీ కార్డులు, డైరీ స్వాధీనం

    • డైరీలో వెలుగుచూసిన ఆస్తుల వివరాలు

    • భీమ్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.300 కోట్ల పైనే

    • మెమొరీ కార్డులోని వివరాల ఆధారంగా ఆస్తుల పత్రాలను సీజ్‌ చేసిన ఏసీబీ

    • ‘నేను ఇవ్వాల్సినవి.. నాకు రావాల్సినవి’ అంటూ డైరీలో రాసుకున్న డీఎస్పీ

  • Jul 08, 2026 17:15 IST

    క్రాంతికుమార్‌ సూసైడ్‌ కేసులో నిందితుడిగా సీఐ నాగరాజు

    • కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు

    • క్రాంతికుమార్‌ ఫోన్‌ను FSLకి పంపాలని పోలీసులు పిటిషన్

  • Jul 08, 2026 17:14 IST

    నంద్యాల: ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం

    • అహోబిలం తలనీలాల వివాదంపై భూమా, గంగుల కుటుంబాల మాటల యుద్ధం

    • గంగుల నానికి ఎమ్మెల్యే అఖిలప్రియ సవాల్‌

    • అహోబిలంలో చర్చకు రావాలన్న అఖిలప్రియ

    • ఆరోపణలు నిజమైతే రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటా: అఖిలప్రియ

    • ఆరోపణలు నిరూపించలేకపోతే గంగుల నాని ఇంటిమీదకు వెళ్తా: అఖిలప్రియ

    • ఇప్పటికే అహోబిలం చేరుకున్న అఖిలప్రియ

  • Jul 08, 2026 16:33 IST

    దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ భారీగా సోదాలు

    • ఐసిస్ (ISIS), ఏక్యూఐఎస్ (AQIS) ఉగ్రవాద కార్యకలాపాల ప్రచారంపై ఎన్‌ఐఏ దాడులు

    • భారత్‌లో హింసాత్మక జిహాద్ ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కుట్రపై దర్యాప్తు ముమ్మరం

  • Jul 08, 2026 16:32 IST

    ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల

    • అగ్రస్థానానికి ఎగబాకిన ఇషాన్ కిషన్

    • రెండో స్థానానికి పడిపోయిన అభిషేక్ శర్మ

    • ర్యాంకింగ్స్‌లో గణనీయంగా పురోగతి సాధించిన ఇంగ్లండ్ ప్లేయర్లు

    • 8వ స్థానంలో జాకబ్ బెథెల్

  • Jul 08, 2026 16:29 IST

    జోసెఫ్‌ రావణ్‌ వ్యవహారంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు

    • జోసెఫ్‌ రావణ్‌, ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ఎవరిస్తున్నారు?: విజయసాయి రెడ్డి

    • జోసెఫ్‌ రావణ్‌, ప్రకాశ్ రాజ్‌ ఏ సంస్కృతికి వారసులు?: విజయసాయి రెడ్డి

    • వారి తండ్రులు, తాతలు ఎవరు? మూలాలు ఎక్కడ?: విజయసాయి రెడ్డి

    • తప్పుగా మాట్లాడినవారికి చట్టం, సమాజం బుద్ధి చెప్పాలి: విజయసాయి రెడ్డి

  • Jul 08, 2026 16:04 IST

    భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 1677 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

    • 517 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ

    • పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

  • Jul 08, 2026 16:03 IST

    హైదరాబాద్: మియాపూర్‌లో భర్త హత్య కేసు ఛేదించిన పోలీసులు

    • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య సత్యవతి

    • భార్య సహా ప్రియుడు మధుసూదన్ రెడ్డి, మరో నిందితుడి అరెస్ట్

    • భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఊపిరాడకుండా చేసి చంపేసిన నిందితులు

    • శవాన్ని మహారాష్ట్రకు తరలించి పెట్రోల్ పోసి తగులబెట్టిన నిందితులు

    • 7 నెలలు పోలీసులను తప్పుదోవ పట్టించిన భార్య

    • కాల్ డేటా, సీసీకెమెరా ఫుటేజీ ఆధారాలతో కేసు ఛేదించిన పోలీసులు

  • Jul 08, 2026 15:55 IST

    ట్రంప్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో కలకలం

    • గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు 3% వరకు పతనం

    • ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాములకు రూ.2,240 తగ్గుదల

    • వెండి కిలోకు రూ.7,307 మేర పడిపోయింది

    • బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 6.5% పెరిగి 78.9 డాలర్లకు చేరింది

    • వెస్ట్ టెక్సాస్ క్రూడ్ 6.49% పెరిగి 75.01 డాలర్ల వద్ద ట్రేడింగ్

  • Jul 08, 2026 15:27 IST

    విశాఖ: బోటు ప్రమాదంపై త్రిసభ్య కమిటీ నివేదిక

    • గల్లంతైన ఆరుగురు జాలర్లు మృతి చెందినట్లు నిర్ధారణ

    • ప్రభుత్వానికి నివేదిక అందజేసిన నిజ నిర్ధారణ కమిటీ

  • Jul 08, 2026 15:26 IST

    సమోసాల కోసం రైలును ఆపిన లోకో పైలట్

    • మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఘటన

    • రైలు దిగి సమీప దుకాణంలో సమోసాలు కొనుగోలు చేసిన లోకో పైలట్

    • ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్

    • లోకో పైలట్ నిర్లక్ష్యంపై నెటిజన్ల ఆగ్రహం

    • ఘటనపై విచారణకు ఆదేశించిన రైల్వే అధికారులు

  • Jul 08, 2026 15:19 IST

    సంగారెడ్డి: హరీశ్ రావు సినిమా డైలాగ్‌లు కొడుతున్నారు: జగ్గారెడ్డి

    • నీళ్లు ఇవ్వని వాళ్లని ఉరి వేయాలి అంటున్న హరీశ్ రావు.. కూలిపోయే డ్యాం కట్టినవాళ్లని ఏం చేయాలో చెప్పాలి: జగ్గారెడ్డి

    • కేసీఆర్ మేనల్లుడు కాబట్టే హరీశ్ మంత్రి అయ్యారు: జగ్గారెడ్డి

    • రేవంత్‌ను చూసి హరీశ్ రావు భయపడుతున్నారు: జగ్గారెడ్డి

  • Jul 08, 2026 15:18 IST

    సీఎం రేవంత్‌ను కలిసిన గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధులు

    • గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణపై సీఎం రేవంత్‌కు సంస్థ ప్రతినిధుల నివేదిక

  • Jul 08, 2026 15:17 IST

    కామారెడ్డి: బాన్సువాడ ఎస్సీ గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య

    • హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఇంటర్‌ విద్యార్థిని అమృత సూసైడ్‌

    • హాస్టల్ ఎదుట బాలిక కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన

  • Jul 08, 2026 15:16 IST

    జనగామ: మంత్రి సురేఖ ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

    • నేను ఏ తప్పూ చేయలేదు.. వివరణ ఎందుకు ఇస్తా?: కడియం

    • ప్రోటోకాల్‌కు లోబడే పనిచేస్తా: కడియం

  • Jul 08, 2026 15:15 IST

    హైదరాబాద్: రేపు తెలంగాణకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా

    • బీబీనగర్‌ ఎయిమ్స్‌ను సందర్శించనున్న జేపీ నడ్డా

    • రేపు మధ్యాహ్నం తెలంగాణ బీజేపీ ఆఫీస్‌కు జేపీ నడ్డా

  • Jul 08, 2026 15:09 IST

    ఢిల్లీ: టీమిండియా ఓటమిపై స్పందించిన అనిల్ కుంబ్లే

    • తుది జట్టులో మార్పులు వద్దు: కుంబ్లే

    • విఫలమైన తిలక్ వర్మను కొనసాగించాలి: కుంబ్లే

    • మన బౌలర్ల ఆటతీరు మార్చుకోవాల్సి ఉంది: కుంబ్లే

  • Jul 08, 2026 15:08 IST

    అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్

    • రైతు జేఏసీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశం

    • సీఆర్డీఏ అధికారులతో కలిసి రైతుల సమస్యలపై చర్చ

    • గ్రామ కంఠం, FSI, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు సహా పలు అంశాల ప్రస్తావన

    • గ్రామాల్లో రోడ్లు, ట్రాఫిక్, చెత్త సమస్యలపై చర్చ

    • సమావేశ నిర్ణయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు

  • Jul 08, 2026 15:01 IST

    ఈపీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్

    • జూలై 15 నాటికి ఖాతాల్లో వార్షిక వడ్డీ జమ

    • 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్ల వడ్డీ జమ

    • 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ

    • ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత వారంలోగా వడ్డీ జమ

    • ఆటోమేటెడ్ వ్యవస్థతో వడ్డీ జమ ప్రక్రియ వేగవంతం

  • Jul 08, 2026 14:46 IST

    మరోసారి పెరిగిన ముడిచమురు ధరలు

    • 78.73 డాలర్లకు చేరిన బ్యారెల్‌ ముడిచమురు ధర

  • Jul 08, 2026 14:34 IST

    ఇరాన్‌తో తమకు డీల్ వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

    • ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందని వ్యాఖ్య

    • ఇరాన్‌ పదే పదే తప్పులు చేస్తోంది: ట్రంప్

    • హోర్ముజ్‌ జలసంధి వద్ద 3 నౌకలపై ఇరాన్‌ దాడి చేసింది: ట్రంప్‌

  • Jul 08, 2026 14:30 IST

    భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    • 1700 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్

    • 500 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ

    • పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన మార్కెట్లు

  • Jul 08, 2026 14:29 IST

    తమిళనాడు సీఎం విజయ్‌కు కొత్త సవాలు

    • ఎన్నికల విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు నోటీసుల జారీ

    • విజయ్ తన ప్రచార ప్రసంగం ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారని పిటిషనర్ల ఆరోపణ

  • Jul 08, 2026 14:14 IST

    మధ్యప్రదేశ్‌: మాండ్లా జిల్లాలో తీవ్ర విషాదం

    • ఆటోరిక్షాలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

    • పుట్టిన కాసేపటికే నలుగురు శిశువుల మృతి

    • అంబులెన్స్‌ రాకపోవడంతో గర్భిణిని ఆటోలో తరలిస్తుండగా ఘటన

    పూర్తి కథనం..

  • Jul 08, 2026 13:54 IST

    కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ

    • సత్తుపల్లి బ్లాక్-3ని సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి

    • తాడిచర్ల-2 కేటాయింపుపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు

    • అదే తరహాలో సత్తుపల్లి బ్లాక్-3ని సింగరేణికి ఇవ్వాలి: తుమ్మల

    • సింగరేణి విస్తరణకు సత్తుపల్లి బ్లాక్-3 కీలకం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • Jul 08, 2026 13:53 IST

    హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

    • 3 నెలలు నీటి పారుదలశాఖ మంత్రిగా అవకాశం ఇవ్వు: హరీశ్‌రావు

    • నీళ్లు రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: హరీశ్ రావు

    • రేవంత్‌రెడ్డికి మేం చాలు.. అసెంబ్లీలో ఏ అంశంపై చర్చకైనా సిద్ధం

    • రేవంత్‌రెడ్డికి గౌరవించే సంస్కృతి లేదు: హరీశ్ రావు

    • కేసీఆర్‌కు అసెంబ్లీలో ఛాంబర్‌ లేకుండా చేశారు: హరీశ్ రావు

  • Jul 08, 2026 13:33 IST

    ఈపీఎఫ్‌వో కొత్త పోర్టల్‌ ప్రారంభం

    • త్వరలో పీఎఫ్‌ వడ్డీ జమ ప్రక్రియ.. రూ.1.44 లక్షల కోట్ల వడ్డీ జమ

    • సభ్యులకు వేగవంతమైన సేవలే లక్ష్యం

    • ఆటోమేటెడ్‌ వ్యవస్థలతో సేవల మెరుగుదల

    • పీఎఫ్‌ క్లెయిమ్‌లు మరింత సులభతరం

    • రూ.5 లక్షల ఆటో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌.. జులై 15 నుంచి వడ్డీ జమ

  • Jul 08, 2026 13:07 IST

    హైదరాబాద్: ధరణి సిట్‌పై టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

    • ధరణిలో అక్రమాలు వాస్తవం: రాంచందర్‌రావు

    • ధరణితో పాటు భూ భారతిపైనా సిట్ విచారణ జరపాలి

    • భూ భారతిలో కూడా అవకతవకలు జరిగాయి: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

  • Jul 08, 2026 13:06 IST

    కేటీఆర్, హరీశ్ నిజమైన నాయకులు కాదు: ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి

    • దమ్ముంటే సిరిసిల్ల, సిద్దిపేట వదిలి మరో చోట పోటీ చేయాలి: యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి

    • రాజీనామా చేయాలని హరీశ్ రావుకు ఉబలాటంగా ఉంది: యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి

    • రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లాలని హరీశ్ ప్లాన్: ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి

  • Jul 08, 2026 12:47 IST

    ఇంతకంటే గొప్ప బర్త్ డే గిఫ్ట్ ఉండదు: గంగూలీ

    • నేడు భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ 54వ పుట్టిన రోజు

    • అతడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దాదా: ది సౌరభ్ గంగూలీ స్టోరీ’

    • బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్

    • దీనిపై స్పందిస్తూ భావోద్వేగానికి గురైన గంగూలీ

  • Jul 08, 2026 12:42 IST

    కాళేశ్వరంపై రేవంత్ నెగెటివ్ మైండ్‌సెట్‌తో ఉన్నారు: మాజీ మంత్రి హరీశ్ రావు

    • కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమంటే NDSA సాకు చెబుతున్నారు: మాజీ మంత్రి హరీశ్ రావు

    • మరి సమ్మక్క బ్యారేజీ మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదు?: హరీశ్ రావు

    • ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజీ దగ్గర లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉంది: హరీశ్ రావు

    • గోదావరి నీళ్లు తీసుకోవాలన్న కనీస సోయి లేదు: హరీశ్ రావు

    • చెరువులు నింపుకునే అవకాశం ఉన్నా.. నింపడం లేదు: మాజీ మంత్రి హరీశ్ రావు

  • Jul 08, 2026 12:41 IST

    ఢిల్లీ: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో టీ బీజేపీ నేతల బృందం భేటీ

    • తెలంగాణలో వడ్లు, బియ్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రికి విన్నపం

    • కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి వినతిపత్రం ఇచ్చిన టీ బీజేపీ బృందం

  • Jul 08, 2026 12:39 IST

    జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్‌పై ఐటీ శాఖకు ఫిర్యాదు

    • జడా శ్రవణ్ కుమార్‌ ఆదాయపన్ను ఎగవేశారంటూ ఐటీ శాఖకు సుమంత్ అనే వ్యక్తి ఫిర్యాదు

    • జడా శ్రవణ్ కుమార్‌పై బినామీ ఆస్తులు, ఆదాయపన్ను చట్టం కింద చర్యలు చేపట్టాలని కోరిన సుమంత్

  • Jul 08, 2026 11:54 IST

    సిద్దిపేట: కుక్కునూరుపల్లి తహసీల్దార్ సస్పెన్షన్

    • నిబంధనలకు విరుద్ధంగా 56 ఫైళ్లు ఆమోదించినట్టు ఆరోపణ

    • 448 ఎకరాల భూముల హక్కుల మార్పుపై చర్యలు

  • Jul 08, 2026 11:35 IST

    నిర్మల్: భైంసా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌పై విద్యార్థి దాడి

    • సెమిస్టర్ పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డ విద్యార్థి

    • ప్రశ్నించిన ప్రిన్సిపాల్‌పై విద్యార్థి దాడి, కేసు నమోదు

  • Jul 08, 2026 11:31 IST

    భువనగిరి : మాజీ MLA నరసింహారెడ్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

    • ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం

    • నిన్న భువనగిరి మాజీ MLA కొమ్మిడి నరసింహారెడ్డి మృతి

  • Jul 08, 2026 11:30 IST

    హైదరాబాద్: గాంధీభవన్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

    • ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను భర్తీచేయాలని నిరుద్యోగుల డిమాండ్

    • గాంధీ భవన్‌కు వస్తున్న మంత్రి వివేక్‌ని కలిసేందుకు రానున్న నిరుద్యోగులు

  • Jul 08, 2026 11:27 IST

    ప్రకాశం: ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఘర్షణ

    • వైఎస్సార్ జయంతి సందర్భంగా నివాళులర్పించే క్రమంలో గొడవ

    • మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్న వైసీపీ నేత

    • వర్గాలుగా విడిపోయి పురుషులు, మహిళల పరస్పర దాడులు

    పూర్తి కథనం..

  • Jul 08, 2026 11:16 IST

    అమరావతి నిర్మాణాలపై గొడ్డలి పార్టీ పోలికలు పొంతనలేనివి: మంత్రి నారాయణ

    • జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు: మంత్రి నారాయణ

    • జగన్ మాటలకు వైసీపీ నేతలే ఛీ కొడుతున్నారు: మంత్రి నారాయణ

    • మావిగన్ అంటే ఏ బస్సు ఎక్కాలని ప్రజలు నవ్వుకుంటున్నారు: మంత్రి నారాయణ

  • Jul 08, 2026 11:14 IST

    విజయవాడ: పాతబస్తీలో ముగిసిన NIA సోదాలు

    • ఉగ్రలింకుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లల్లో NIA తనిఖీలు

    • నిందితుల ఇళ్లల్లో డిజిటల్ డేటా సేకరించిన అధికారులు

    • నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లు తీసుకున్న NIA

  • Jul 08, 2026 10:43 IST

    దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న వర్షాలు

    • ఎల్లో అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణశాఖ

    • గత 24గంటల్లో 14 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

  • Jul 08, 2026 10:43 IST

    నిజామాబాద్: ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో చిరుత సంచారం

    • శ్రవణ్ అనే రైతు కోళ్ల ఫామ్‌కు వచ్చిన చిరుత

    • కుక్కల అరుపులతో వెనుదిరిగిన చిరుత

    • సీసీ కెమెరాలో రికార్డయిన చిరుత దృశ్యాలు

  • Jul 08, 2026 10:41 IST

    కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన

    • చరిత్రాత్మక పంబన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

    • 1000 ఏళ్ల పురాతన ఆలయ పునరుద్ధరణకు సహకరించిన భారత్

    • ఏరియల్ వ్యూ ద్వారా ఆలయాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

  • Jul 08, 2026 10:38 IST

    భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న వీవీఎస్ లక్ష్మణ్!

    • బీసీసీఐ కీలక నిర్ణయం

    • జింబాబ్వే పర్యటన, ఆసియా క్రీడలకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం

    • వరుస సిరీస్‌ల నేపథ్యంలో గంభీర్‌కు రెస్ట్ ఇవ్వనున్న బీసీసీఐ

    పూర్తి కథనం..

  • Jul 08, 2026 10:37 IST

    సూర్యాపేట: అర్వపల్లిలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

    • రాళ్లు, కర్రలతో ఇరువర్గాలు దాడి, కారు అద్దాల ధ్వంసం

    • కాంగ్రెస్‌లోని అసంతృప్తి నేతలు ఛలో గాంధీభవన్‌కు పిలుపు

    • అడ్డుకున్న MLA వర్గీయులు, పోలీసుల లాఠీచార్జ్

  • Jul 08, 2026 10:36 IST

    కడప: వైఎస్సార్ సీఎంగా చేసిన అభివృద్ధి ప్రతి గడపకూ చేరింది: షర్మిల

    • ఐదేళ్లలో వైఎస్సార్ అన్ని రంగాలవారికీ అభివృద్ధి ఫలాలు అందించారు: షర్మిల

    • వైఎస్సార్ చేసిన మేలును ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు: ఏపీపీసీసీ చీఫ్ షర్మిల

  • Jul 08, 2026 10:22 IST

    అమెరికా దాడులతో మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు

    • 2.7శాతం పెరిగి 72.40 డాలర్లకు చేరిన అమెరికా WTI క్రూడ్

  • Jul 08, 2026 09:40 IST

    కడప: రిమ్స్ డెంటల్ కాలేజీ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత

    • రాత్రి దోశలు తిన్న 20 మంది విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్

    • రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

  • Jul 08, 2026 09:30 IST

    పట్టిసీమ ఒట్టిసీమ అన్న జగన్.. ఇప్పుడేమంటారు?: మంత్రి నిమ్మల

    • రూ.1,300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ.. నేడు రూ.50వేల కోట్ల ఆదాయం: నిమ్మల

    • పాలన అనుభవం లేకపోవడం, ముందుచూపు లేకపోవడంతో జగన్ పట్టిసీమ వైపు చూడలేదు: నిమ్మల

  • Jul 08, 2026 09:15 IST

    ఏలూరు జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన

    • పట్టిసీమ ఎత్తిపోతల దగ్గర మోటార్లు ఆన్ చేసిన మంత్రి నిమ్మల

    • పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు విడుదల

    • ప్రాజెక్ట్ కుడి కాల్వలోకి 4,248 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన నిమ్మల

  • Jul 08, 2026 09:00 IST

    అమరావతి నిర్మాణ పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

    • ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ పనుల పురోగతిపై చర్చ

    • వర్షాకాల పనులపై అధికారులకు దిశానిర్దేశం

    • నిర్మాణ వేగం పెంచాలని మంత్రి నారాయణ ఆదేశం

    • లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలి: మంత్రి నారాయణ

  • Jul 08, 2026 08:50 IST

    తెలంగాణ ప్రజలు గర్వించే సందర్భం ఇది: కేటీఆర్

    • సాధించుకున్న స్వరాష్ట్రం సంపన్న రాష్ట్రంగా అవతరించింది: ఎక్స్‌లో కేటీఆర్

    • తెలంగాణ అప్పర్ మిడిల్ ఇన్‌కం బెంచ్ మార్క్‌ను దాటి ఎదిగిందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది

    • ఐదు అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం గర్వకారణం: ఎక్స్‌లో కేటీఆర్

    • పదేళ్లలో ఏం జరిగింది? దరిద్రం తాండవించిన ప్రాంతం.. ధనిక రాష్ట్రంగా అవతరించింది: ఎక్స్‌లో కేటీఆర్

  • Jul 08, 2026 08:48 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

    • ఉదయం11:30కు సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • మధ్యాహ్నం 2:30కు పొగాకు కొనుగోలు సమస్యలపై సీఎం సమీక్ష

  • Jul 08, 2026 08:47 IST

    ప్రకాశం: ఒంగోలు మండలం చెరువుకొమ్మపాలెంలో విషాదం

    • నిన్న కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలుడు రిచర్డ్స్

    • నేడు బాలుడి మృతదేహం చెరువులో గుర్తింపు

  • Jul 08, 2026 08:46 IST

    తూ.గో.జిల్లా నల్లజర్ల మండలం గంటావారిగూడెం జాతీయ రహదారిపై ప్రమాదం

    • డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఐదుగురికి గాయాలు

    • విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా జరిగిన ప్రమాదం

    • క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు

  • Jul 08, 2026 08:43 IST

    సికింద్రాబాద్ రాణిగంజ్‌లో దారుణం

    • టీవీ షోకు తీసుకెళ్తామని చెప్పి మహిళపై అత్యాచారం

    • వరకట్న వేధింపుల కారణంగా రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న మహిళ

    • టీవీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సిరిసిల్లకు చెందిన మహిళపై ఘాతుకం

    • మహిళ కేకలు వేయడంతో పరారైన నిందితులు

    • మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

    • ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Jul 08, 2026 08:37 IST

    అర్జెంటీనాకే ప్రపంచ కప్ ఫిక్స్ చేశారు: ఈజిప్టు ప్లేయర్

    • ఈజిప్టు స్టార్ ప్లేయర్ మొస్తఫా జికో సంచలన ఆరోపణలు

    • అర్జెంటీనాకే ప్రపంచ కప్ ఇవ్వాలని ఫిక్స్ చేశారు: జికో

    • మాకు అన్యాయం జరిగింది.. మా కష్టం వృథాగా పోయింది: జికో

    • ఉత్కంఠ పోరులో ఈజిప్టుపై అర్జెంటీనా 3-2తో విజయం

    పూర్తి కథనం..

  • Jul 08, 2026 08:29 IST

    దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారా లోకేశ్ పర్యటన

    • ఏపీలో పెట్టుబడులపై కొరియా సంస్థలతో వరుస చర్చలు

    • సియోల్‌ నుంచి బుసాన్‌కు రైల్లో మంత్రి లోకేశ్ ప్రయాణం

    • బుసాన్‌లో కీలక పెట్టుబడి కార్యక్రమాల్లో పాల్గొననున్న లోకేశ్

    • పారిశ్రామికవేత్తలతో భేటీ తర్వాత సియోల్‌కు తిరుగు ప్రయాణం

  • Jul 08, 2026 08:25 IST

    ధరణి అక్రమాలపై సిట్ ఏర్పాటు యోచనలో తెలంగాణ ప్రభుత్వం

    • నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం

    • రెవెన్యూ, పోలీస్, సైబర్, ఐటీ సీనియర్ అధికారులతో సిట్

    • 2020 నుంచి అనుమానిత భూ లావాదేవీలపై దర్యాప్తు చేయనున్న సిట్

  • Jul 08, 2026 07:52 IST

    పవన్‌కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

    • హనుమకొండ: అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ మృతి

    • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పవన్ అభిమాని నిరంజన్ మృతి

    • ఇటీవల నిరంజన్‌ను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    పూర్తి కథనం..

  • Jul 08, 2026 07:45 IST

    విశాఖ: సముద్రంలో అర్ధరాత్రి ముగిసిన సెర్చ్ ఆపరేషన్

    • లభించని ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ

    • బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు

    • పరిహారం అందజేయనున్న మంత్రి కొల్లు రవీంద్ర

    • ఇప్పటికే రూ.10లక్షల తక్షణ సాయం అందించాలని కలెక్టర్‌కు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు

  • Jul 08, 2026 07:39 IST

    కృష్ణా: మద్దూరు దగ్గర కృష్ణా నదిలో విషాద ఘటన

    • ఈతకు వెళ్లి యువకుడి మృతి

    • మృతుడు వణుకూరుకు చెందిన మట్ట అభిజ్ఞ బాబు(23)గా గుర్తింపు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 08, 2026 07:37 IST

    అమెరికా దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు

    • ముడిచమురు సరఫరాపై మళ్లీ ప్రభావం చూపే అవకాశం

  • Jul 08, 2026 07:36 IST

    నేడు విశాఖలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన

    • మత్స్యకార బాధిత కుటుంబాలను పరామర్శించనున్న మంత్రి

  • Jul 08, 2026 07:36 IST

    నేడు వనపర్తి, గద్వాల జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

    • ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభంలో పాల్గొననున్న పొంగులేటి

  • Jul 08, 2026 07:36 IST

    నేడు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మంత్రి పొన్నం పర్యటన

    • RTA కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న పొన్నం

    • కొల్లాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

  • Jul 08, 2026 07:35 IST

    ఏపీలో ఇద్దరు IAS అధికారుల బదిలీ

    • ప.గో. జాయింట్ కలెక్టర్‌గా కల్పశ్రీ కె.ఆర్ నియామకం

    • APCRDA అదనపు కమిషనర్‌గా రాహుల్‌కుమార్‌రెడ్డి

  • Jul 08, 2026 07:35 IST

    విజయవాడ: వించిపేటలో NIA సోదాలు

    • ఉదయం 5గంటల నుంచి కొనసాగుతున్న NIA తనిఖీలు

    • టెర్రర్ లింక్స్ కేసులో NIA దాడులు

  • Jul 08, 2026 06:56 IST

    చాలా దారుణంగా ఆడాం: శ్రేయస్ అయ్యర్

    • ఇంగ్లండ్‌తో మూడో టీ20లో 125 పరుగుల భారీ తేడాతో భారత్ ఘోర ఓటమి

    • తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

    • ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు: శ్రేయస్

    పూర్తి కథనం..

  • Jul 08, 2026 06:46 IST

    స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

    • రూ.1,45,250కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.1,33,340కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం

    • కిలో వెండి ధర రూ.2,49,900

    పూర్తి కథనం..

  • Jul 08, 2026 06:44 IST

    పాకిస్థాన్‌లో కార్గో విమానం అదృశ్యం

    • షార్జా నుంచి కరాచీకి వెళ్తున్న బోయింగ్‌ విమానం

    • K2 ఎయిర్‌వేస్‌ విమానంలో ఐదుగురు సిబ్బంది

    • నావిగేషన్‌లో లోపం ఉందని ఓ ATCకి పైలట్‌ సమాచారం

    • కాసేపటికే ఏటీసీతో తెగిపోయిన సంబంధాలు

  • Jul 08, 2026 06:43 IST

    ఏపీలో కొనసాగుతోన్న RTC జేఏసీ నిరసన

    • నేడు కూడా ఆర్టీసీ పరిరక్షణ దినం కార్యక్రమం

  • Jul 08, 2026 06:43 IST

    కడపలో కొనసాగుతోన్న జగన్‌ పర్యటన

    • నేడు ఇడుపులపాయలో వైఎస్‌కు నివాళులు అర్పించనున్న జగన్

    • ఉదయం 9 గంటలకు నివాళులు అర్పించనున్న వైఎస్‌ షర్మిల

  • Jul 08, 2026 06:42 IST

    ఫిఫా ప్రపంచ కప్: భావోద్వేగానికి గురైన మెస్సి

    • ప్రిక్వార్డర్స్‌లో ఈజిప్టుపై 2-3 తేడాతో అర్జెంటీనా అద్భుత విజయం

    • క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన అర్జెంటీనా

    • దీంతో మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న మెస్సి

    పూర్తి కథనం..

  • Jul 08, 2026 06:00 IST

    ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు

    • హోర్ముజ్‌లో 3 నౌకలపై ఇరాన్‌ దాడులతో అమెరికా చర్యలు

    • ఖేష్మ్‌ ఐల్యాండ్‌, బందర్‌ అబ్బాస్‌, సిరిక్‌ వంటి 10 ప్రాంతాల్లో పేలుళ్లు

    • ఇరాన్‌ దురాక్రమణ ప్రమాదకరం, సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించడమే: US

    • వాణిజ్య నౌకలపై దాడికి ప్రతిస్పందనగానే దాడులు: అమెరికా

  • Jul 08, 2026 06:00 IST

    అమరావతి: నేటి నుంచి స‌ద‌రం స్లాట్ల బుకింగ్‌ ప్రారoభం

    • దివ్యాంగుల డేటాకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా భద్రత

    • తొలి వైకల్య నిర్ధారణ పరీక్ష ఫలితంపై అప్పీళ్లకు 2 సార్లు అవకాశం