Share News

ఆటోలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ.. కాసేపటికే..

ABN , Publish Date - Jul 08 , 2026 | 01:52 PM

మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో అంబులెన్స్ సకాలంలో అందకపోవడంతో ఒక గర్భిణి ఆటోలోనే నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే, దురదృష్టవశాత్తూ పుట్టిన కొద్దిసేపటికే ఆ నలుగురూ కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆటోలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ.. కాసేపటికే..
Madhya Pradesh New

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో అంబులెన్స్ సకాలంలో అందకపోవడంతో ఒక గర్భిణి.. ఆటోలోనే నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే, దురదృష్టవశాత్తూ పుట్టిన కొద్దిసేపటికే ఆ నలుగురూ కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. మాండ్లా జిల్లాకు చెందిన రజని సింగరామ్ అనే మహిళకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కోసం ప్రయత్నించారు. కానీ సమయానికి వాహనం రాకపోవడంతో ఆమెను ఆటోరిక్షాలో బిచ్చియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే ఆటోలోనే ఆమె నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో పుట్టిన కాసేపటికే వారంతా మృతిచెందారు. సమయానికి అంబులెన్స్ రాకపోవడమే ఈ ఘోరానికి కారణమని ఆమె భర్త తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ ఘటనపై స్పందించిన జిల్లా ముఖ్య వైద్యాధికారి (CMHO), మహిళకు నెలలు నిండకుండానే (7వ నెలలోనే) ప్రసవం జరిగిందని తెలిపారు. పుట్టిన సమయంలో నలుగురు శిశువులు కలిపి కేవలం 1.5 కిలోల బరువు మాత్రమే ఉన్నారని, అందుకే వారు ప్రాణాలు కోల్పోయారని వైద్యులు వివరించారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ హృదయ విదారక ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ రాహుల్ నామ్‌దేవ్ స్పందించారు. దీనిపై అధికారికంగా ఫిర్యాదు అందిన వెంటనే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రం‌లో గాలింపు..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 08 , 2026 | 02:03 PM