బెంగాల్ బాలిక హత్యాచారం కేసు.. ఎన్‌కౌంటర్‌లో అనుమానితుడి హతం..
ABN , Publish Date - Jul 08 , 2026 | 09:43 AM
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక హత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ముగ్గురిలో ఓ అనుమానితుడు మంగళవారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.
కోల్‌కతా, జులై 8: పశ్చిమ బెంగాల్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక హత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ముగ్గురిలో ఓ అనుమానితుడు మంగళవారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 11 ఏళ్ల బాలిక హత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో ప్రవాశ్ మండల్ ఒకడు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ముగ్గురిని బరూయ్‌పూర్ తీసుకెళ్లారు. అక్కడ క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ప్రవాశ్ పోలీసుల నుంచి తుపాకి లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రవాశ్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రవాశ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు.
చెరువులో బాలిక శవం..
దక్షిణ 24 పరగణాస్‌కు చెందిన 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక తన స్నేహితురాలి పుట్టినరోజు సందర్భంగా బహుమతి కొనడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ, రాత్రి అయినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. గత శనివారం అదృశ్యం అయిన బాలిక శవం ఆదివారం ఓ చెరువులో కనిపించింది. బాలిక శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో బాలిక అత్యాచారం అనంతరం హత్యకు గురైనట్లు బయటపడింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
సంజు శాంసన్‌ను అందుకే తప్పించాం.. క్లారిటీ ఇచ్చిన గంభీర్
అమెరికా-ఇరాన్ దాడులు.. భారీ నష్టాల్లో దేశీయ సూచీలు