అమెరికా-ఇరాన్ దాడులు.. భారీ నష్టాల్లో దేశీయ సూచీలు
ABN , Publish Date - Jul 08 , 2026 | 09:46 AM
ఇరాన్ స్థావరాలపై అమెరికా మిలటరీ దాడులు చేయడంతో దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. మళ్లీ అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలు కావడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 2.6 శాతం పెరిగి 76.1 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇరాన్ స్థావరాలపై అమెరికా మిలటరీ దాడులు చేయడంతో దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. మళ్లీ అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలు కావడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 2.6 శాతం పెరిగి 76.1 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ప్రభావంతో చాలా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.15గా ఉంది (Indian stock market).
గత సెషన్ ముగింపు (78,180)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగి వచ్చింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 592 పాయింట్ల నష్టంతో 77,588 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 178 పాయింట్ల నష్టంతో 24,220 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో కల్యాణ్ జువెల్లర్స్, ఇన్ఫోఎడ్జ్, జైడూస్ లైఫ్, ఇండస్ టవర్స్, వోడాఫోన్ ఐడియా మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). హిందుస్థాన్ పెట్రో, బీపీసీఎల్, ఎంఫసిస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, అశోక్ లేలాండ్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 391 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 225 పాయింట్ల నష్టంతో ఉంది.
ఇవి కూడా చదవండి..
అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రంలో గాలింపు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..