Share News

ఈ తెలివి చూస్తే షాకవ్వాల్సిందే.. ఒకే ఏసీతో రెండు గదులకు కూలింగ్..

ABN , Publish Date - Jul 08 , 2026 | 08:55 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.

ఈ తెలివి చూస్తే షాకవ్వాల్సిందే.. ఒకే ఏసీతో రెండు గదులకు కూలింగ్..
viral AC hack

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral AC hack).


ఆ వీడియోలో ఒక ఏసీతోనే రెండు గదులకు కూలింగ్ అందించడం కనిపిస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక గదిలో ఏసీని అమర్చారు. ఆ ఏసీ పక్కన గోడకు రంధ్రం చేసి ఓ భారీ పైప్‌ను పెట్టారు. ఏసీ నుంచి వచ్చే చల్ల గాలి ఆ పైప్ గుండా పక్క గదిలోకి వెళ్లే ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుతో ఒకే ఏసీతో రెండు గదులకు ఒకేసారి కూలింగ్ అందిస్తున్నారు (AC room cooling trick).


ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral jugaad). ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు దాదాపు 40 వేల మంది వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. 'కూలింగ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి బిల్లు ఎక్కువగా వస్తుంది', 'భారతీయులకు మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి', 'ఇది మంచి ఆలోచనలాగానే అనిపిస్తోంది' అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రం‌లో గాలింపు..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 08 , 2026 | 09:31 AM