భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న వీవీఎస్ లక్ష్మణ్!
ABN , Publish Date - Jul 08 , 2026 | 10:49 AM
టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ షెడ్యూల్‌ను ఎదుర్కొంటున్న వేళ.. బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా కోచింగ్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ షెడ్యూల్‌ను ఎదుర్కొంటున్న వేళ.. బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా కోచింగ్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. రానున్న జింబాబ్వే పర్యటనతో పాటు ఆసియా క్రీడల్లో భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. అతడికి బ్యాటింగ్ కోచ్ హృషికేశ్ కనిట్కర్, బౌలింగ్ కోచ్ సునీల్ జోషి సహకారం అందించనున్నారు. ఇంగ్లండ్ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఐర్లాండ్ చేతిలో 0-2తో సిరీస్ కోల్పోయిన తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ జులై 14, 16, 19 తేదీల్లో జరగనుండగా.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే భారత్ జింబాబ్వే పర్యటనకు బయలుదేరాల్సి ఉంటుంది. దీంతో కోచింగ్ సిబ్బందికి కూడా విశ్రాంతి, ప్రయాణ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో బీసీసీఐ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ జులై 23 నుంచి ప్రారంభం కానుంది. రెండో, మూడో మ్యాచ్‌లు జులై 25, 26 తేదీల్లో జరగనున్నాయి. హరారే వేదికగా అన్ని మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
ఆసియా క్రీడల్లోనూ..
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు కూడా వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా కొనసాగే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో భారత్‌కు మరింత బిజీ షెడ్యూల్ ఉంది. సెప్టెంబర్ 13 నుంచి 19 వరకు అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుండగా, సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 3 వరకు ఆసియా క్రీడల క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఇదే సమయంలో వెస్టిండీస్‌తో భారత్ వన్డే, టీ20 సిరీస్‌లు కూడా ఆడనుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉంటాయి. వెస్టిండీస్ సిరీస్‌కు గౌతమ్ గంభీర్ తిరిగి జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది.
లక్ష్మణ్‌కు ఇది రెండోసారి..
భారత ద్వితీయ శ్రేణి జట్టుకు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. 2024లో జింబాబ్వే పర్యటనలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత టీ20 జట్టుకు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించాడు. అదే సిరీస్‌లో అభిషేక్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అలాగే 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల సమయంలోనూ లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. ఆ సమయంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వన్డే ప్రపంచ కప్ జట్టుతో బిజీగా ఉండటంతో ఆసియా క్రీడల బాధ్యతలు లక్ష్మణ్‌కు అప్పగించారు.
ఇవి కూడా చదవండి:
సంజు శాంసన్‌ను అందుకే తప్పించాం.. క్లారిటీ ఇచ్చిన గంభీర్
ప్రపంచ కప్ అర్జెంటీనాకే ఇవ్వాలని ఫిక్స్ చేశారు: ఈజిప్టు ప్లేయర్