-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 4th July 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 04 , 2026 | 07:19 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 04, 2026 21:00 IST
మాంచెస్టర్ T20: ఇంగ్లండ్ టార్గెట్ 191 పరుగులు
భారత్ స్కోర్- 190/7
ఇషాన్ 49, అభిషేక్ 43, శ్రేయస్ 37 పరుగులు
తిలక్ వర్మ 24, వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు
-
Jul 04, 2026 20:11 IST
కృష్ణా: పేర్ని నాని ఆరోపణలపై జనసేన MLC హరిప్రసాద్ ఫైర్
బందరు రావాలంటే పేర్ని పర్మిషన్ తీసుకోవాలా?: హరిప్రసాద్
బందరు ఏమైనా పేర్ని నాని జాగీరా?: MLC హరిప్రసాద్ ఫైర్
-
Jul 04, 2026 20:10 IST
నంద్యాల: రాయలసీమ అభివృద్ధిపై వైసీపీ నేతలు చర్చకు రావాలి: బీసీ జనార్ధన్‌రెడ్డి
వైసీపీ పాలనలో కమీషన్లకు కక్కుర్తికి పారిశ్రామికవేత్తలు పారిపోయారు: మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి
జగన్‌రెడ్డి అపరిచితుడు, పిచ్చి తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు: మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి
-
Jul 04, 2026 19:54 IST
పోలీసులు వీక్ కేసులు పెడుతున్నారా?: ABN డిబేట్‌లో కిరణ్ రాయల్
డిప్యూటీ సీఎంను తిట్టినా బెయిల్ వస్తోంది: ABN డిబేట్‌లో కిరణ్ రాయల్
ప్రశ్నించే హక్కు ఉందని.. తిడితే ఎలా?: ABN డిబేట్‌లో కిరణ్ రాయల్
జోసెఫ్ రావణ్, ప్రకాష్‌రాజ్ కలిసి కుట్రలు: ABN డిబేట్‌లో కిరణ్ రాయల్
కూటమి ప్రభుత్వంపై జడ శ్రవణ్ విషం చిమ్ముతున్నారు: కిరణ్ రాయల్
-
Jul 04, 2026 19:43 IST
కులమతాల పేరుతో వైసీపీ కుట్రలు: ABN డిబేట్‌లో రాజేష్ మహాసేన
కులమతాల ముసుగులో వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు: రాజేష్ మహాసేన
ఏపీలో పెద్ద కుట్రలకు ప్లాన్ చేశారు: రాజేష్ మహాసేన
వీళ్లను ఇలానే వదిలేస్తే.. ఏపీ అగ్నిగోళంలా మారుతుంది: ABN డిబేట్‌లో రాజేష్ మహాసేన
-
Jul 04, 2026 18:39 IST
చండీగఢ్‌లో హైదరాబాద్-శ్రీనగర్ ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
శ్రీనగర్‌లో ల్యాండింగ్ సమస్యతో చండీగఢ్‌కు దారిమళ్లింపు
విమానంలో హైదరాబాద్‌కు చెందిన అమర్‌నాథ్ యాత్రికులు
ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ తీసుకెళ్లాలని ప్రయాణికుల విజ్ఞప్తి
గంటల తరబడి విమానంలోనే ప్రయాణికుల పడిగాపులు
ఇండిగో విమానంలో 231 మంది ప్రయాణికులు
ఎలాంటి సమాచారం ఇవ్వని ఇండిగో సంస్థ
-
Jul 04, 2026 18:38 IST
ప్రధాని మోదీకి బెదిరింపులు
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ప్రధాని మోదీకి ఆన్‌లైన్‌లో బెదిరింపులు
ఈ నెల 9న మోదీ ఆస్ట్రేలియా పర్యటన
బెదిరింపులపై ఆస్ట్రేలియా పోలీసుల దర్యాప్తు
-
Jul 04, 2026 18:38 IST
ఆనాడు తొలిసారి మీ ముందుకొచ్చిన నన్ను ఆశీర్వదించారు: సీఎం రేవంత్
నా వల్ల ఎవరికీ కష్టం, నష్టం రాకూడదన్నదే నా ఆలోచన: సీఎం రేవంత్ రెడ్డి
నాపై ఓడిన రబ్బానీకి.. ప్రభుత్వంలో ఏదో ఒక బాధ్యత ఇస్తాం: రేవంత్
మిడ్జిల్‌ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది: సీఎం రేవంత్
మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకోవాలని భట్టి విక్రమార్కను కోరుతున్నా: సీఎం రేవంత్ రెడ్డి
-
Jul 04, 2026 18:35 IST
ఇంగ్లండ్‌తో రెండో టీ20: టాస్ గెలిచిన భారత్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్
తొలుత ఫీల్డింగ్ చేయనున్న ఇంగ్లండ్
సంజు శాంసన్ స్థానంలో ఆడనున్న వైభవ్ సూర్యవంశీ
-
Jul 04, 2026 18:34 IST
హైదరాబాద్: హౌసింగ్, రెవెన్యూ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
క్యూర్ పరిధిలో అర్బన్ హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్యం: మంత్రి పొంగులేటి
26 నియోజకవర్గాల్లో తొలి విడతగా 500 ఇళ్ల నిర్మాణం: పొంగులేటి
పేదలకు సమీప ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణం: పొంగులేటి
అర్బన్ హౌసింగ్ టెండర్లు త్వరలో ఖరారు: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
-
Jul 04, 2026 18:32 IST
తూ.గో.: జగన్.. నిలకడలేని నేత: హోంమంత్రి అనిత
జగన్ రాజకీయ నాయకుడా, వ్యాపారవేత్తా?: హోంమంత్రి అనిత
మావిగన్ తర్వాత విజయవాడ అన్నారు: హోంమంత్రి అనిత
ఇప్పుడు మళ్లీ దొనకొండ రాజధాని అంటున్నారు: అనిత
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని: హోంమంత్రి అనిత
అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం రాజీపడదు: హోంమంత్రి అనిత
-
Jul 04, 2026 18:27 IST
ఇంగ్లండ్‌తో రెండో టీ20: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం
తిలక్ వర్మ నుంచి క్యాప్ అందుకున్న వైభవ్
-
Jul 04, 2026 17:38 IST
నాగర్‌కర్నూల్: మిడ్జిల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞత సభ
రేవంత్ ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సభ
20 ఏళ్లలో సీఎం రేవంత్ ప్రయాణం ఎన్నో దశలుగా సాగింది: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ZPTC నుంచి MLC, MLA, MP.. చివరిగా CM వరకు ఎదిగారు: భట్టి
ప్రజల కష్టాలకు పరిష్కారం చూపడమే నిజమైన పాలన: : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
-
Jul 04, 2026 17:12 IST
హైదరాబాద్: అప్పులపై భట్టి విక్రమార్కకు హరీశ్ రావు కౌంటర్
అప్పులపై భట్టి అసత్యాలు చెబుతున్నారు: హరీశ్ రావు
లేని అప్పులను ఉన్నట్టుగా కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం: హరీశ్ రావు
డ్యామేజ్ కంట్రోల్ కోసం భట్టి మాట్లాడుతున్నట్లుంది: హరీశ్ రావు
కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారు: మాజీ మంత్రి హరీశ్ రావు
-
Jul 04, 2026 16:59 IST
నాగర్‌కర్నూల్: ఉర్కొండలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్
ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ
కాసేపట్లో మిడ్జిల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ
-
Jul 04, 2026 16:59 IST
హైదరాబాద్: కలెక్టర్లతో CS సంజయ్ జాజు సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో సన్నద్ధతపై సీఎస్ రివ్యూ
-
Jul 04, 2026 16:58 IST
కుప్పంలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన
కంగుంది గ్రామ రైతుల సమస్యలు పరిష్కరించాం: సీఎం చంద్రబాబు
ఏళ్లుగా ఉన్న పెండింగ్ సమస్యలనూ పరిష్కరిస్తున్నాం: సీఎం చంద్రబాబు
గతంలో గొడ్డలి పార్టీ నేతలు అక్రమాలు చేశారు: సీఎం చంద్రబాబు
రైతుల భూములు బలవంతంగా లాక్కున్నారు: సీఎం చంద్రబాబు
-
Jul 04, 2026 16:51 IST
నటుడు ప్రకాష్‌రాజ్ ట్వీట్‌పై మంత్రి దుర్గేష్ ఆగ్రహం
ప్రకాష్‌రాజ్, జోసెఫ్ రావణ్ సంఘవిద్రోహ శక్తులుగా మారారు: మంత్రి దుర్గేష్
ప్రకాశ్‌రాజ్‌కు జోసెఫ్ రావణ్‌కు సంబంధం ఉందా?లేదా?: మంత్రి దుర్గేష్
రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం సృష్టించాలని చూస్తున్నారు: మంత్రి దుర్గేష్
వైసీపీ అకృత్యాలపై ఎందుకు మాట్లాడలేదు: మంత్రి కందుల దుర్గేష్
-
Jul 04, 2026 16:50 IST
అయోధ్య ట్రస్ట్ విరాళాల లెక్కింపు వ్యవస్థలో కఠిన నిబంధనలు
విరాళాలు లెక్కించే సమయంలో సిబ్బంది ఫోన్లు, కెమెరాలు ఉపయోగించడంపై నిషేధం
సిబ్బంది పాకెట్‌లెస్ దస్తులు ధరించాలని ఆదేశాలు
నేలపై కూర్చని మాత్రమే విరాళాల లెక్కించాలని ఆదేశాలు
-
Jul 04, 2026 16:49 IST
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన మరింత ఆలస్యం
ఈ వారంలో అవార్డుల ప్రకటన ఉండకపోవచ్చంటున్న ప్రభుత్వ వర్గాలు
అవార్డుల ఎంపికపై ఇంకా కొనసాగుతున్న జ్యూరీ సభ్యుల చర్చలు
జ్యూరీ సభ్యులకు ముందస్తు కమిట్‌మెంట్లు ఉండటమే కారణం
విజేతల ప్రకటనకు వారం రోజులకు పైగా సమయం పట్టే చాన్స్
-
Jul 04, 2026 16:08 IST
ఉల్లి రైతులకు కేంద్రం ఊరట
ఉల్లి కొనుగోలు ధర క్వింటాల్‌కు 13 శాతం పెంపు
రూ.2,125కి చేరిన క్వింటాల్ ఉల్లి కొనుగోలు ధర
గతంలో క్వింటాల్‌కు రూ.1,875గా ఉన్న మద్దతు ధర
ఈ సీజన్‌లో ఐదోసారి పెంచిన కేంద్రం
-
Jul 04, 2026 15:59 IST
బిహార్ బీజేపీ MLA రాజుకుమార్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష
వైద్యురాలి మృతికి కారణమైన కేసులో శిక్ష ఖరారు
జైలుశిక్ష సహా రూ.25 లక్షల జరిమానా విధించిన కోర్టు
ఢిల్లీలో 2018లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో తుపాకీతో కాల్పులు జరిపిన ఎమ్మెల్యే
MLA కాల్పుల్లో బుల్లెట్ తగిలి డా.అర్చనా గుప్తా మృతి
-
Jul 04, 2026 15:57 IST
20 ఏళ్ల రేవంత్ రాజకీయ జీవితం.. బండి సంజయ్ శుభాకాంక్షలు
కేసీఆర్, రేవంత్‌రెడ్డి కష్టపడి పైకొచ్చినవారే: కేంద్ర మంత్రి బండి సంజయ్
సీఎం రేవంత్ 6 గ్యారంటీలు అమలుచేయాలి: బండి సంజయ్
SIR పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది: బండి సంజయ్
మజ్లిస్‌తో కుమ్మక్కై హిందువుల ఓట్లు తొలగించే కుట్ర: బండి సంజయ్
అధికారులకు ప్రభుత్వం సహకరించడం లేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
Jul 04, 2026 15:54 IST
ఆసిఫాబాద్: బెజ్జూరులో వర్షాలకు పొంగుతున్న వాగులు
బెజ్జూరు నుంచి 12 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
-
Jul 04, 2026 15:53 IST
కోస్తాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
ప్రధాన పోర్టుల్లో IMD మూడో ప్రమాద హెచ్చరిక
-
Jul 04, 2026 15:25 IST
నాగర్‌కర్నూల్: ఉర్కొండలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్
-
Jul 04, 2026 15:25 IST
తెలంగాణలో ఐదో విడత రైతు భరోసా నిధులు విడుదల
6 ఎకరాల వరకు సాగుభూమి ఉన్న రైతులకు లబ్ధి
1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.545.41 కోట్ల జమ
ఇప్పటివరకూ 67.45 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,135.78 కోట్ల జమ
-
Jul 04, 2026 15:15 IST
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటన
ఇందల్వాయి మండలం వెంగల్పాడ్ తండా దగ్గర రోడ్డు పనులకు మంత్రి భూమిపూజ
తిర్మన్‌పల్లి గిరిజన సంక్షేమ గురుకులంలో నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి సీతక్క
-
Jul 04, 2026 15:13 IST
సూర్యాపేట: జూన్ 30న కోదాడ దగ్గర రోడ్డుప్రమాదం కేసులో ట్విస్ట్
బార్‌లో మహేశ్, రమేష్ ఘర్షణను ఆపేందుకు యత్నించిన యాకూబ్
అనంతరం రోడ్‌పై నడుస్తూ వెళ్తున్న యూకూబ్‌ను కాలితో తన్నిన మహేశ్
మహేష్ కాలితో తన్నడంతో లారీ కింద పడి యాకూబ్ మృతి
సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు
-
Jul 04, 2026 15:12 IST
చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: జూన్ 1న బంధువుల ఇంట్లో చోరీ చేసిన ముగ్గురి అరెస్టు
134 గ్రాముల బంగారం, రూ.12.5 లక్షల నగదు, బైక్ స్వాధీనం
-
Jul 04, 2026 15:11 IST
నల్లగొండ: మిర్యాలగూడలో మంత్రి ఉత్తమ్ పర్యటన
శెట్టిపాలెంలో ఆగ్రోటెక్ రైస్ మిల్లును ప్రారంభించిన ఉత్తమ్
చిట్యాల దగ్గర ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
Jul 04, 2026 15:10 IST
హైదరాబాద్: గచ్చిబౌలి IIITలో విద్యార్థి ఆత్మహత్య
ట్రిపుల్ ఐటీ భవనం పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన అభిరూప్‌గా గుర్తింపు
-
Jul 04, 2026 14:58 IST
తిరుపతి: రేణిగుంట మం. వెంకటాపురంలో చిరుత కలకలం
ఓ ఇంట్లో చొరబడేందుకు యత్నించిన చిరుత
కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో పారిపోయిన చిరుత
సీసీ కెమెరాలో రికార్డయిన చిరుత దృశ్యాలు
-
Jul 04, 2026 14:39 IST
మంత్రి నారా లోకేశ్‌కు దక్షిణ కొరియా నుంచి ఆహ్వానం
ఈనెల 5 నుంచి 11 వరకు దక్షిణ కొరియాలో లోకేశ్ పర్యటన
అధికారిక సమావేశాలతో పాటు పెట్టుబడులపై చర్చ
-
Jul 04, 2026 14:36 IST
బెంగాల్: TMC పార్టీకి మరో షాక్
తృణమూల్ రాష్ట్ర అధ్యక్ష పదవికి చంద్రిమ రాజీనామా
మమతకు రాజీనామా లేఖను పంపించిన చంద్రిమ భట్టాచార్య
-
Jul 04, 2026 14:34 IST
కుప్పం: అన్ని మతాలనూ గౌరవించుకోవాలి: సీఎం చంద్రబాబు
ఇతర మతాల వారిపై దాడులు సరికాదు: సీఎం చంద్రబాబు
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు: చంద్రబాబు
ఐదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు: సీఎం చంద్రబాబు
వైసీపీ హయాంలో కుప్పం నియోజకవర్గంపై కక్ష గట్టారు: సీఎం చంద్రబాబు
హంద్రీనీవా నీళ్లు ఇచ్చేసినట్లు డ్రామాలు ఆడారు: చంద్రబాబు
సెట్టింగ్‌లు వేసి నాటకాలు ఆడారు: సీఎం చంద్రబాబు
-
Jul 04, 2026 14:04 IST
ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్‌ను పూర్తిగా దెబ్బతీశాం: ట్రంప్
ఖమేనీ అంత్యక్రియల కోసం వారం సమయం ఇచ్చాం: ట్రంప్
మాతో ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉంది: ట్రంప్
-
Jul 04, 2026 13:54 IST
ముంబై: కేతన్ హత్య కేసులో వెలుగులోకి కొత్త విషయాలు
కోడ్ భాషలో చాట్ చేసిన సియా, చేతన్
డిలీట్ చేసిన మొబైల్ డేటా రికవరీతో గుర్తించిన పోలీసులు

-
Jul 04, 2026 13:34 IST
విజయవాడ: సాయికృష్ణ మెజిస్టీరియల్ విచారణ
విచారణకు హాజరైన సాయికృష్ణ తల్లి, మేనమామ, మేనత్త
సాయికృష్ణను పోలీసులే చంపి మాయం చేశారన్న విజయలక్ష్మి
కృష్ణలంక పీఎస్‌లో సాయికృష్ణ ఉన్నాడని తెలుసుకుని వెళ్తే సీఐ నాగరాజు వెనక్కి పంపించారని తెలిపిన విజయలక్ష్మి
-
Jul 04, 2026 13:19 IST
రాజస్థాన్‌లోని అల్వార్‌లో భారీ దోపిడీ
జీఎస్టీ అధికారి ఇంట్లోకి చొరబడిన దొంగలు
తుపాకీతో బెదిరించి కుటుంబ సభ్యులపై దాడి
20 తులాల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదు అపహరణ
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jul 04, 2026 13:17 IST
మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన
సత్నా జిల్లాలో బావిలో పడిన ఎద్దును కాపాడబోయి ముగ్గురి మృతి
40 అడుగుల లోతైన బావిలోకి దిగిన ముగ్గురు వ్యక్తులు
ఆక్సిజన్ అందక బావిలోనే ప్రాణాలు కోల్పోయిన బాధితులు
ఘటనపై సమాచారం అందుకుని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
-
Jul 04, 2026 13:09 IST
రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటన
బాలోత్రలో రూ.1.06లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
రూ.79,450 కోట్ల పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్ట్ ఏర్పాటు
జైపూర్ మెట్రో 2వ దశకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
-
Jul 04, 2026 13:08 IST
హైదరాబాద్: రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రకు తెరలేపారు: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
గాంధీ, నెహ్రూ లెగసిని మరిపించే ప్రయత్నం చేస్తున్నారు: మహేష్ గౌడ్
రాముడి పేరు చెప్పి మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది: మహేష్ గౌడ్
బీజేపీలో రాముడికి సభ్యత్వం ఉందా?: మహేష్‌గౌడ్
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు చోరీ చేశారు: మహేష్‌గౌడ్
అభివృద్ధి పేరుతో బీజేపీకి ఓట్లు అడిగే దమ్ముందా?: మహేష్‌గౌడ్
-
Jul 04, 2026 13:07 IST
హైదరాబాద్: ఉప్పల్ పీఎస్ పరిధిలోని ఆదర్శ్‌నగర్‌లో దారుణం
అనుమానంతో భార్య జెస్సికాను హత్య చేసిన భర్త సురేశ్
పరారీలో నిందితుడు, క్యాబ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న సురేశ్
-
Jul 04, 2026 12:47 IST
టెలిగ్రామ్‌కు కేంద్రం 15 రోజుల గడువు
పైరసీ కట్టడిపై కేంద్రం కీలక ఆదేశాలు
పైరేటెడ్ సినిమాలు తొలగించాలని సూచన
నిబంధనలు ఉల్లంఘించే ఛానళ్లపై చర్యలు
-
Jul 04, 2026 12:30 IST
హైదరాబాద్: స్టెరాయిడ్ ఇంజెక్షన్ల అమ్మకాల ముఠా అరెస్ట్
ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
తక్షణ కండరాల పెరుగుదల పేరుతో ఇంజెక్షన్స్ విక్రయం
జిమ్స్‌లో స్టెరాయిడ్స్ ఎక్కువగా వినియోగిస్తున్నట్టు గుర్తింపు
-
Jul 04, 2026 11:58 IST
హైదరాబాద్: ఆహార కల్తీపై హెచ్‌ఫాస్ట్ ఉక్కుపాదం
100 రోజుల్లో 185 కేసులు, 121.87టన్నుల కల్తీ ఆహారం సీజ్
రాజేంద్రనగర్ జోన్‌లో అత్యధికంగా 55 కేసుల నమోదు
హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలకు కఠిన మార్గదర్శకాలు జారీ
FSSAI లైసెన్స్, FIFO విధానం, వాడిన నూనె వాడకంపై ఆంక్షలు
-
Jul 04, 2026 11:58 IST
హైదరాబాద్: నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రిలో దారుణం
పసికందును వదిలేసి వెళ్లిపోయిన తల్లిదండ్రులు
శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న పసికందు
ఏప్రిల్ 25న ఆస్పత్రిలో చేర్చిన ఒడిశాకు చెందిన తల్లిదండ్రులు
నిలోఫర్ ఆస్పత్రి RMO ఫిర్యాదుతో కేసు నమోదు
-
Jul 04, 2026 11:57 IST
కాకినాడ: పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐశ్వర్యపై కేసు నమోదు
జనసేన నేతల ఫిర్యాదుతో బొజ్జ ఐశ్వర్యపై టూటౌన్ పీఎస్‌లో కేసు
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు మద్దతుగా పిఠాపురం వచ్చిన ఐశ్వర్య
రావణ్‌ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు
-
Jul 04, 2026 11:56 IST
కృష్ణా: గూడూరు మండలం అనంతయ్యపేటలో విషాదం
ఇంట్లో ఉరేసుకుని ముగ్గురు మహిళల ఆత్మహత్య
మృతులు రజిని కుమారి, మధుబాల, గౌరీదేవి
-
Jul 04, 2026 11:54 IST
రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటన
జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను ప్రారంభించిన మోదీ
రూ.480కోట్లతో రూపుదిద్దుకున్న ఎయిర్‌పోర్ట్ టెర్మినల్
సవరించిన ఉడాన్-2.0 పథకాన్ని ప్రారంభించిన మోదీ
పాల్గొన్న కేంద్రమంత్రులు రామ్మోహన్, గజేంద్రసింగ్
పాల్గొన్న రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిసన్‌రావ్ బాగ్డే, సీఎం భజన్‌లాల్ శర్మ
-
Jul 04, 2026 11:44 IST
జమ్మూకశ్మీర్: రామ్‌నగర్–ఉధంపూర్ రహదారిపై విరిగిపడిన కొండచరియలు
ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన అధికారులు
రహదారిపై పడిన భారీ బండరాళ్ల తొలగింపునకు చర్యలు
రామ్‌నగర్–ఉధంపూర్ రహదారి మూసివేత
-
Jul 04, 2026 11:41 IST
అల్లూరి త్యాగం భావితరాలకు స్ఫూర్తి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ధైర్యం, దేశభక్తికి ప్రతీక అల్లూరి: పవన్ కల్యాణ్
గిరిజన హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేత అల్లూరి: పవన్
అల్లూరి పోరాటం దేశభక్తికి నిదర్శనం: పవన్ కల్యాణ్
-
Jul 04, 2026 11:40 IST
అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం
టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా ప్రాంగణంలో అంత్యక్రియలు
లక్షలాదిగా తరలివచ్చిన ఇరాన్ ప్రజలు, ఖమేనీ అభిమానులు
తీవ్ర భావోద్వేగంతో నిండిపోయిన గ్రాండ్ మొసల్లా ప్రాంగణం
-
Jul 04, 2026 11:18 IST
విజయనగరం: శృంగవరపుకోట బ్రాహ్మణ వీధి రామాలయంలో చోరీ
2 కేజీల వెండి కిరీటాలు, రెండున్నర తులాల బంగారు ఆభరణాల అపహరణ
-
Jul 04, 2026 11:17 IST
విజయవాడ: సాయికృష్ణ కేసులో మెజిస్టీరియల్ విచారణ ప్రారంభం
సబ్ కలెక్టర్ కార్యాలయానికి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి
తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఆర్డీవోకు అందజేసిన విజయలక్ష్మి
-
Jul 04, 2026 11:15 IST
టీమ్‌ఇండియా తరఫున వైభవ్ ఎంట్రీపై కొనసాగుతోన్న సస్పెన్స్
‘కొత్త చాప్టర్’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వైభవ్
టోర్నడో ఎమోజీ జత చేయడంతో మరింత ఉత్కంఠ
నేడు తుది జట్టులో అవకాశం దక్కుతుందా?
అధికారిక ప్రకటన కోసం అభిమానుల ఎదురుచూపులు

-
Jul 04, 2026 11:07 IST
ఫిఫా వరల్డ్‌కప్: మెక్సికోతో మ్యాచ్‌కు సిద్ధమైన ఇంగ్లండ్ జట్టు
ఇంగ్లండ్ ప్లేయర్లకు వయాగ్రా వినియోగానికి అనుమతి
మెక్సికో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం
వైద్యుల సూచనలతోనే వినియోగానికి అనుమతి
-
Jul 04, 2026 11:01 IST
ముంబై: కేతన్ హత్య కేసులో కీలక పరిణామం
లై డిటెక్టర్ (పాలీగ్రాఫ్) పరీక్షకు సియా, చేతన్ నిరాకరణ
పాలీగ్రాఫ్ టెస్ట్‌కు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించిన పోలీసులు
నిందితులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం
సమ్మతి లేకపోవడంతో నిజ నిర్ధారణ పరీక్షకు అనుమతి నిరాకరణ
నిందితులకు 14 రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేసిన కోర్టు
-
Jul 04, 2026 11:00 IST
సంగారెడ్డిలో 22 కిలోల గంజాయి పట్టివేత
బీహెచ్ఈఎల్ బస్టాండ్ సమీపంలో పోలీసుల తనిఖీలు
ఐదుగురు నిందితుల అరెస్ట్
మహారాష్ట్రకు తరలిస్తుండగా గంజాయి స్వాధీనం
గంజాయి రవాణాపై కేసు నమోదు
నిందితులను విచారిస్తున్న పోలీసులు
-
Jul 04, 2026 10:59 IST
వైభవ్ అరంగేట్రంపై బీసీసీఐ స్పందన
స్పష్టతనిచ్చిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా
ఎంపిక ప్రక్రియపై ఎలాంటి జోక్యం లేదన్న రాజీవ్ శుక్లా
తుది నిర్ణయం జట్టు యాజమాన్యానిదే: రాజీవ్ శుక్లా
సరైన సమయంలో అవకాశం లభిస్తుందని వ్యాఖ్య
వైభవ్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన రాజీవ్ శుక్లా
-
Jul 04, 2026 10:58 IST
లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ ఆపరేటివ్స్‌పై కేంద్రం చర్యలు
23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
యూఏపీఏ కింద అధికారిక నోటిఫికేషన్ జారీ
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు
డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా చేసినట్లు కేంద్రం వెల్లడి
ఉగ్రవాదుల చొరబాట్లకు సహకరించారని ఆరోపిస్తూ చర్యలు
-
Jul 04, 2026 10:54 IST
ఖమ్మం: కల్లూరులో దారుణం
మద్యం మత్తులో కొడుకును కొట్టి చంపిన తండ్రి
మృతుడు కొత్తపల్లి కిరణ్‌కుమార్(35)గా గుర్తింపు
పరారీలో నిందితుడు సీతారాములు
-
Jul 04, 2026 10:38 IST
కొమురంభీం: కెరమెరి మం. సూర్దపూర్ శివారులో పోడురగడ
పోడు భూముల స్వాధీనానికి అటవీ శాఖ అధికారుల యత్నం
అడ్డుకున్న రైతులు, అటవీ శాఖ అధికారులతో వాగ్వాదం
పోలీస్ బందోబస్తుతో ట్రెంచ్‌లు తవ్వుతున్న అధికారులు
-
Jul 04, 2026 10:37 IST
హైదరాబాద్: ఈసీ నుంచి వచ్చిన 2 అభ్యంతరాలకు సమాధానం ఇచ్చాం: కవిత
కొత్త పేర్లు ఇచ్చేది లేదు.. న్యాయపోరాటానికి సిద్ధం: కవిత
-
Jul 04, 2026 10:36 IST
ఇరాన్ చర్చలపై అమెరికా మీడియా కథనాలను ఖండించిన ఇజ్రాయెల్
ఇరాన్ నేతలను హతమార్చాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్టు అమెరికా మీడియాలో కథనంపై స్పందన
అవన్నీ ‘ఫేక్ న్యూస్’ అని తిరస్కరించిన నెతన్యాహు కార్యాలయం
-
Jul 04, 2026 10:34 IST
అమెరికాలో 250వ స్వాతంత్య్ర వేడుకలు ప్రారంభం
టైమ్స్ స్క్వేర్‌లో అంబరాన్నంటుతున్న సంబరాలు
పర్యాటకులు, స్థానికులతో కిక్కిరిసిన టైమ్స్ స్క్వేర్
-
Jul 04, 2026 10:32 IST
వరంగల్: భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత
ఆలయాన్ని శుద్ధి చేసేందుకు భారీగా వచ్చిన బీజేపీ శ్రేణులు
ఆలయం దగ్గర బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
పోలీసులతో బీజేపీ కార్యకర్తల వాగ్వాదం, తోపులాట
తడిదుస్తుల స్నానాల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆలయాన్ని అపవిత్రం చేశారని బీజేపీ ఆరోపణ
-
Jul 04, 2026 10:31 IST
హైదరాబాద్: కవిత పార్టీకి ఈసీ షాక్
TRS పేరు మార్చాలని ఈసీ ఆదేశాలు
TRS పేరు కొనసాగించేందుకు వీల్లేదని కవితకు లేఖ
TRS పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయి: ఈసీ
15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలి: ఈసీ
ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే దరఖాస్తు క్లోజ్ చేస్తాం: ఈసీ
-
Jul 04, 2026 10:14 IST
ముంబై: అహల్యానగర్‌లోని రాహురి ప్రాంతంలో స్కూల్ బస్సు బోల్తా
కొండ్వాడ్ గ్రామ సమీపాన బోల్తాపడిన పాఠశాల బస్సు
ఈ ప్రమాదంలో సుమారు 15 మంది విద్యార్థులకు గాయాలు
ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు
-
Jul 04, 2026 10:14 IST
మలేషియా ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం
టేకాఫ్‌కు ముందే లోపం గుర్తించిన పైలట్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన విమానం
ప్రయాణికులకు హోటల్‌లో బస ఏర్పాటు చేసిన ఎయిర్‌లైన్స్
-
Jul 04, 2026 10:13 IST
మాజీ సీఎం రోశయ్య జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు
విలువలతో కూడిన రాజకీయాలు, ఆర్థిక క్రమశిక్షణకు రోశయ్య ప్రతీక
ప్రజాజీవితంలో రోశయ్య చెరగని ముద్ర వేశారు: సీఎం చంద్రబాబు
-
Jul 04, 2026 10:11 IST
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
అల్లూరి ధైర్యం, దేశభక్తి యావత్ భారత జాతికి చిరస్మరణీయం: చంద్రబాబు
-
Jul 04, 2026 10:09 IST
అమరావతి: నేడు వంగవీటి మోహనరంగా 79వ జయంతి
నివాళులు అర్పించిన వంగవీటి రాధాకృష్ణ, అక్కల గాంధీ, బొప్పన భవకుమార్
పేదల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు: వంగవీటి రాధా
రంగ ఆశయాల సాధనకు అందరూ కలిసి పనిచేయాలి: రాధా
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రంగాను స్ఫూర్తిగా తీసుకోవాలి: రాధా
-
Jul 04, 2026 10:02 IST
యూపీ: ఆగ్రాలో భర్తను చంపి టైల్స్ కింద పాతిపెట్టిన భార్య
బాత్‌రూమ్‌లో సురేంద్ర శర్మ(45)ని పాతిపెట్టి కాంక్రీట్ వేసిన భార్య
నిందితురాలు రూబీశర్మను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్న పోలీసులు
-
Jul 04, 2026 08:55 IST
శ్రీసత్యసాయి: తనకల్లు మండలం బొంతలపల్లిలో పులి కలకలం
హంద్రీనీవా దగ్గర సంచరిస్తున్న పులి
ఆందోళనలో రైతులు, సమీప గ్రామస్థులు
-
Jul 04, 2026 08:55 IST
20 ఏళ్ల ప్రజా జీవితాన్ని ఎక్స్ వేదికగా ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి
మిడ్జిల్‌లో రేవంత్ రెడ్డిగా మొదలై.. ప్రజల గుండెల్లో రేవంతన్నగా ఎదిగా: సీఎం రేవంత్
ప్రతి పోరాటంలో అండగా నిలిచిన ప్రజలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్
-
Jul 04, 2026 08:38 IST
అమర్‌నాథ్ యాత్ర–2026: జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక మెడికల్ క్యాంప్‌ల ఏర్పాటు
ఉధంపూర్ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ సేవలు
-
Jul 04, 2026 08:35 IST
ఏఏపీఐ హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్న నీతా అంబానీ
ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన కార్యక్రమంలో అవార్డు స్వీకరించిన నీతా అంబానీ
-
Jul 04, 2026 08:16 IST
సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
జెడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగిన రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ప్రశంస
ప్రజా సమస్యలపై పోరాటం, నాయకత్వాన్ని కొనియాడిన పొన్నం ప్రభాకర్
తెలంగాణ అభివృద్ధిపై సీఎం దూరదృష్టిని ప్రశంసించిన మంత్రి
సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష
-
Jul 04, 2026 07:26 IST
అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం: విపత్తు నిర్వహణ సంస్థ
అల్పపీడనం మరింత బలపడే అవకాశం: విపత్తు నిర్వహణ సంస్థ
నేడు అల్లూరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాల హెచ్చరిక
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
-
Jul 04, 2026 07:25 IST
బద్రీనాథ్ ధామ్‌లో కానుకలు, విరాళాల చోరీపై ఆరోపణలు
అయోధ్య తరహాలోనే బద్రీనాథ్ ధామ్‌లో స్కామ్ జరిగినట్లు ఆరోపణలు
చోరీ అంశంపై విచారణకు ఆదేశించిన బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ
-
Jul 04, 2026 07:21 IST
మాంచెస్టర్: నేడు ఇంగ్లండ్‌తో భారత్ రెండో టీ20
రాత్రి 7గంటలకు మ్యాచ్
-
Jul 04, 2026 07:19 IST
చిత్తూరు: నేడు కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన
కడపల్లిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న చంద్రబాబు
శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాల్లో పర్యటించనున్న సీఎం
పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న చంద్రబాబు
కుప్పం ఆర్టీసీ మోడల్ డిపోను సందర్శించనున్న సీఎం చంద్రబాబు
మధ్యాహ్నం కుప్పంలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర భారీ బహిరంగసభ