Share News

ఇంగ్లండ్‌తో రెండో టీ20: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. సచిన్ రికార్డ్ బ్రేక్

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:40 PM

ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం రానే వచ్చింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్‌తో రెండో టీ20లో అరంగేట్రం చేయనున్నాడు. భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ నుంచి క్యాప్ అందుకున్నాడు.

ఇంగ్లండ్‌తో రెండో టీ20: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. సచిన్ రికార్డ్ బ్రేక్
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడా.. ఎప్పుడా.. అని ఎదురుచూస్తోన్న క్షణం రానే వచ్చింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్‌తో రెండో టీ20లో అరంగేట్రం చేయనున్నాడు. భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ నుంచి క్యాప్ అందుకున్నాడు. దీంతో 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తొలి ప్లేయర్‌గా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 16 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ డెబ్యూ చేయగా.. వైభవ్ 15 సంవత్సరాల 99 రోజులకే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. మాంచెస్టర్ వేదికగా జరుగనున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ చేయనుంది. కాగా వరుస మ్యాచుల్లో విఫలమైన సంజు శాంసన్‌పై వేటు పడింది. అతడి స్థానంలోనే వైభవ్ సూర్యవంశీ ఆడనున్నాడు.


భారత తుది జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, శివం దూబె, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

ఇంగ్లండ్ తుది జట్టు:

హ్యారీ బ్రూక్(కెప్టెన్), ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, శామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, టంగ్


ఇవి కూడా చదవండి:

వింబుల్డన్ 2026: ఫెదరర్ రికార్డును సమం చేసిన జకోవిచ్

మెస్సి ఖాతాలో మరో అరుదైన ఘనత

Updated Date - Jul 04 , 2026 | 06:55 PM