Share News

మమతకు మరో షాక్.. రాజీనామా చేసిన పార్టీ ప్రెసిడెంట్ చంద్రిమా భట్టాచార్య

ABN , Publish Date - Jul 04 , 2026 | 03:04 PM

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత చంద్రిమా భట్టాచార్య టీఎంసీ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ పదవికి శనివారం రాజీనామా చేశారు. అంతేకాదు.. పార్టీలో తనకు కేటాయించిన అన్ని పదవులకు కూడా ఆమె రాజీనామా చేశారు.

మమతకు మరో షాక్.. రాజీనామా చేసిన పార్టీ ప్రెసిడెంట్ చంద్రిమా భట్టాచార్య
Chandrima Bhattacharya

కోల్‌కతా, జులై 4: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేశారు. మరి కొందరు రెబల్స్‌గా మారి పార్టీని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో మమతకు ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత చంద్రిమా భట్టాచార్య టీఎంసీ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ పదవికి శనివారం రాజీనామా చేశారు. అంతేకాదు.. పార్టీలో తనకు కేటాయించిన అన్ని పదవులకు కూడా ఆమె రాజీనామా చేశారు.


నెల రోజుల్లోనే రాజీనామా..

2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత కమిటీలను రద్దు చేసి, కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే చంద్రిమా భట్టాచార్యను జూన్ మొదటి వారంలో రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. పదవిలోకి వచ్చిన కేవలం నెల రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.


ముదిరిన ఆధిపత్య పోరు

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం స్వాధీనం చేసుకుంది. తమదే అసలైన టీఎంసీ అని ప్రకటిస్తూ ఓ సమావేశం కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రితబ్రతతో పాటు ఫిర్హాద్ హకీమ్, జావేద్ ఖాన్, సందీపన్ సాహా, అఖ్రూజమాన్ తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

ఐరన్ లోపం.. మైగ్రేన్‌కు కారణమవుతుందా?

పోరాడాం.. గెలిచాం.. కాబో వెర్డ్‌పై విజయం తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

Updated Date - Jul 04 , 2026 | 03:28 PM