ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు
ABN , Publish Date - Jul 04 , 2026 | 04:10 PM
ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉల్లి కనీస మద్దతు ధరను 13 శాతం మేర పెంచింది. తాజా పెంపుతో క్వింటాలు ఉల్లి ధర రూ.1,875 నుంచి రూ.2,125కు పెరిగింది.
ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉల్లి కనీస మద్దతు ధరను 13 శాతం మేర పెంచింది. తాజా పెంపుతో క్వింటాలు ఉల్లి ధర రూ.1,875 నుంచి రూ.2,125కు పెరిగింది. ఉల్లి సేకరణను పెంచేందుకు, రైతులకు లాభం చేకూర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు తక్షణం అమల్లోకి వస్తుందంటూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ సీజన్‌లో కేంద్రం ఉల్లి ధరను పలుమార్లు పెంచింది. ఉల్లి బఫర్ స్టాక్ సేకరణ మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఉల్లి కనీస మద్దతు ధరను పలుమార్లు పెంచింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, జూన్ 1 నాటికి కేవలం 2 వేల టన్నుల ఉల్లినే ప్రభుత్వం సేకరించగలిగింది. దీంతో, పలుమార్లు ధరలను పెంచింది. ఉల్లి ధర కేజీకి రూ.12.7 నుంచి రూ.15.80కు పెంచుతూ మే 22న ఆదేశాలు జారీ చేసింది. జూన్ 13న ధరను కేజీకి రూ.16.50కు పెంచింది. జూన్ 20న కిలో ఉల్లిపాయల ధరను రూ.18.75కు పెంచింది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం, 2025-26లో ఉల్లిపాయల ఉత్పత్తి 307.33 లక్షల టన్నులకు చేరుకుంటుందది. 2024-25 మధ్య కాలంలో 307.67 లక్షల టన్నుల ఉల్లిపాయల సేకరణ జరిగింది.
ఈ వార్తలనూ చదవండి:
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీల ఖరారు.. జులై 20 నుంచి మొదలు..
మమతకు మరో షాక్.. రాజీనామా చేసిన పార్టీ ప్రెసిడెంట్ చంద్రిమా భట్టాచార్య